డా.బెల్లంకొండ సంపత్ కుమార్

ఇన్నాళ్లు అమ్మ కడుపులో వెచ్చగా ఉన్నది

పడిపోతానని భయమేమో!

పుట్టుకతోనే పట్టువెతుకు తున్నది

గులకరాళ్ళతో ఆడుకుంటున్నది

గాలితో పాడుకుంటున్నది

తీరని బాల్య స్పృహ

చల్లగా చిలకరిస్తున్నది

హొయలులు నేర్చింది

ఎత్తుపల్లాలు లెక్క లేదంటున్నది

ఎంత వయసరిదో!

ఉడుకు నెత్తురు ఉరుకుగా

హోరెత్తుతున్నది. పడిలేస్తున్నది

గారాబంగా కలుపుకుంటున్నది

ప్రేమ చాపల్యం లేకపోతే ప్రాణమిస్తదా !

అంతేనా భూమి పట్టి పాకుతున్నది.

చెట్టు గుట్ట తోడుగా

భుజ మిచ్చి సాగుతున్నది.

ఎన్నిపరివేదనలో!

మజిలీలు మజిలీలుగా విస్తరించుకున్న బంధాలో!

భవసాగర సంగమం మైళ్ళు నడిచి

ఉప్పు పేరిన పెరుగన్నం తట్ట

అనుభవాలు తలపోసుకుంటున్నది.

అలసట ఎరుగని ప్రవాహం

ఇప్పు డోక తపస్వి నిశ్చలత్వం కోసం

జీవన సంగీతం వింటున్నది.

కాలంతో ప్రయాణం ఎవరాపుతారు..!

ఉద్యుక్త ధర్మం తప్ప మరు చూపు లేని వాహిని

సముద్రాన్నిఢీ కొంటున్నది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com