
పూలని కలిపి ఏరుతాను
తంగడి పూల కలప దండ చేసి అల్లుతాను
అమరుల స్థూపం మీద
నేనే దండై నిలుస్తాను
అరుణ తారను అందుకొన
అరచేతిని అక్షర ముద్ద చేసి
కవిగా నిలబడుతాను
మొబ్బులను తరుమ
చీకటి మీద చీటిక వేసి
శబ్దాలయ పద పదం పద్యం చేసి పాడుతాను
పరుల మేలుగోర జాతి గీతమై నిలుస్తాను
కాలానికి యవ్వనం ప్రాణం పోసి
నేనే కాలమై నడుస్తాను
భూహద్దులు చెరప
చెరసాల భూమిక పక్షి రెక్కలు తొడగ
స్వేచ్ఛ నేలకు నేనే నీడనై
నింగిని కప్పుతూ..
తల్లి తెలంగాణమా
విశ్వ పోరుల అగ్ని వీణమా
యాస బాసల మాగాణమా
మా గుండె తలుపుల తడి వానమ్మా
అందుకోవ్ అమ్మ
కోట్ల కోట్ల జన నేత్రాల
జీవ దీపమాల
యాస భాషలన్నీ తెలంగాణ యాస బాసే
లెస్సయని తెలుగు సంబరాల తెలప
కదిలిరావ్ తల్లి
తెలుగోని నోట
…జన జ్వాల
9949163770