డా. సి.హెచ్.ఆంజనేయులు
ఆకాశం అంచుల దాకా పతంగులతో విన్యాసాలు స్థానం
అక్కడ అక్కడ పొగ మబ్బులు కమ్మేస్తున్నాయి
కాలం కరిగిపోతుంది దూరం పెరిగిపోతోంది
భారం ఎక్కువ ఉంది
భారంగా జీవితకాలాన్ని నడిపించాలి
ఆశల లోగిళ్ళు పైనుండి అనంతంగా సాగిపోయే
జనజీవన విస్తృతమైన ప్రాణం కష్టాలు లేని కరుణ లేని కాలంలో కరోనా ఇబ్బందులకు గురి చేసింది మరణాలను తెచ్చి పెట్టింది
ఏ పండుగలు పబ్బాలు ఎన్ని వచ్చినా ఖర్చుల దండకం బాబు బాగా పెరిగింది
ఎన్ని దినుసులు కొన్న ఇంకా కొనాల్సిన ఎన్నో ఉన్నాయి
అందుకే కాలాన్ని ప్రశ్నించిన ఖరీదైన జీవితాన్ని భరించలేకుండా ఉన్నాము
మనిషికి ఉద్యోగాల్లేక లాక్ డౌన్ కాలంలో ఆర్థికంగా చిక్కిపోయాడు
లాక్ డౌన్ ఎంత విధించింది కష్టాలను కన్నీళ్లను మరణాలను విషాదాల అంతే లేదు