ఆస్కార్ అవార్డ్ విజేత 2020

చిత్రం:పారసైట్

దర్శకుడు : బోంగ్ జూన్ హో

భాష : కొరియన్

ఉత్త‌మ చిత్రంగా ఎంపికైన పారాసైట్( కొరియ‌న్ చిత్రం) ఏకంగా నాలుగు ఆస్కార్ అవార్డుల‌ని సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి గాను ఉత్త‌మ డైరెక్ట‌ర్ అవార్డ్ కూడా ద‌క్క‌డం విశేషం.

మొదటినుండీ ఎన్నో ఊహగానాలతో పోటీలో నిలిచిన పారాసైట్ అనే ఈ ద‌క్షిణ కొరియా చిత్రం

మానవ సంభందాల్లో ఉన్న మంచి,చెడులను రెండింటిని ఈ సినిమా ఆవిష్కరిస్తుంది. మధ్య తరగతి జీవితాలు ఎంత దుర్బరమో..దాని నుండి బయిటపడటానికి ఎంత కష్టపడతారో, ఎంతకు తెగిస్తారో చూపెడుతుంది. అదే సమయంలో అందుకోసం చేసే పనులు …ఏ విధంగా ఇరుకున పెడతాయో స్పష్టంగా చూపించారు. ఈ పాత్రల్లో మనని మనం చూసుకోగలుగుతాం. వాళ్లు చేసింది తప్పు అయినా మనకు వారిపై కోపం రాకుండా సానుభూతి పెరుగుతుంది. అయ్యో..వీళ్లు ఈ సమస్య నుంచి ఎలోగోలా బయిటపడితే చాలు అని ప్రార్ధించాలనిపిస్తుంది. ఆ విధమైన ఎమోషన్స్ తో సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు బోంగ్ జూన్ హో .ఈ చిత్రం లో వినోదం తో పాటు భావోద్వేగాలకు పట్టం కడుతూ ఆస్కార్ అవార్డుల పంట పండించారు.

ఫిలింఫేర్ అవార్డుల్లో గల్లీ బాయ్

చిత్రం : గల్లీ బాయ్

దర్శకురాలు : జోయ అక్తర్ భాష : హిందీ

గల్లీ గ్యాంగ్ అనే ర్యాప్ బృందాన్ని నిర్వహిస్తున్న ముంబాయ్ వాసులు డివైన్, నేజీల నిజ జీవిత అనుభవాల స్పూర్తితో జోయ తెరకిక్కించిన చిత్రమే గల్లీ బాయ్.ఈ చిత్రం ఫిలింఫేర్ లో గత రికార్డులను తిరగరాస్తు మొత్తం 13 అవార్డులను సొంతం చేసుకుంది.

ధారవి మురికి వాడాలో పుట్టి పెరిగిన ఒక పేదింటి యువకుడి కథే గల్లీ బాయ్

మురాద్(రణవీర్ సింగ్) ఒక డ్రైవర్ కొడుకుగా మనకు పరిచయం అవుతాడు. అప్పుడే యువతకు పరిచయమైన ర్యాప్ సంగీతం నేర్చుకోవాలి అనే తపనతో చదువు కూడా పక్కన పెట్టి తనకు తెలిసిన విషయాల పై ర్యాప్ చేస్తుంటాడు తన తండ్రి మాత్రం తన కొడుకు బాగా చదివి మంచి ఉద్యోగం పొందాలి అని కోరుకుంటుంటే తను మాత్రం ర్యాప్ సింగర్ అవ్వాలని అరటపడుతుంటాడు. తన ప్రయాణంలో అనుక్షణం తనకు తోడుగా ఉంటూ తన ప్రతిభను గుర్తించి మురాద్ ప్రేయసిగా సఫీనా(అలియా భట్) తన నటనను ఆకట్టుకునేలా నటించింది.

ఎవరు తనకు సహకరించకున్న అప్నా టైం ఆయేగా అంటూ తన ర్యాప్ ని కొనసాగిస్తున్న సమయంలో అతనికి ర్యాపర్ షేర్ పరిచయం అవుతాడు ఇక్కడితో తన కథ మలుపు తిరగడం ర్యాపర్ షేర్ మురాద్ ప్రతిభను గుర్తించి ర్యాప్ చేయడంలో మెలుకువలు నేర్పడం తో నూతనమైన ర్యాపర్ గా గల్లీ బాయ్ అవతరిస్తాడు.

దర్శకురాలు జోయ అక్తర్ కష్టాల్లో ఉండి సాధించాలనే పట్టుదలతో ప్రయత్నించే ప్రతిఒక్కరికి స్పూర్థిగా ఒక మాములు కథాంశం ఎన్నుకొని ఆ కథను అద్భుతంగా చిత్రీకరించి ప్రేక్షకుల ముందు నిలబెట్టి ప్రేక్షకులను ముగ్ధులను చేయడం లో విజయం సాధించారు. ముంబాయి మురికివాడల్లో పుట్టిన మురాద్ లాంటి ఒక పాత్రకి రణవీర్ సింగ్ ని ఎన్నుకోవడం రణవీర్ సింగ్ పాత్రను ప్రతి ఒక్కరు తమకు తెలిసిన కుర్రాడు అనేలా పాత్రను మలచడం లో జోయ విజయం సాధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com