
అన్నవరం దేవేందర్
గోడ గడియారం ఊపిరి మొస లోంచి
ఉరుకులు పరుగులకు ఇక విరామం
కదులుతున్న రెండు ముండ్ల మధ్యన
కదలని సమయం నా సర్వ స్వంతం
తలుపు తెరిచిన పంజరం నుంచి
నింగికి ఎగిరిన విహంగ సమయంనింగికి ఎగిరిన విహంగ సమయం
ప్రహరీలు దాటి పరదాలు వీడి
జీవితం కొనసాగింపుగా వివర్ణ ప్రయాణం
సెలవుల, సెలవుచీటీల వెంపర్లాటకు సెలవు
రోజులన్నీ తెల్లకాయిదాల్లాంటి
ఆదివారాలే
అక్షరాల వ్యవసాయ పారాయణమే తరువాయి
నా సమయం నా ఇష్టం, నా కష్టం
నా కాళ్లు, నా చేతులు ,నా కలం ప్రవాహం
ఎక్కడైనా వాలిపోవచ్చు ,లేచి పోవచ్చు
కొత్త పుస్తకాలు పాత స్నేహితులు
మనుమనితో నులివెచ్చని ముచ్చట్లు
బాయి బొక్కెనతో నవ్వులను తోడు కోవడమే విరామ జీవన వికాసం.