చిత్రం:ఆర్గో

దర్శకుడు : బెన్ అప్ఫ్లెక్

భాష : ఆంగ్లము

దర్శకుడు బెన్ అప్ఫ్లెక్ అర్గో చిత్రం 1979 లో జరిగిన ఇరాన్ నుండి అమెరికా దౌత్యవేత్తలను రక్షించే యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.ఇరాన్ లోని టెహ్రాన్ లో చిక్కిన ఆరుగురు దౌత్యవేత్తలను రక్షించడానికి అమెరికా ఏజెన్సీ C I A రహస్యంగా చేసే ఆపరేషన్ పేరే ఈ ఆర్గో. ఆ ఆరుగురిని కాపాడడానికి చాలా ఆలోచనలు చేసి అనేక మార్గాలను అన్వేషించి విఫలమైన తర్వాత … ఒక సరికొత్త ఆలోచనతో ది ప్లానెట్ అనే చిత్రం తెరక్కెక్కిస్తున్నటు అందరిని నమ్మించి చిత్రం షూటింగ్ లొకేషన్స్ చూడటానికి వచ్చానని చెప్పి ఆరుగురిని వేరే పేర్ల ద్వారా విమానాశ్రయంలో లో ఎవరికి అనుమానం రాకుండా ఆ ఆరుగురికి సినిమా పై అవగాహన కల్పించి టెహ్రాన్ నుండి రక్షిస్తారు. ఈ మొత్తం కథలో ప్రతి సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు కథలో లీన మవుతారు చివరి వరకి ప్రేక్షకులు ఆందోళనకు లోనయ్యేలా అద్భుతమైన స్క్రీన్ ప్లే తో చిత్రం ప్రేక్షకులను మంత్రముగ్దులను చేస్తుంది. అలాగే ఈ చిత్రం లో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా ప్రతి ధ్వని ప్రేక్షకులను ఆకట్టుకుంది . దర్శకుడు బెన్ అప్ఫ్లెక్స్ ఈ చిత్రంలో ప్రధాన కథానాయకుడిగా నటించారు. తన నటనతో ఉత్తమ నటుడిగా కూడా ఆస్కార్ అవార్డ్ పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com