గ్రీన్ బుక్

చిత్రం : గ్రీన్ బుక్

దర్శకుడు : పీటర్ ఫరెల్లి

భాష : ఇంగ్లీష్

ఈ చిత్రం పేరును 1936- 19 వెలువడిన విక్టర్ హ్యూగో రాసిన “ద నీగ్రో మోటారిస్ట్ గ్రీన్ బుక్ ఆధారంగా తీసుకొని తీసిన ఈ చిత్రం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక సంవత్సర కాలంలో జరిగిన ప్రయాణం కథనే ఈ గ్రీన్ బుక్ సినిమా.1962 లో ప్రముఖ వాయిద్య కారుడు డాన్ శిర్లే మరియు బౌన్సర్ మరియు డ్రైవర్ గా పనిచేసే టోనీ కి మధ్య జరిగిన ప్రయాణం లో ఎదురైన సంఘటనలను నల్ల జాతీయులు పట్ల మరియు తెల్ల జాతీయులు ఎలా వ్యవహరిస్తారనే కోణాన్ని దర్శకుడు చాలా జాగ్రత్తగా చూపించారు. నల్ల జాతీయులు అంటే చిన్న చూపు ఉండే టోనీ, శిర్లే దగ్గర డ్రైవర్ గా చేరతాడు .శిర్లే , టోనీ ల ఆలోచన విధానంలో చాలా మార్పులుండేవి. శిర్లే కి ఎదురైన చాలా సమస్యల నుండి తప్పు చేసైనా బయటపడేయలని చూస్తాడు.అది ఇష్టం లేని శిర్లే నితాయితిగా చాలా సాదాసీదాగా ఉండాలనుకుంటాడు.శిర్లే పియానో వాయించే విధానం చూసి టోనీ మంత్ర ముగ్దుడైతాడు. అలాగే టోనీ అనుకున్నది ఎలాగైనా సాధించాలనే పట్టుదల చూసి శిర్లే కి కూడా టోనీ పై మంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.ఇలా చివరికి ఇద్దరి మధ్య చాలా మార్పులు వచ్చి టోనీ కూడా నల్ల జాతీయులు పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. శిర్లే పాత్రలో ప్రముఖ నటుడు మర్షల్ అలీ అద్భుతమైన నటనతో ఉత్తమ సహాయ నటుడు గా ఆస్కార్ అవార్డ్ కూడా పొందాడు. అలా దర్శకుడు సున్నితమైన అంశాన్ని చక్కటి స్క్రీన్ ప్లే తో విమర్శలకు దారితీయకుండా తీశారు . కానీ ఈ చిత్రం ఆస్కార్ అవార్డులు పొందిన తర్వాత కొన్ని విమర్శలను కూడా వచ్చినా ఆస్కార్ లో మూడు అవార్డులను గెలుపొంది ఎంతో మంది అభిమానుల మన్నలను పొందింది.

పాకిస్థాన్ నేపథ్యంలో సాగిన సాహస గాథ

చిత్రం : రాజి

దర్శకురాలు : మేఘనా గుల్జార్

భాష : హిందీ

బ్రిటిషర్స్ నుండి స్వాతంత్రం పొందిన తర్వాత సువిశాల భారతదేశం రెండు ముక్కలైంది. హిందుస్థాన్-పాకిస్థాన్‌గా విడిపోయాక దాయాదుల మధ్య తరచూ ఏదో ఒక అంశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాంటి పరిస్థులలో నెలకొన్న యుద్ధాల్లో ఒకటి 1971 ఇండియా-పాకిస్థాన్ వార్. ఈస్ట్ పాకిస్థాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ప్రత్యేక దేశం కోసం తిరుగుబాటు మొదలైన నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జరిగిన పరిణామాలతో భారత్ మీద దాడి చేసేందుకు పాకిస్థాన్ కుట్రలు చేసింది. అయితే ఈ కుట్రలు భగ్నం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇండియన్ ఇంటలిజెన్స్ ఏజెంట్స్. అలాంటి ఏజెంట్లలో ఒక కీలకమైన ఏజెంట్ కథే ‘రాజి’ చిత్రం.యదార్థ జీవిత సంఘటనలు, మరియు హరిందర్ సిక్కా రాసిన కాలింగ్ సెహమత్ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.బార్డర్ లో ఉండి దేశం కోసం పోరాడే సైనికుల గురించి, వారి జీవితాల గురించి మనం చూశాం.. కానీ శత్రు దేశంలో ఉండి దేశం తరుపున గూఢచర్యం చేసే వారు తమ ప్రాణాలే కాదు , వారి జీవితాలను సైతం త్యాగం చేసే సంఘటనలను రాజి చిత్రంలో దర్శకురాలు మేఘనా గుల్జార్ అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రానికి అలియా భట్ తన సహజ నటనతో చిత్రానికే జీవం పోసారు.అలాగే భవానీ అయ్యర్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఆసక్తికరంగా మరియు ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ చిత్రంలో అలియా భట్ కూతురిగా, భార్యగా మరియు దేశం తరపున ఏజంటుగా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.చివరిగా ఈ చిత్రం దేశభక్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com