చిత్రం: భాగ్ మిల్కా భాగ్

భాష:హిందీ

దర్శకుడు: రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా

‘ఫ్లయింగ్ సిక్కు’గా ప్రపంచానికి సుపరిచితుడైన ఓ స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను అధారంగా చేసుకుని నటుడు ఫర్హాన్ అక్తర్, డెరైక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కలయికలో ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం రూపొందింది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో కుటుంబాన్ని కోల్పోయిన మిల్కాసింగ్ అనే బాలుడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఢిల్లీకి చేరుకుంటాడు. పేదరికంతో దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగించిన మిల్కా సింగ్ సైన్యంలో అవకాశం రావడంతో జవానుగా మారుతాడు. అనంతరం అతని జీవితంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోంటూ ఓ సూపర్ స్టార్ అథ్లెట్‌గా మారుతాడు. దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా ఎదుగుతాడు మిల్కాసింగ్. అనేక ఒడిదుడుకుల మధ్య మిల్కా సింగ్ తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు అనే విషయాలను దర్శకుడు రాకేష్ మెహ్రా ఆసక్తికరంగా తెరకెక్కించాడు.

ఓ అథ్లెట్ జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకలకు తోడుగా డ్రామా, ఎమోషన్, హ్యూమర్, విషాదం అనే అంశాలతోపాటు సృజనాత్మకతను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మిల్కాసింగ్ పాత్ర పోషించిన నటుడు ఫర్హాన్ అక్తర్, నటించాడు అనేదానికన్నా జీవించాడు అంటేనే బాగుంటుంది అనే స్థాయిలో ప్రదర్శన చేశాడు. విపత్కర పరిస్థితుల నుండి విజేతగా మారిన అథ్లెట్ మిల్కాసింగ్ జీవితాన్ని దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తెరకెక్కించిన విధానం, పూర్తి సందేశాత్మకంగా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com