ప్రపంచీకరణతో తెలుగు కథలో వచ్చిన పరిణామం తెలిపే వ్యాపం…

ఎసుధైక కుటుంబం’ అనే భావన భారతదేశంలో ఏళ్ళ క్రితం నుండే ఉంది. Universal Brotherhood అన్నది క్రైస్తవం, ఇస్లాం కూడా అంగీకరించింది. ఏల్లలోకము ఒక్క ఇల్లె’ అన్నాడు గురజాడ. ఇట్లా ప్రపంచం ఒక్కటై సాగాలనే కాంక్ష అందరిలో ఉంది. ఈ కాంక్షకు అనుగుణంగానే ప్రపంచీకరణ జరిగిందా? ప్రపంచమంతా ఒక్కటే అనే

భావన పైకి అందంగానే ఉంది. అంతరార్థం అదేనా? జరుగుతున్నది అలానే ఉందా? ప్రపంచం కుగ్రామమైంది. అదే సమయాన ఎవరి ప్రపంచం వారిదైంది. ఎందుకిట్లా అయింది? ప్రపంచీకరణ పేరున జరిగింది. జరుగుతున్నది ఏమిటి?

చరిత్రను చూస్తే అనేక నాగరికతలు ఒకదాన్నొకటి సుసంపన్నం చేసుకోవడం చూస్తాం. నేడు దానికి భిన్నంగా జరుగుతుంది. ఆనాటి ఆలోచనల్లోని Brotherhood ఈనాడు జరుగుతున్న

ప్రపంచీకరణ ఒకటేనా? కాదు ప్రపంచం థిత్రం మార్కెట్లలో

ఆరు అమ్మకం అయ్యేట్లుగా అనుసంధానం చేయడమే ప్రపంచీకరణ ఉద్దేశ్యం. సంస్కృతుల ఆదాన, ప్రదానం స్థానంలో గుత్తాధిపత్యం వచ్చిచేరింది. ప్రపంచీ కరణ ప్రభావం వల్ల ప్రతిదీ మార్పుకు గురైంది. వస్తు ఉత్పత్తులు, వస్తు వినియోగం, మానవసంబంధాలు, జీవనవిధానం, సంస్కృతిసాంప్రదాయాలు, అస్తిత్వాలు అన్ని కూడా మార్పుకు గురి అయ్యాయి. మనుషులకు సంస్కృతి ఉంటది. వస్తువుకు అది ఉండదు. మనిషికి సహాయపడే గుణం ఉంటుంది. వస్తువుకు ఉపయోగపడే లక్షణం ఉంటుంది. ప్రపంచీకరణ ప్రభావం వల్ల మనిషికి అనేక వస్తులక్షణాలు అబ్బినాయి.

మొత్తంగా మనిషి ఒక వనరుగా మారిండు. సరుకుగా మారిండు. మనిషి ఉపయోగితావాద లక్షణాన్ని సంతరించుకున్నాడు. ఇదంతా చాపకింద నీరులా జరిగింది. కష్టించి పనిచేసే మనిషి, శ్రమించకుండా బతకడం నేర్చుకున్నాడు. అందుకు యంత్రసహాయం తీసుకున్నాడు. ఇది అభివృద్దిగా లెక్కించబడింది. కాని శ్రమను అప్రధానం చేసి, సంస్కృతిని అర్థం చేసుకునే విధంగా అపసంస్కృతి వచ్చి చేరడం ప్రపంచీకరణ అందించిన ఫలితాల్లో ఒకటి.

మన భాషలకంటే ఉత్తమమైనది ఆంగ్లభాష అని భావిస్తున్నాం . అక్కడితో ఆగకుండా ఇంగ్లీష్ మాట్లాడేవాడు గొప్పవాడు అనే ఆలోచనకు వ్యాప్తి కలిగింది. ఇది ప్రమాదకరం. భాష, సంస్కృతిలో విభజన, నిమ్న ఉన్నతాల సృష్టి కూడా జరిగింది. ఈ విధమైన పరిణామం తెల్లదేశాల వస్తు ప్రపంచాన్ని మనదేశానికి దిగుమతి చేసింది.

ప్రపంచీకరణ అంటే స్థూలంగా మార్కెట్ల విస్తరణ, లాభనష్టాల బేరీజు అనే అర్థం స్థిరీకరింపబడింది. ఈ సందర్భంలోనే పి.వి. నరసింహరావు ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలను మొదలు పెట్టి వాణిజ్య విధానానికి దారులు వేసింది.

మనదేశంలోకి వచ్చిన బహుళజాతి కంపెనీల వల్ల స్థానిక పరిశ్రమలు, కుల వృత్తులు కుదేలయ్యాయి. కొనుగోలుదారు యొక్క ఆర్థిక శక్తిని తన లాభాలుగా మార్చుకునే తెలివితేటలు కంపెనీలకు అధికంగా ఉన్నాయి. భారతదేశ మధ్యతరగతి మనిషికి కొనుగోలు శక్తి స్వల్పం. అందుకే ఇన్స్టాల్‌మెంట్ స్కీంలు ప్రారంభ మయ్యా యి. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే విధానాలు మొదలయ్యాయి. నగరాలు పెరిగాయి. పల్లెలు నగరీ కరణకు గురి అయ్యా యి. దీని వెనుక అభివృద్ధి నమూనాలు ఉన్నాయి. దీని ఫలితంగా పల్లెల్లో పుష్కలంగా దొరికే పాడిసంపదకు కరువు వచ్చింది. దాని స్థానంలో కోకాకోలా లాంటి విదేశీ పానీయాలు వచ్చి చేరాయి. ప్రతీ పల్లెకు రోడ్డు వేయడం ఒక రవాణా సౌకర్యం. ఆ రోడ్డు ద్వారానే బహుళ జాతి కంపెనీల వ్యాపారం పల్లెల్లో తిష్ఠవేసింది. టి.వి.లు, డిష్ లు, టెక్నాలజీ పల్లెల్లో పనిచేస్తూ, పని సంస్కృతికి పాడెకట్టాయి. ఇవన్నీ వస్తువినియోగ దాహాన్ని పుట్టించాయి. స్వసుఖ దాహాన్ని పెంచాయి. ఫలితంగా ఉమ్మడి జీవితం బీటలువారింది. శ్రామిక జీవనం చిన్న చూపుకు గురైంది. శ్రమకు దూరమైన మనిషి, కూర్చుని తినేవైట్ కాలర్ వ్యామోహాన్ని ఒంటపట్టించుకున్నాడు. అది సిద్దించక పోతే అతీతశక్తుల్ని ఆశ్రయిస్తున్నాడు. ఇదంతా గత మూడు దశాబ్దాలుగా జరుగుతున్న తంతు.

పుట్టువడి నుండి చావుబడి వరకు ప్రపంచీకరణ పరచుకొని ఉంది.

తనకు పని ఉన్నప్పుడు తన పని, లేనప్పుడు ఇతరుల పని చేసుకుంటూ బతకడం పని సంస్కృతి. మనకు ఇది పూర్వులు పరచిన పని బాట. ఇప్పుడు పనికి దూరమయిన మనిషి, తనకున్న దాన్ని ప్రదర్శనకు పెట్టడమే పనిగా పెట్టుకున్నాడు. తనకున్న దానితో ఇతరుల వస్తుసంపదని పోల్చుకోవడం మనిషి అలవాటు చేసుకున్నాడు. లేనిదాన్ని పొందడానికి అపమార్గంపడుతున్నాడు. ఇదంతా విషసంస్కృతి. ఇది సమాజసమస్త మూలాలకు పాకింది. కులవృత్తులు కుప్పకూలాయి. మైదాన ప్రాంత జీవితాలు అతలా కుతలమయ్యాయి. పట్టణ ప్రాంత ప్రజలు 1990 నాటికి ప్రపంచీకరణకు అనువుగా మలచబడ్డారు. ఆ తరువాత మరింత వేగంగా దానికి లోనయి, తమకు తాము పరాయీకరింపబడ్డారు. ఈ మార్పు ఫలితాల ప్రభావం రుచి చూసే వరకు గాని గ్రహించలేక పోయారు. ఎందుకంటే 1990లకు ముందే పట్టణ ప్రాంత ప్రజలు ఈ వైపుకు మెల్లమెల్లగా నెట్టబడ్డారు. విద్య ఆధునిక సౌకర్యాలు అందుకు దోహదపడ్డాయి.

గిరిజన ప్రాంతంలో జరిగిన మార్పులు ప్రపంచీకరణను పట్టించేవిగా ఉన్నాయి. మొదటి నుండీ పోడు వ్యవసాయం చేసుకుంటూ పశుపోషణ, వేట, అటవీ వస్తువుల సేకరణ చేస్తూ దొరికిన దాంతో కడుపునింపుకుంటూ ఆటపాటలతో గడిపిన గిరిజనులు మైదాన ప్రాంత భూస్వాముల రాకతో మార్పుకు గురయ్యారు. భూమి వారినుండి ఇతరులకు మారింది. తమ భూమికి తామే పరాయివారయ్యారు. సరళీకరణ అడవుల్లో రహదారులను పరిచింది. అడవుల్లోని ఖనిజం, ఉత్పత్తులు, సంపద, కర్ర, సమస్తం తరలించబడుతున్నది. అవి మరోచోట వస్తువులుగా మారి విపణివీధిలో కనబడు తున్నాయి. వాటితో సహజీవనం చేసిన గిరిజనులు తమ సంస్కృతికి, భాషకు, జీవన విధానానికి, ప్రాంతానికి దూరం అయి ఇక్కట్లు పడుతున్నారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రపంచీకరణ ప్రభావం పడని వర్గం, రంగం, కులం, మతం, ప్రాంతంగాని లేవు. ప్రతీ వ్యక్తి దీని బారిన పడ్డవాడే. ఆర్థిక పరిభాషలో చెప్పాలంటే ప్రతీ వ్యక్తి అప్పుపడ్డవాడే, గ్లోబలైజేషన్ ప్రభావం గురించి వివరిస్తూ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్టు పెరుగుతున్న సంపద వెల్లువలో పెద్ద పడవలు తేలియాడుతుండగా చిన్న తెప్పలు, దోనెలు ప్రవాహపు వాలుకి కొట్టుకుపోయి క్రమంగా మునిగి పోతున్నాయని” పేర్కొంది.

నేడు ప్రపంచీకరణ జీవన విధానంగా మారింది. ఇదివరకున్న అంతరాలు మరింత పెరిగాయి. తమ కష్టాల కడగండ్ల నుండి బయటపడడానికి ఉద్య మించిన ప్రజలకు, చేయూతనిచ్చిన పోరుబాటలు సన్నగిల్లాయి. శత్రువు కనిపించడం లేదు. దెబ్బలు మాత్రం తగులుతున్నాయి. ఎవరి దెబ్బ రుచి వారిదే. అనేక అంతరాల దొంతరలతో నిండిన సమాజంలో ఒక్కో దొంతర పై ఒక్కో రకమైన దెబ్బ. కనుకనే విశాల ఐక్య పోరాటాల స్థానే అస్తిత్వ ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. స్త్రీవాద, దళితవాద, మైనార్టీవాద, ప్రాంతీయవాద ఉద్యమాలు తలెత్తుకున్నాయి. సమాజం శకలాలుగా విడిపోయింది. దీనివల్ల పోరాటశక్తి సన్నగిల్లింది. ఇది చాలు ప్రపంచీకరణ తనపని తాను చేసుకపోవడానికి. ఇందుకు ఇంటర్నెట్లో సహా ఆధునిక కమ్యూనికేషన్ వ్యవస్థను, ప్రచార వ్యవస్థను, రకరకాల సాంకేతిక శాస్త్ర విజ్ఞాన సాధనాలను వినియోగించు కుంటున్నారు. అంతర్జాతీయంగా WTO ఒప్పందం కుదిరింది. మార్కెట్ విశ్వవ్యాప్తమైంది. కొత్త మార్కెట్లు, వాణిజ్యలాభాలు తేగా, కొత్తవలసల్లోని సంస్కృతులు వినోద సరుకుగా మారాయి. ఏ ఇజం లేదు టూరిజం తప్ప” అనే మాట రాజ్యమేలింది. మొత్తంగా గ్లోబలైజేషన్ అనే మాట ఫ్యాషన్ అయింది. మారక తప్పని అనివార్యస్థితిని గ్లోబలైజేషన్ తెచ్చి పెట్టింది.

ఇలాంటి గ్లోబలైజేషన్ నేపథ్యంలో తెలంగాణలో ఎలాంటి కథ వచ్చింది. ఆ కథ చిత్రించిన జీవితాలు ఎటువంటివి? జీవితాల పై ప్రపంచీకరణ ఎలాంటి ప్రభావం చూపింది. రచయితలు ఈ ప్రభావాల్ని ఏ విధంగా చిత్రించారు. వారి దృష్టి ఎలా ఉంది. ధ్వంసమైన జీవితాల్ని కథ పట్టించుకుందా? సరళీకరణను సాధనంగా చేసుకొని ఎదిగిన జీవితాల్ని చిత్రించిందా? గ్లోబలైజేషను ప్రత్యామ్నాయంగా చూ పెట్టిన పరిష్కారాలున్నాయా? ముప్పువాటిల్లిన

భాష, సంస్కృతుల రక్షణ ఎలా? వీటి థిఉBU NA BOUNSG. గోలమున్ వ్యతిరేక కథగా నిలుస్తుంది. ప్రపంచీ కరణను సమర్థించే కథకు ఎలాంటి జీవితం ఆలంబనైంది అనే విషయాలను పరిశీలించాల్సి ఉంది.

ఆర్థిక సంస్కరణల వల్ల, ప్రజాజీవితంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. తీవ్రమైన అంతరాలు ఏర్పడ్డాయి. వృత్తులు కోల్పోయి మనుషులు, పుట్టినచోట బతకలేక బతుకు దెరువు కోసం వలస వెళ్ళారు.

బొంబాయి, బొగ్గుబాయి, దుబాయి, తెలంగాణ ప్రజల వలస కేంద్రాల య్యాయి. ఈ పరిస్థితులు కుటుంబాల్లో తెచ్చిన అలజడులు అనేకం. మానవ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పారిశ్రామిక ప్రగతి, సాంకేతిక ప్రగతి అభివృద్ధిలో పోటీపడి కొందరికి ఫలాల్ని అందించాయి. అవి పేదలకు మాత్రం అందలేదు. అందకపోవడమే కాక నష్టపోయారుకూడా. సమాజం అనేక ఆటుపోట్లకు గురి అయింది. ఇటువంటి ప్రతిఫలాలను, ప్రతికూలతలను కథ పట్టించుకుంది.

గ్లోబలైజేషన్ ప్రభావాల్లో వృత్తులు నాశనమవడం ఒకటి. ఆ వృత్తులను ఆశ్రయించుకొని బతుకుతున్న ప్రజలు అనాధలైనారు. వారి జీవితం గాడి తప్పింది. వారు పనిలేక ఆకలికి అలమటించారు. పనికోసం ఉన్న ఊరుకు, కన్నవారికి దూరంగా వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి వలసలను దృష్టిలో పెట్టుకొని చేనేత కార్మికుల జీవిత నేపథ్యంలో వచ్చిన కథ “వలస”. జూకంటి జగన్నాథం రాసిన రం కథలో రెండు తరాలజీవితం ఉంది. ముదిగంటి సుజాతా రెడ్డి “వలస” కథలో వ్యవసాయం చేసే క్రమంలో ఊర్లో చేసిన అప్పులు, అవి తీర్చడానికి పల్లె విడిచి పట్నం బాట పట్టిన అట్టడుగు వర్గాల జీవితం కనపడుతుంది. ఈ “వలస” కథ తెలంగాణ భాషకు పట్టం కట్టింది. బి.వి.ఎన్.స్వామి రాసిన “వలస” కథలో అగ్రవర్ణ బ్రాహ్మణ జీవితం చిత్రితమైంది. తన పిల్లల్ని సంసారాన్ని సాదలేక ఇంటి యజమాని బొంబాయి వెళతాడు. అక్కడ శివుని గుడిలో ఉంటూ వేదం నేర్పుతాడు. ఒకరోజు శివుని గుడిలో పూజ చేస్తూ శ్వాస చాలిస్తాడు. బ్రాహ్మల జీవితాల్లోని బాధల పల్లవులు కథలో వినపడతాయి. గూడూరుసీతారాం “రంగడు” మారాజు కథలు వలస బాధల్ని చిత్రించాయి. కొక్కుల భాస్కర్ తెగిన పోగు” అంబల్లజనార్దన్ “బొంబాయి కథలు” ఐతా చంద్రయ్య, సదానంద్ శారదలు మహారాష్ట్ర వలసల పై రాసిన కథలు వలస ప్రభావాల్ని తెలుపుతాయి. “ఎడారి దీపాలు” గల్ఫ్ వలస పై కె.వి. నరేందర్ రాసిన కథ, చైతన్యప్రకాశ్ రాసిన “బతుకురేవు” కథ జీవితంలో వలస అనివార్యతను తెలిపింది. బతుకుదెరువు కోసం తెలంగాణ పల్లెల్లో దుబాయి లాంటి దేశాలకు వెళ్ళడం రివాజు. వెళ్ళిన వాళ్లు ఊరుకాని ఊరిలో బాధలు పడుతుంటారు. ఇక్కడ ఊర్లో ఉన్న భార్యా బిడ్డల బతుకు కూడా భయంతోనే ఉంటుంది. మగ దిక్కులేని స్త్రీ పరిస్థితి ఎట్లా ఉంటుందో “ఘర్షణ” అనే కథలో పెద్దింటి అశోక్ కుమార్ చిత్రించాడు.

మానవీయ విలువలస్థానే మార్కెట్ విలువలను ప్రపంచీకరణ స్థిరపరిచింది. పరస్పరాశ్రితంగా స్వయం సమృద్ధి చెందిన సమాజం స్థానంలో ముక్కలు ముక్కలుగా విడిపోయి స్వతంత్రజీవనం సాగించే సామాజిక నమూనా స్థిరపడింది. వైట్కాలర్ సంస్కృతి వచ్చి చేరింది. అవసరాలనే కాదు ఆనందాలను కూడా ప్లాన్ చేసుకోవాలనే వాతావరణం మిగిలింది. వ్యాపారం కోసం పెట్టుబడిగా ఉపయోగపడే డబ్బు, తానే పెట్టుబడిగా మారి ఫైనాన్స్ వ్యాపారంగా రూపొందింది. “డబ్బు పిల్లల్ని కంటుంది” అనే భావన వ్యాపించింది. ఈ భావన ఆధారంగా కె.వి. నరేందర్ “ఫైనాన్స్ భూతం” కథరాసిండు. హరిత విప్లవఫలితాలు మెల్లమెల్లగా అనుభవంలోకి వచ్చేసరికి దాని నిజస్వరూపం పర్యావరణ విధ్వంసంగా కనిపించింది. సమాజం అనుభవించే కరెంట్ వెలుగుల వెనుక బొగ్గు ఉంది. బొగ్గుకోసం ఓ పెస్ట్ విభాగాన్ని విస్తరిస్తుంటారు. పి. చందా రాసిన “భూనిర్వాసితులు” కథలో ఓపెన్ కాస్ట్ వల్ల బాధితులైన ప్రజలు కనిపిస్తారు.

అంపశయ్య నవీన్ రాసిన “ఊబి” అనే కథ హైక్లాస్ సొసైటీలో సైతం ప్రపంచీకరణ ఎలాంటి ప్రకంపనల్ని పుట్టిస్తుందో చెప్పే కథ. హెచ్.ఐ.వి. పాజిటివను ఊబితో పోల్చి చెప్పారు. సమాజంలో ఉన్నత స్థాయిలో గల ప్రొఫెసర్ రమణి భర్త, సంపాదన కోసం సౌదీ వెళ్తాడు. మరింత సంపాదనతో హోదా ప్రదర్శించుకోవడం అనేది ఆర్థిక సరళీకరణ ప్రభావంగా కనపడుతుంది. సంపాదన పరులైన ఇద్దరు భార్యా భర్తలు విడివిడిగా ఉండడం వల్ల శారీరక వాంఛను తీర్చుకోవడం కోసం ప్రొఫెసర్ రమణి ఇతర సంబంధాలలోకి వెళుతుంది. ఫలితంగా హెచ్.ఐ.వి. పాజిటివ్ అటాక్ అవుతుంది. నూతన జీవిత ప్రతిఫలం ఇది. ప్రపంచీకరణ ఆరోగ్యరంగాన్ని కూడా పాడుచేసిందని ఈ కథ చెబుతుంది. కుటుంబం అనేది సమాజంలో అతి చిన్న యూనిట్. అందులో దాంపత్యం అతి ముఖ్యమైంది. అటువంటి దాంపత్యంపై ప్రపంచీకరణ ప్రభావం గురించి నవీన్ కథ రాస్తే, సంతాన నియంత్రణ గురించి దంపతుల ఆలోచనలను బెజ్జారపు వినోద్ కుమార్ కథగా రాసాడు. “సంశయం” అనే కథలో రెండవ బిడ్డను కనడమా? కనకపోవడమా అనేది ఇతివృత్తం. గ్లోబలైజేషన్ అనేది ఎంతగా “థాట్ కంట్రోలింగ్’కు పాల్పడుతుందో ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. దీని ద్వారా మొత్తం సమాజం మెకానికల్ గా, ఒకేనమూనాగా మారే క్రమాన్ని కథలో చూడవచ్చు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కథలో రచయిత ఇలా అంటాడు. “సంసారాన్ని ప్లాన్ ప్రకారం నడుపుకోడం సరే… కాని అనుభూతుల్ని కూడా ప్లాన్ ప్రకారం పొందడం నేర్పి ఈ సమాజం ఎంతటి

ద్రోహం చేసింది.” అనుభూతుల్ని, ఆ క్రమంలోనే జీవితాల్ని డిజైన్ చేయడమనేది గ్లోబలైజేషన్లోని ప్రధానాంశం. డిజైన్ కు సంబంధించిన రూపాన్ని మార్కెట్ నిర్ణయించడమనేది సరళీకరించబడ్డ ఆర్థిక విధానం యొక్క పాలసీ. గ్లోబలైజేషన్ పట్ల, దాని విషపరిణామాల పట్ల మేధావులకు ఎంత జాగరూకత ఉందో నిరసన ఏమేరకు ఉందో చాలా కథల్లో తెలుస్తుంది. గ్లోబలైజేషన్ పట్ల కొంత మంది రచయితలు అనుకూలంగా కూడా ఉన్నారు. ప్రపంచీకరణ పరిణామాలను మన జీవితాలకు అనుకూలంగా మార్చుకోవాలని చెప్పేవారిలో బి.ఎస్.రాములు ఒకరు. వీరి కథల్లో “కామన్వెల్త్” అనే కథ ప్రపంచీకరణ ఫలితాల పట్ల, పరిణామాల పట్ల పరిసితికి అందస్తుతం ఉన్న

అనుకూలతను వ్యక్తపరుస్తుంది. సామాజిక తత్వవేత్తగా పేరొందిన రాములు ఈ కథను గ్లోబలైజేషన్ మీద చర్చగా వెలువరించారు. ఎల్లాకర్ అనే పాత్ర ద్వారా రచయిత గ్లోబలైజేషన్ అనుకూల వాదనలు చేయిస్తాడు. గీతాంజలి రాసిన “కథ 2020″ ప్రణాళికా బద్ధమైన ప్రభుత్వ నమూనా పై వ్యంగ్యాస్త్రం. ప్రపంచీకరణ తర్వాత ప్రస్తుతం ఉన్న పరిస్థితికి, అంతకు ముందు ఉన్న పరిస్థితికి పోలిక చూపెడుతూ రాసిన కథ ఇది. నీళ్ళిచ్చే సంస్కృతికి బదులు నీళ్ళు వదిలే సంస్కృతిని ఈ ప్రపంచీకరణ తెచ్చింది. గ్లోబలైజేషన్ అంతిమసారం అమెరికనైజేషన్ అవడమే అనేది కథ తేల్చింది. వరల్డ్ బ్యాంక్ వ్యవసాయ విధానాలు, గాట్ ఒప్పందంపై సంతకాల ప్రతిఫలాలు వర్ధమాన దేశాల పర్యావరణంపై ప్రభావం చూపెట్టాయి.

ఈ విషయాల్ని, పరిణామాల్ని దృష్టియం దుంచుకొని సంపత్ కుమార్ రాసిన కథ “డాలర వర్సెస్ మదర్” ఇందులో భూమిని తల్లిగా చేసి ప్రపంచ ప్రజలందరికి భూమాత ద్వారా ఉత్తరం రాయిస్తాడు రచయిత. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలకు మధ్య వచ్చిన పొరపొచ్చాల పట్ల వేదన ఉంది. అందరూ కలిసి భూమిని నాశనం చేస్తున్నారని, తద్వారా భవిష్యత్ అవసరాలకు విషాదాన్ని మిగులుస్తున్నారనే వేదన కనపడుతుంది. కాలువ మల్లయ్య రాసిన వందలాది కథల్లో నేలతల్లి, భస్మాసురహస్తం, గ్లోబలి, భూమిస్వప్నం కథలు ప్రపంచీకరణ దుష్పలితాలను తెలిపాయి. పాలమూరు కరువు, వలసల గురించి ఉదయమిత్ర అనేక కథలు రాసారు. పశుపోషణ భారమై పశువులు కబేళాలకు తరలి వెళ్ళడం

వెంకట్రాములు రాసిన “జంగిడి” కథలో కనపడుతుంది. సాఫ్ట్ వేర్ రంగంలో ప్రపంచీకరణ ప్రముఖంగా కనిపిస్తుంది. ఈ రంగంలో పనిచేసే దంపతుల మధ్య కలిగే స్పర్థలు, ఈ రంగం వల్ల మనుషుల మధ్య కలిగిన అంతరం, దూరం అందరూ ఎరిగినదే. ఈ విషయాలను నేపథ్యం చేసుకొని యెన్నం ఉపేందర్ “గ్లోబల్ ఉప్పెన”, “గ్లోబల్ నగరం” ఆడెపు లక్ష్మీపతి “జీవన్మృతుడు” కథలు | రాసారు. ముదిగంటి సుజాతారెడ్డి

ప్రచురించిన “మింగుతున్న పట్నం”, “వ్యాపార మృగం” కథా సంపుటాలు గ్లోబలైజేషన్ ఫలితాలను అనేక

కోణాల్లో చూ పెట్టాయి. పెద్దింటి అశోక్ కుమార్, ఇక్బాల్, పరిమళ్, ఉదయమిత్ర, దిలావర్, శిరంశెట్టి కాంతారావు, కొట్టం రామకృష్ణారెడ్డి లాంటి అనేకులు ప్రపంచీకరణ ప్రభావాల్ని కథల్లో నిక్షిప్తం చేసారు. కరువును తట్టుకోలేక బొంబాయి వలసపోవడం ఉదయమిత్ర రాసిన “పేగుబంధం” కథలో కనపడుతుంది. వలస వెళ్లిన కొడుకు కోడలు మట్టి పనిచేస్తూ మట్టిగడ్డలు మీదపడి మరణించడం జనజ్వాల రాసిన “పిచ్చిపిల్ల” కథ ద్వారా తెలుస్తుంది. గోర్లబుచ్చయ్య రాసిన “పాలమూరు పల్లె” కథలో వలసవెళ్ళిన కూలీల పై కాంట్రాక్టర్లు, మేస్త్రీలు చేసే దుర్మార్గం కథలో కనిపిస్తుంది. సంపత్ రావు రాసిన “అతకని బతుకులు” కథలో అప్పుల్లో కూరుకుపోయిన పాలమూరు వ్యవసాయం గురించి రాసిండు “కఫన్” కథలో ప్రభుత్వమే

రైతుల దగ్గర భూమిని హస్తగతం చేసుకున్న అప్రజాస్వామిక పద్ధతుల్ని ఇక్బాల్ విశదపరిచిండు.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చాక మనుషులు బావిలో కప్పలు అయ్యారని పులిపాటి గురుస్వామి “ఐటికప్ప” కథలో నిరూపించారు. ఆర్థికపరిణామాల్లోని అమానవీయ కోణాన్ని వ్యంగ్య ధోరణిలో వంశీకృష్ణ “పేచీకోరు అమ్మాయి”లో తెలిపారు. ముదిగొండ సాలగ్రామ్ “టెస్ట్ ట్యూబ్ లో కన్నీరు”, మురళీకృష్ణ “జాతర”, ఎస్వీ సత్యనారాయణ “వలస”, దోర్బల బాలశేఖరశర్మ “నీళ్ళు లేని నది”, మిట్టబోయిన వెంకటేశ్ “బతుకుదెరువు” కథలు వలస జీవిత వెలుగునీడలను రికార్డు చేశాయి. ఆధునిక అభివృద్ధి నమూనాలుగా నిలుస్తున్న ప్రాజెక్టుల వల్ల గిరిజన సంస్కృతి మాయంకావడాన్ని పద్దం అనసూయ “మూగబోయిన శబ్దం” కథ చిత్రించింది. పోలవరం ప్రాజెక్టు గురించి శిరంశెట్టి కాంతారావు “పోరువనం” కథ చెప్పింది. ఇది మానవీయ విలువ ఏ విధంగా గ్లోబల్ పరిణామం వల్ల దిగజారిందో తెలుపుతుంది. ప్రపంచీకరణ ప్రభావం అనేక కథల్లో, ఆయాకథకులు వివరించారు. కులవృత్తులు కూలిపోవడం దీనికి చెందిన ఒక పరిణామం . ఈ విషయాన్ని బి. మురళీధర్ “దశ్మి” కథలో చక్కగా వివరించారు.

కులవృత్తులు, మానవ సంబంధాలు, సంస్కృతి సంప్రదాయాలు అన్ని కూడా ప్రపంచీకరణ పుణ్యమా అని మార్పులకు లోనయ్యాయి. కొన్ని నశించి పోయాయి. ఇవన్ని విషయాలను కథ పట్టించుకుంది. ఒక వైపు కులవృత్తులు కూలిపోతుంటే మరోవైపు కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవెంట్ మేనేజ్మెంట్ పేరు మీద అనేకమైన పనులు సమాజంలో కొలువుదీరాయి. వాటిని జీవితాంతం చేస్తూ బతుకుతున్న మనుషులు కనపడుతున్నారు. చనిపోయిన మనిషి కర్మకాండకు సంబంధించి, అంత్యక్రియలు పూర్తి అయ్యేవరకు ఉండి అన్నీ తానే అయి నిర్వహించే వృత్తి ఒకటి కొత్తగా పుట్టింది. ఈ పని గురించి బి.వి.ఎన్. స్వామి రాసిన “చావు ప్యాకేజీ” కథ వివరించింది. సాఫ్ట్వేర్ రంగం కూడా కొత్తపనులు కల్పిస్తుంది. ఇలా సమాజంలో కొత్త వాతావరణం తారట్లాడుతుంది. దాని మంచి చెడ్డల గురించి కథ పట్టించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com