నాటి తెలంగాణలో సాహిత్య దీప స్తంభంగా, సాహితీ పోషకులుగా వెలుగొందిన దేవులపల్లి రామానుజరావుని ఆవిష్కరించే ప్రయత్నం…

డా|| దేవులపల్లి రామానుజరావు 20వ శతాబ్దిలో సుమారు 5 దశాబ్దాల కాలం భాషా సాంస్కృతిక వికాస

యుగాన్ని శాసించినారు. తెలుగునాట రామానుజరావు కవులకు, రచయితలకు, పండితులకు తలలోని నాలుకగా మసలుకున్నారు. ఎక్కిన ప్రతి వేదిక మీద తమ కంచు కంఠంతో సారభూతమైన ప్రసంగాలు చేసి విమర్శకులను మెప్పించారు. కవిగా, వక్తగా, పత్రికా సంపాదకునిగా, బహుభాషా వేత్తగా, విద్యావేత్తగా నిరంతరం బహు కార్యమగ్నులై సఫలజీవనం గడిపారు.

నాలుగోఫాగం వరకు ఇంటి వద్దనే విద్యాభ్యాసం సాగింది. స్థితిమంతులైన కుటుంబ నేపథ్యం వల్ల రామానుజరావు

మొదట్లో పాఠశాలకు వెళ్ళవలసిన అవసరం కలగలేదు. నాలుగో ఫారంలో హనుమకొండలోని కాలేజీయేట్ హైస్కూల్లో చేరారు. తర్వాత హైదరాబాద్ నిజాం కళాశాలలో బి.ఎ.లో చేరారు. అప్పుడా కళాశాల మద్రాసు విశ్వవిద్యాలయాని కనుబంధమై వుండేది. ఆ కాలంలోనే రామానుజరావుకు ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు తోనూ, సురవరం ప్రతాపరెడ్డి తోనూ సన్నిహిత పరిచయం ఏర్పడింది.

వరంగల్లు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా వారిని కలుసుకుంటూ వుండేవారు. చిన్నప్పుడు కాళోజి నారాయణరావు పాఠశాలలో సహాధ్యాయి. చిన్ననాడే భాషా సాహిత్యా ల పట్ల అపారమైన అభిరుచి ఏర్పడింది. కవితా వ్యాసంగం ప్రారంభించారు. గోలకొండ పత్రికలో వ్యాసాలు రాసి ప్రచురించేవారు.

1942లో ‘తెలంగాణ’ పేరుతో ఒక దినపత్రిక హైదరాబాద్ నుంచి ఆ వెలువడింది. ఆ పత్రిక సంపాదక వర్గంలో చేరమని కోరుతూ మాడపాటి హనుమంతరావు రామానుజరావుకు లేఖ రాశారు. అయితే అప్పటికే నాగపూర్‌లో న్యాయకళాశాలలో చేరడం వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు.

నిజానికి నిజాం కళాశాలలో డిగ్రీ చదువుతున్నప్పుడే రామానుజరావుకు సాహిత్యంపై గాఢమైన అభినివేశం ఏర్పడింది. భావకవుల రచనలంటే ఆ రోజుల్లో సాహిత్య విద్యార్థులకు ఎంతో మక్కువ.

రామానుజరావు కూడా భావకవిత్వాన్ని బాగా చదివారు. ముఖ్యంగా ముద్దుకృష్ణ వైతాళికులు’ బాగా ఆకర్షించింది.

రాయప్రోలు సభలకు హజరవుతూ ఆయన కవిత్వాన్ని అభిమానించేవారు. విశ్వనాథ ‘కిన్నెరసాని’ పాటలు కూడా ఆయనను బాగా ఆకట్టుకున్నాయి. విశ్వనాథ కిన్నెరసాని పాటలు స్వయంగా గానం చేస్తుండగా విని పరవశించిపోయేవారు రామానుజరావు. కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు భావకవుల ప్రణయ కవిత్వం, స్వాతంత్ర్యోద్యమం రెండూ ఆయనను ప్రభావితం చేశాయి. 1942-44 మధ్య నాగపూర్ న్యాయ కళాశాలలో చదువుతున్న కాలంలో రాసిన కవిత్వం పచ్చతోరణం’ పేరుతో 1953లో ప్రచురితమైంది. నాగపూర్లో చదువుతున్నప్పుడు స్వాతంత్ర్యోద్యమాన్ని దగ్గరినుంచి చూసి స్ఫూర్తి పొందారు. గాంధీజీ దర్శనం వార్తాలో లభించింది. పచ్చతోరణం’కు రాయప్రోలు వారు పీఠిక రాశారు. తల్లావఝల, పింగళి, మల్లంపల్లి, వేటూరి, మధునాపంతుల

మొదలైన కవిపండితుల ప్రశంసలు లభించడంతో రామాను జరావుకు కవిగా ఎంతో పేరు వచ్చింది. అదే కాలంలో అనేక పత్రికల్లో వ్యాసాలు రాశారు. విశ్వనాథ, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, పుట్టపర్తి నారాయణచార్యుల ఆశీస్సులు కూడా లభించాయి.

నిజాం రాష్ట్రంలో తెలుగువారు, కన్నడిగులు, మరాఠీలు కలిసివున్నారు.

తెలంగాణలోని ఇతర

జిల్లాల్లో తెలుగువారే అధికం, హైదరాబాద్ నగరంలో మాత్రం అన్ని ప్రాంతాల వారున్నారు. వీరేగాక కొన్ని మరాఠ్వాడా జిల్లాలు, కొన్ని కన్నడ జిల్లాలు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నాయి. నిజాంకాలంలో పాఠశాలలు తక్కువ. అక్షరాస్యత మరీ తక్కువ. మొత్తం జనాభాలో ఉర్దూ భాషీయులు పదిశాతమే అయినా నిజాము ఉర్దూను అధికార భాషగా అమలు పరిచారు. తెలుగు చదివే అవకాశాలులేవు. ప్రోత్సాహం అంతకంటే లేదు. పైగా తెలుగు చదవడం, మాట్లాడడం ఒక నేరమన్నట్లు చూసేవారు. హిందువులు సైతం షేర్వాని, పైజామా ధరించేవారు. ఇళ్ళలో, బంధుమిత్రులు, ఇతరులతో ఉర్దూలోనే మాట్లాడేవారు.

అలాంటి పరిస్థితుల్లో తెలుగును నిలబెట్టడానికి 1943 మే 26న ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడింది. తొలి అధ్యక్షులు లోకనంది శంకర నారాయణరావు. మలి అధ్యక్షులు సురవరం ప్రతాపరెడ్డి, దేవులపల్లి రామానుజరావు నాగపూర్ లో న్యాయశాస్త్ర పట్టభద్రులై తిరిగిరాగానే ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభ్యునిగా చేరారు. పరిషత్తు మొదటి వార్షిక సభలు వరంగల్లు కోటలో మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. తెలంగాణ తెలుగు ఆత్మగౌరవ ప్రదర్శకంగా జరిగాయి. ఉదయరాజు రాజేశ్వరరావు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా, కాళోజి నారాయణ రావు కార్యదర్శిగా వున్నారు. కోటలో కవి సమ్మేళనం కోసం వేసిన పందిళ్ళని రజాకార్లు దాడిచేసి తగులబెట్టారు. అయినప్పటికీ జంకక యథావిధిగా కార్యక్రమం నిర్వహించుకోవటంలో రామానుజరావు చేసిన కృషి కీలకమైంది. ఆ సభల్లో ఆయన తెలంగాణలోని ప్రాచీన ఆధునిక సాహిత్యా నికి సంబంధించిన పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. దాశరథి అక్కడ రామానుజరావుకు తొలిసారి పరిచయం కావడమే గాక ప్రదర్శనను ప్రారంభించి అభినందించారు.

ఆ కాలంలో రామానుజరావు వరంగల్లులోని శబ్దానుశాసన గ్రంథాల యానికి కార్యదర్శిగా ఉండేవారు. కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించిన ఆ గ్రంథాలయం 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1944లో రజతోత్సవం జరుపు కున్నది.

రామానుజరావు కార్యదర్శిగా ఉండగా ఈ రజతోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

రాయప్రోలు సుబ్బారావు ఉత్సవాలకు అధ్యక్షత వహించారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు ప్రారంభించారు.

1946 ప్రాంతంలో రామానుజరావు మిత్రుల ప్రోద్బలంతో వరంగల్ నుంచి ‘శోభ’ అనే సాహిత్య పత్రికను ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి, గారికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. తెలుగువారికి కేంద్ర సాహిత్య అకాడమీ అందించిన తొలి పురస్కారం అది. పత్రికకు రచనలందించిన వారిలో సురవరంవారే గాక బూర్గుల రామకృష్ణారావు, దాశరథి వంటివారున్నారు.

నాగపూర్ లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో పి.వి. నరసింహరావు, రామానుజరావుకు సహాధ్యాయి. ఎంతో స్నేహంగా ఉండేవారు. నరసింహరావు తర్వాత కొంతకాలం బూర్గుల రామ కృష్ణారావు వద్ద జూనియర్‌ న్యాయవాద వృత్తి కొనసాగించారు. ఆ రోజుల్లో నాటక ప్రదర్శనలు, అవధానాలు, గ్రంథాల యాలు, నవలలు, పత్రికలు రామాను జరావును తెలుగు సాహిత్యంవైపు ఆకర్షించాయి. సికింద్రాబాద్ లో సత్యహరిశ్చంద్ర నాటక కర్త బలిజేపల్లి లక్ష్మీకాంతం గారిని కలుసుకున్నారు. ఆయన స్వయంగా ఒక పాత్ర ధరించి ప్రదర్శించిన ఆ నాటకాన్ని రామానుజరావు మిత్రులతో కలిసి వీక్షించారు. అంతేగాక లక్ష్మీకాంతాన్ని, పానుగంటి వారిని తమ కళాశాలకు పిలిచి ఉపన్యాసాలిప్పించారు.

1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పడిన అనతికాలంలో రామానుజరావు కార్యవర్గ సభ్యుడయ్యారు. 1949లో ఉపాధ్యక్షుడయ్యారు. పరిషత్తు పరీక్షా కార్యదర్శిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా యావజ్జీవితం పరిషత్తు కోసం, తెలుగు భాషా సంస్కృతుల వికాసం కోసం పూర్తికాలాన్ని వెచ్చించారు. సారస్వత పరిషత్తు శాఖోపశాఖలుగా విస్తరించింది. రాప్రేతర ప్రాంతాల్లో పరిషత్తు పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారు తెలగునాట మూల మూలన పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందడమే గాక తెలుగు భాషా చైతన్యాన్ని వ్యాప్తి , చేశారు. పరిషత్తు ఎన్నో గొప్ప గ్రంథాలను ప్రచురించింది. నిరంతరం సాహిత్య కార్యక్రమాలు జరిగాయి. ప్రాచ్యకళాశాల, పండిత శిక్షణ కళాశాల ఏర్పాటైంది. పరిషత్తు వార్షిక సభలలో తెలుగునాట మూలమూలలనుంచి తెలుగు కవిపండితులు పాల్గొనేవారు. 1953 జనవరిలో పరిషత్తు సప్తమ వార్షిక సభలు 3 రోజులపాటు ఆలంపురంలో జరిగాయి. దేవులపల్లి రామానుజరావు పరిషత్తు అధ్యక్షుల హోదాలో సభలకు అధ్యక్షులయ్యారు. నాటి ఉపరాష్ట్రపతి డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్, హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

హైదరాబాద్ నుంచి ఆలంపురం మహాసభలకు ప్రత్యేకరైలు వేయడం చెప్పుకోదగిన విషయం . శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నుంచి శ్రీశ్రీ వరకు మహామహులైన కవి పండితులు సభల్లో పాల్గొన్నారు. పరిషత్ పరీక్షల్లో

ఉత్తీర్ణులైన వారికి పట్టాలు అందించడంతో పాటు విశ్వనాథ సత్యనారాయణ గారు స్నాతకోపన్యాసం చేశారు. డా|| రాధాకృష్ణన్ గారు ఆంగ్లంలోనూ, తెలుగులోనూ మాట్లాడారు. రామానుజరావు పరిషత్తును సర్వాంగీణంగా అభివృద్ధి పరచేందుకు చేసిన కృషి అనితర సాధ్య మైంది.

పెద్దలు సంపాదించి ఇచ్చిన భూములను పెంపు చేసుకోవడంలో, చదివిన డిగ్రీతో ఏదైనా ఉన్నతోద్యోగాన్ని చూసుకోవడంలో, న్యాయశాస్త్రపట్టంతో ప్రాక్టీసు చేపట్టి ఉన్నతస్థాయి న్యాయవాది కావడంలో రామానుజరావు శ్రద్ధ చూపివుంటే నిస్సంశయంగా ధనాన్ని బాగా ఆర్జించి ఉండేవారు. కాని చిన్ననాటి నుంచి ఇష్టమైన భాషా సాహిత్యాలను సముద్ధరించే దిశగా తన జీవన గమనాన్ని నిర్దేశించుకున్నారు. తన లక్ష్యం కోసం త్రికరణశుద్ధిగా పనిచేశారు. తెలుగు సాహితీరంగంలోని వారందరికీ అత్యంత గౌరవనీయు డయ్యారు. వారి పేర్లు చెబుతూపోతే పెద్ద జాబితా అవుతుంది. ఆయన అభిమానం పొందని, ఆయనను అభిమానించని వారు లేరంటే అతిశయోక్తి కాదు. చూడడానికి పొట్టివాడైనా సాహిత్య కృషిలో విరాణ్మూర్తిగా పేరుపొందిన రామానుజరావుకు ఈ కృషిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ రెండు భుజాలుగా, రెండు అద్భుత వేదికలుగా ఉన్నాయి. దేశానికి స్వాతంత్ర్యం రాగానే అన్ని రాష్ట్రాల్లో వలెనే 1957లో ఆంధ్రప్రదేశ్ లోనూ సాహిత్య అకాడమీ ఏర్పడింది. మొట్టమొదట డా॥ బెజవాడ గోపాలరెడ్డి అధ్యక్షులుగా, విశ్వనాథ సత్యనారాయణ ఉపాధ్యక్షులుగా, దేవులపల్లి రామాను జరావు కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అధ్యక్షులు గొప్ప సాహితీవేత్త అయినా జాతీయ స్థాయిలో బహుకార్య నిమగ్నులై పుండటం వల్ల ఆయన పనులను, తమ పనులను రామానుజరావే చూసేవారు. అకాడమీ పక్షాన శతాధిక గ్రంథాలు ముద్రించారు. ప్రముఖుల జయంతులు, వర్ధంతులు నిర్వహించారు. రచయితలు తమ పుస్తకాలు ముద్రించుకోవడానికి ఆర్థిక సహాయం అందించేవారు. ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు బహుకరించేవారు.

ఒక్కమాటలో చెప్పాలంటే గోపాలరెడ్డి, రామానుజరావుల సారథ్యంలో సాహిత్యానికి నిత్యకళ్యాణం పచ్చ తోరణంలా పండుగలు చేసేవారు. డా॥ గోపాలరెడ్డికి 75 ఏండ్లు నిండినందువల్ల

ఆ నియమంతో ఉపాధ్యక్షునిగా వున్న దేవులపల్లి రామానుజ రావు అధ్యక్షులై సాహితీసేవను నిర్విఘ్నంగా కొనసాగించారు. రామానుజరావుకు ఆంధ్ర సారస్వత పరిషత్తు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహణనే గాకుండా తెలుగు అకాడమీ, అంతర్జాతీయ తెలుగు సంస్థ, తెలుగు భాషా సమితి,

జిల్లా గ్రంథాలయ సంస్థ వంటి అనేక ఇతర సంస్థలు, వ్యవస్థలతో సన్నిహిత సంబంధం వుంది. ఆయా సంస్థల కార్యకలాపాల విస్తృతిలో ఆయన ప్రత్యక్ష పాత్రవుంది. కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వహక సభ్యులుగా 10 సంవత్సరాలు సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సిండికేటు, సెనేట్ సభ్యునిగా మధ్య మధ్య వైస్ ఛాన్సగా విశ్వవిద్యాలయ విద్యా కార్యక్రమాలపై ప్రభావం చూపారు.

1949 జనవరిలో తూప్రాన్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు జరిగాయి.

మెట్రిక్యులేషన్ వరకు ప్రజల మాతృభాషలో విద్యాభ్యాసం జరగాలని ఇంటర్, డిగ్రీ తరగతుల్లో తెలుగు, మరాఠి, కన్నడ భాషలు ద్వితీయ భాషలుగా ఉండాలని, పరిపాలనలో ప్రజల భాషకు సముచిత ప్రాధాన్యం ఉండాలని తీర్మానాలు చేశారు. ఈ తీర్మానాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చి అవి , అమలయ్యేలా చర్యలు తీసుకోవడానికి ఒక సంఘం ఏర్పడింది. దేవులపల్లి రామానుజరావు ఆ సంఘానికి కార్యదర్శిగా వున్నారు. నాటి విద్యాశాఖ మంత్రి ధోండే రాజ్ బహద్దురును కలుసుకొని చర్చలు జరిపిన ఫలితంగా మాతృభాషలో మెట్రిక్యులేషన్ వరకు విద్యాబోధనకు ప్రభుత్వం అంగీకరించింది. తక్షణం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ ఉత్తర్వుల అమలు వల్ల మాతృభాషలో విద్యాబోధనకు మార్గం సుగమమం అయింది. ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రవేశ పరీక్ష ఉత్తీర్ణులైన వారిని పాఠశాల తెలుగు ఉపాధ్యాయులుగా, విశారద ఉత్తీర్ణులైన వారిని ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా నియమిం చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ పరిణామం వల్ల సూర్యుని కాంతివలె పల్లెపల్లెలోనూ తెలుగు వెలుతురును పరిషత్తు తీసుకు వెళ్ళింది. ఈ కృషిలో రామానుజరావుకు ముఖ్యమైన పాత్ర వుంది.

తెలుగు సాహిత్యక్షేత్రంలో ఎంతో మంది రచయితలకు నిరంతర ప్రోత్సాహం అందిస్తూ ఎన్నో సంస్థలను ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో రామానుజరావు అవిరళంగా పాటు పడుతూ తన రచనాకృషిని కూడా ఉత్తమ స్థాయిలో కొనసాగించారు. తరుణవయస్సులోనే పరిణతి చెందిన సాహిత్య విమర్శ చేశారు. ‘సారస్వత నవనీతం’, ‘తెలుగుసీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం’, ‘తెలంగాణాలో జాతీయోద్యమాలు’, ‘నా రేడియో ప్రసంగాలు’, ‘తలపుల దుమారము’, పంచవర్ష ప్రణాళికలు’, ‘బంకించంద్ర ఛటర్జీ జీవితము’,

హైదరాబాద్ లో స్వాతంత్ర్యోద్యమం’, బాలల కోసం ‘ఆక్స్ఫర్డ్ డిక్షనరీ’, ‘మనదేశం-తెలుగుసీమ’, జవహర్‌లాల్‌ నెహ్రూ, గౌతమ బుద్ధుడు వంటి రచనలు వెలువరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన స్వాతంత్ర్యానంతర కవితల కావ్యమాల – సంకలనానికి సంపాదకత్వం వహించారు.

దేవులపల్లి రామానుజరావు సంఘ సంస్కరణాభిలాషి, నిష్కళంక జాతీయవాది. సంస్కృతం, తెలుగు,

ఆంగ్ల, ఫారసీ, ఉర్దూ భాషల్లో ప్రావీణ్యం కలిగిన పండితులు. అనేక విషయాల్లో సంపూర్ణమైన అవగాహన కలిగినవారు. మంచివక్త, పరిశోధకుడు, ఎంతటి ఉధ్రంథమైనా చదివి సారాంశాన్ని ఇట్టే గ్రహించగల మేటి పాఠకుడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com