ద షేప్ ఆఫ్ వాటర్

చిత్రం : ద షేప్ ఆఫ్ వాటర్

దర్శకుడు: గుల్లెర్మో డెల్ టోరో

భాష : ఇంగ్లీష్

ఈ చిత్రం గొప్పతనం ఏంటంటే 13 అంశాలలో ఆస్కార్ నామినేట్ కాగా నాలుగు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం సమాజంలో వెలివేయబడి ప్రమాదంలో గొంతు మూగబోయిన ఒక స్త్రీకి మరియు ఉదరస్వభావం గల ఒక వింత జీవికి మధ్య జరిగిన ప్రేమ కథయే ఈ చిత్రం.1962 రెండో సంవత్సర యుద్ధం జరిగిన సమయంలో కథగా చూపిస్తారు.ఒంటరి గా ఉండే ఎలిశా ఒక ప్రయోగశాలలో పనిచేస్తున్న సమయంలో ఆ ప్రయోగశాలకు శాస్త్రవేత్తలు ఒక వింత జీవిని తీసుకొస్తారు.అది కొంచెం మానవ ఆకారం పోలి ఉంన్న జీవికి ఎలిశా ఇంటింనుండి తెచ్చిన ఆహారం పెడుతూ ఉంటుంది అలా ఆ జీవికి ఎలిశా దగ్గరవుతుంది.ఈ చిత్రం లో మెయిన్ విలన్ గా రాబర్ట్ ప్రయోగశాలకు ముఖ్య అధికారిగా ఉంటాడు మొదటి ప్రయత్నం లో ఆ జీవి రాబర్ట్ రెండు వేళ్ళని గాయపరుస్తుంది.. దానితో కోపం పెంచుకున్న రిచర్డ్స్ ఒకరోజు ఆ వింత జీవిపై దాడిచేస్తాడు.అదే సమయంలో అక్కడికి వచ్చిన కల్నల్ ఆ జీవి గురించి తెలుసుకుంటాడు దానిని అమెజాన్ నది నుండి తీసుకొచ్చారని మనిషి ఆహాభావలను అర్థం చేసుకోగల జీవి అని దానిపై ప్రయోగం చేయడానికి సిద్ధపడతారు. ఈ మొత్తం సంఘటనని గమనించిన ఎలిశా ఆహ్ వింత జీవిని కాపాడాలని తన స్నేహితుడు గయల్స్ ని సాయంతో ఆ జీవిని ఇంటికి తీసుకెళ్లి దానిని రక్షిస్తుంది.ఎలాగైనా దానిని నీరు ఉన్న నదిలోకి వదలాలి అని నిర్ణయించుకుంటుంది. ఆ ప్రయత్నం లో ఉండగా రిచర్డ్స్ కి ఈ విషయం తెలుసుకుని వీళ్ళ ప్రయత్నాన్ని అడ్డుకొని ఆ వింతజీవి తో పాటు ఎలిశా మరియు గయల్స్ ని కూడా కాల్చేస్తాడు.. ఆ వింతజీవి మల్లీ తిరిగి లేచి రిచర్డ్స్ ని చంపి ఎలిశా శవాన్ని ఎత్తుకొని నదిలో దుకేస్తాడు. ఎలీషాకి శ్వాస అందించి ప్రాణం పోస్తాడు. దర్శకుడు ఈ చిత్రంలో వారిద్దరి మధ్య ప్రేమని కాకుండా ప్రేమకి ఆకారం కానీ స్వభావం కానీ ఉండవని అది నీరు ఎలా ఐతే ఆకారం లేకుండా ఏ పాత్రలో ఐనా ఆ పాత్ర ఆకారంలో ఒదిగిపోతుందో…నిజమైన ప్రేమ కూడ ఎటువంటి ఆకరమైన వాళ్ళ లోకి వెళ్ళినపుడు ఆ ప్రేమ ఒడిగిపోతుంది అని ఎలిశా మరియు వింతజీవి ప్రేమ ద్వారా చూపించాడు. ఈ చిత్రం చూస్తున్నపుడు ఆద్యంతం విజువల్ వండర్ గా అద్భుతంగా తెరకెక్కించారు.

చిత్రం:హిందీ మీడియం

దర్శకుడు : సాకేత్ చౌదరి

భాష : హిందీ

భారతదేశంలో విద్య ఎప్పుడూ ఒక సున్నితమైన అంశంగానే ఉంటూ వస్తోంది. ప్రస్తుత కాలంలో విద్య ఒక వ్యాపార వస్తువుగా మారిన విషయం బహిరంగ రహస్యం. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువు, అణగారిన వర్గాల ‌ఇబ్బందులు వంటి అంశాల ప్రాతిపదికన దర్శకుడు సాకేత్ చౌదరి, ‘హిందీ మీడియం’ చిత్రాన్ని తెరకెక్కించారు.

ఢిల్లీలో నివసించే రాజ్ బత్రా( ఇర్ఫాన్ ఖాన్) వ్యాపారం చేస్తూ, జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య మితా( సబా ఖమర్) ఆధునిక భావాల కల‌ మహిళ. వారు తమ కూతురు పియాను ఢిల్లీ లో ఉన్న పేరొందిన ప్రైవేటు పాఠశాలలో అడ్మిషన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తారు. అయితే రైట్ టు ఎడ్యుకేషన్ ‌కోటాలో అయితేనే అడ్మిషన్ దొరుకుతుందని తెలుసుకున్న రాజ్ బత్రా దంపతులు, కొద్ది రోజులు తమకు తాముగా పేద జీవితం గడిపేందుకు నిర్ణయించుకున్నారు. వెంటనే వారుంటున్న బంగ్లాను ఖాళీ చేసి, దక్షిణ ఢిల్లీలో ఉండే బస్తీకి వలస వెళ్తారు. కూతురు అడ్మిషన్ ‌కోసం, రాజ్ దంపతులు పడిన కష్టాన్ని,మన సమాజాన్ని బాషా ఏ విధంగా విభజిస్తుంది అనే విషయంలో చాలా సందర్భోచిత అంశాలతో వివరించింది. భారతదేశంలో ఆంగ్లం-మాట్లాడే ప్రజలు ‘ప్రీమియం క్లాస్’ గా ప్రచారం చేయబడతారు, అలాగే హిందీ-మాట్లాడే వారు మాస్ గా ఉంటారు అనే విధానం బయట ఎలా ఉందో చాలా చక్కగా చూపించారు దర్శకుడు సాకేత్ చౌదరి.అలాగే నటుడు ఇర్ఫాన్ ఖాన్ అద్భుతమైన నటనతో ఉత్తమ నటుడు అవార్డ్ కూడా సొంతం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com