నెల్లుట్ల రమాదేవి

ఎనిమిది దశాబ్దాల తెలుగు చలన కళ్ళుజూసి, బారెడేసి కురులు జూసి.. అది పెద్దగా చదువుకోని సామాన్య చిత్ర చరిత్రలో తెలంగాణా పాత్రా, జూసి ఇది జూసి హైరానయి పోతినే ప్రజానీకం పనిపాటలు చేసుకునేటప్పుడో, ప్రాధాన్యతా తక్కువే! అక్కడక్కడా పూసలోళ్ల రాజమ్మా’ అంటూ ఒక పండుగలు, జాతరలు, ఉత్సవాల కొందరు తెలంగాణా నటులు మెరిసినా చరణంలో వాడిన హైరానా అనే సందర్భాలలోనో వచ్చే పాటల్లో అన్ని శాఖలలోనూ సహాయపడటమే తప్ప హైదరాబాదీ ఉర్దూ పదాన్ని చూస్తే .. మాండలికం ఉపయోగించే అవకాశం పూర్తి స్థాయి ప్రాముఖ్యత ఇక్కడి వాళ్ళు తెలంగాణాలో తరచూ వాడే పరేషాన్, ఉంటుంది. అలా వచ్చినదే.. 1971లో పొందలేదనే చెప్పొచ్చు. అయితే సినిమా నారాజ్ పదాలు కూడా గుర్తుకు రాక వచ్చిన ‘జీవిత చక్రం’లో సుశీల, వసంత స్వర్ణ యుగపు రోజుల్లో గీత మానవు.

బృందం పాడిన ‘బత్కమ్మ బత్కమ్మ రచయితలుగా ప్రవేశించి మహామహుల ‘బంగారు గాజులు’ (1968)లో కూడా ఉయ్యాలో… బంగారు గౌరమ్మ ఉయ్యాలో మధ్య నిలదొక్కుకొని తిరుగులేని కీర్తిని సినారేదే ఇలాంటి పాటుంది. టి. చలపతి పొందిన సినారె, దాశరథి తెలంగాణా రావు స్వరపరచి ఎల్.ఆర్. ఈశ్వరి పాడిన శంకర్ జై కిషన్ గార్లలో శంకర్ సింగ్ వాళ్ళే అన్నది గర్వించాల్సిన విషయం. ఆ జాజిరి జాజిరి జక్కల మామా – హైదరాబాదు చెందినవాడు అవడంతో తరువాతి తరంలో పాటల రచయితలుగా, చించించున్ , జింగిరి బింగిరి జిత్తుల ఆయనకు తెలంగాణాలో ఘనంగా జరిగే అడుగు పెట్టి దిగ్విజయాలను అందుకున్న మామా – చించించున్, కాకర చెట్టు బతుకమ్మ పండుగ గురించీ, ఆ పాట సుద్దాల అశోక్ తేజ, చంద్ర బోస్ వంటి మేకలు మేసె – చించించున్ ‘ అన్న కున్న సంప్రదాయ సిద్దమైన బాణీ గురించీ ప్రసిద్ధ గీత రచయితలతో బాటు.. కొన్ని పాటకు చిన్నప్పుడు తమ ఊర్లో కాముని అవగాహన ఉండడంతో అదే బాణీలో పాటలు రాసినా మంచి పేరు తెచ్చుకున్న పున్నమికి పాడుకునే’ జాజిరి జాజిరి స్వరాలు కూర్చడంజరిగింది. ఇక గీత వడ్డేపల్లి కృష్ణ, కందికొండ, మిట్టపల్లి – జక్కల పాపా -అది గుండిది గుండిత్తడి రచయిత సి. నారాయణ రెడ్డి గారికి పల్లె సురేందర్, కాసర్ల శ్యాం, సూరారం శంకర్, గుండు’ అన్న జానపద గీతం ఆధారమట. పాటలకు పదాలు కూర్చడం కొట్టిన పిండి. వరికుప్పల యాదగిరి, మౌనశ్రీ మల్లిక్ అదే చిత్రంలో మరో పాటలో ‘బొట్ల బొట్ల పట్టుకుంటే పదివేలు’ సినిమాలో లాంటి సినీ కవులెందరో తెలంగాణా గడ్డ చీర కట్టి – కంది చేన్లో పందిరేసి’ లాంటి (1967) చలపతి రావు సంగీత మీద ఉన్నారు. అరవయ్యవ దశకంలో పలుకుబడులను కూడా సినారె ఉపయో దర్శకత్వంలో మాధవ పెద్ది,

జానకి పాడిన రైతుల, వ్యవసాయదారుల, కార్మికుల గించారు. 1971 లో విడుదలైన ‘సిసింద్రీ నాంపల్లి టేసను కాడ జాంపళ్ళు కథల ఆధారంగా సినిమాలు వచ్చినా, చిట్టి బాబు ‘ లో ఘంటసాల, ఎల్ ఆర్ బాగుంటాయె’, ‘గోపాలుడు భుపాలుడు’ పాటల్లో మాండలికాలు వాడడం తక్కువే. ఈశ్వరి పాడి చలపతి రావు స్వరపరిచిన (1967)లో కోదండపాణి సంగీత అడపాదడపా అప్పటికే జనం నోళ్ళల్లో ఒక హాస్య గీతంలోనూ హైదరాబాద్ వర్ణన దర్శకత్వంలో సుశీల పాడిన ‘ఓ జిం జిం నలిగిన జానపద గేయాలుయధాతథంగా ఉంది.’ ఓ ఓ జంబియా, ఒగలమారి జింతడీ .. రం రం రం రంఖడీ .. గానీ, వాటి పల్లవులు గానీ తీసుకున్నా… జంబియా ! నాతోని మాట్లాడు నాంపల్లి – తెచ్చింది లంబాడీ’ అన్న పాట, వాటిలో తెలంగాణా మాండలికం ఉన్న జంబియా ….. ఓ హెూ ఎంకటి, ఒగలమారి మాధవ పెద్ది, ఈశ్వరి పాడిన ‘మరదలా… పాటలుఎక్కువగా లేవన్నది నిజం. – ఎంకటే.. చెయ్యి ముట్టుకుంటె కాసెగట్టి కత్తి పట్టి మీసం మెలి వేస్తుంటే…

సి. నారాయణ రెడ్డి పాటలు ‘చారెడేసి ఒట్టుచిక్కడపల్లి ఎంకటే’ ఇదీ పల్లవి. నువ్వు గుర్తుకొస్తివే, నేను తిరిగి వస్తినే .. రాక రాక వచ్చిన నా రాజ నిమ్మల పండా’ పాట , ‘మట్టిలో మాణిక్యం ‘(1971 ) లో సత్యం స్వర రచనలో బాలు పాడిన’ రింఝం రింఝం హైదరబాద్ -రిక్షా వాలా జిందాబాద్ ‘ పాటలన్నీ ఆ కోవకు చెందినవే .

‘ మరపు రాని మనిషి ‘( (1973 )లో ‘ వచ్చింది వచ్చింది లచ్చిమి -వన లచ్చిమి మహ లచ్చిమి ధన లచ్చిమి మా లచ్చిమి’ ….అంటూ చరణాల్లో ‘ యాదగిరికి దూద్ మలయ్ తెచ్చింది లచ్చిమి ‘ అన్న వర్ణన ఉంటుంది . ‘ ముత్యాల ముగ్గు ‘ ( 1975 ) లో ‘గోగులు పూచే గోగులు పూచే ఓ లచ్చ గుమ్మడి … గోగులు దులిపే వారెవరమ్మా ఓ లచ్చ గుమ్మడి ( గోగులు దులుప ఎవ్వరు లేరు ..అన్నది జానపద మూలం ), ముద్దబంతి పువ్వు (1976 ) లో ‘ ఒయ్ బామల్లాలా బామల్లాలా ‘ బంగారక్క (1977 ) లో ‘ ఆకూ పచ్చని కొమ్మల నడుమ ..రేకూ విచ్చిన రెమ్మల నడుమ ‘ అన్న పాటతో బాటు ‘లింగూ లిటుకూ లింగూ లిటుకూ … తింటే మటుకూ గుటుకూ గుటుకూ ‘ అన్న పాట కూడా ఉంటుంది . మొదటి పాటలోని చరణాల్లో ‘ తెల్లా తెల్లని ఆవుల నడుమ -బుల్లీ బుల్లీ లేగల నడుమ …పాలవంకా ఏటీ నడుమ -ఏటీ లోని నీటీ నడుమ …చిత్తా కార్తె ఎండల నడుమ – చిటాపటా చినుకుల నడుమ …’అన్న మాటలన్నీ తెలంగాణా జానపదానికి దగ్గర్లో ఉంటాయి .

‘ఆలుమగలు ‘( 1977 )చిత్రంలో టి చలపతి రావు సంగీత దర్శకత్వంలో బాలు , సుశీల పాడిన ‘సిగురేసె మొగ్గేసె సొగసంతా పూత పూసె …సెయ్యయినా వెయ్యవేమి …ఓ బాబూ దొర ‘ పాట పల్లవి లోనూ , చరణాల్లోనూ తెలంగాణా మాటలు తొంగి చూస్తుంటాయి . ముఖ్యంగా ‘ ముట్టుకుంటె , పట్టుకుంటె , చేరుకుంటె , వల్లకుంటె’ లాంటి పదాలు తెలుగు నాట సాధారణమయినా , వాటి హ్రస్వ రూపం వల్ల తెలంగాణా మాండలిక లక్షణం వచ్చి చేరింది . అలాగే తెలంగాణా పల్లెల్లో నలభై యాభై ఏళ్ల క్రితం ….కలిగిన కుటుంబాల్లోని యువకులను ‘బాబూదొర’ అని సంబోధించడం పరిపాటి.

పల్లెటూరి నేపథ్యంలో యుగళ గీతాలు గానీ , నృత్య గీతాలు గానీ రాయాల్సి వచ్చినప్పుడు తెలంగాణా మాండలికాన్ని ఉపయోగించే అవకాశాన్ని వదల్లేదు సినారె . ‘చుట్టాలున్నారు జాగ్రత్త’ ( 1980 )సినిమాలో ఎం ఎస్ విశ్వనాథన్ స్వర రచనలో బాలు , సుశీల పాడిన ‘అమ్మీ ఓలమ్మీ పాటలో ‘ నా సింత మాను సిగురా – నా గున్న మావి గుబురా – నా ఏడి ఉలవ శారా – నా ఇప్ప పూల సారా -అరిసెల పాకం కన్నా అందమైన దానా .. ‘ అంటూ కథానాయకుడు నాయికను వర్ణిస్తాడు . ఇక నాయిక అతడ్ని ఆట పట్టిస్తూ ‘ యెల్లమ్మ జాతరకు ఎల్లినప్పుడు -ఎంట ఎంటబడి నా చెయ్యి గిల్లినప్పుడు -కాలుగాలిన పిల్లి లాగ తిరుగలేదా -తిరిగి తిరిగి అరుగు మీద ఒరుగలేదా .. ‘ అంటుంది . అలాగే ‘ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ‘ (1982 )చిత్రంలో జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో బాలు , సుశీల పాడిన ‘ వచ్చే వచ్చే వాన జల్లు జాల్మదియేలో – గుచ్చూకుంది రేగుముల్లు జాల్మదియేలో….’ అన్న పల్లవి తరువాత ‘ చక్కానమ్మ తానె పక్కాకు రాగానె మొక్కాజొన్న చేలు ఏం చేసె ? నిక్కా పొడుచుకొని తేరి చూసె ‘ … ఇలా చరణాలు సాగుతాయి . ఇందులో ‘ జాల్మదియేలో ‘ అన్న మాటకు అర్థం ‘ జాలము అది ఏల ? ‘ అంటే .. ఆలస్యం ఎందుకూ అన్నట్లు ! ఇది జావళీల్లోంచి జానపదాల్లోకి వచ్చిందని సినారె వివరణ . ఈ పాటలోని కొన్ని పదాలు ఇరు ప్రాంతాలకూ చెందినవి, అయినా తెలుగు వారందరూ సమంగా ఆనందించినవి .

1983 లో వచ్చిన ‘ ముక్కుపుడక ‘ సినిమాలో పల్లెటూరి అమాయకపు వధువు తొలి రాత్రి పాడే పాటకు వీధి భాగవత గీతాన్ని ఆధారంగా తీసుకున్న సినారె దాన్ని అందంగా మలచారు. ‘ బంతులాడెనే .. పూబంతులాడెనే .. బాల కిష్టమ్మ ఎగిరి గంతులాడెనే ‘ అంటూ ‘ కొప్పూన నెమలి ఈక -లొప్పూన జుట్టుకోని ఉప్పు నీళ్ల బావి కాడ గంతులాడెనే ….. కిట్టమ్మా గోపాల బాలా కిట్టమ్మా ‘అని కొనసాగించారు.

1983 లో వచ్చిన ‘ ముక్కుపుడక ‘ సినిమాలో పల్లెటూరి అమాయకపు వధువు తొలి రాత్రి పాడే పాటకు వీధి భాగవత గీతాన్ని ఆధారంగా తీసుకున్న సినారె దాన్ని అందంగా మలచారు. ‘ బంతులాడెనే .. పూబంతులాడెనే .. బాల కిష్టమ్మ ఎగిరి గంతులాడెనే ‘ అంటూ ‘ కొప్పూన నెమలి ఈక -లొప్పూన జుట్టుకోని ఉప్పు నీళ్ల బావి కాడ గంతులాడెనే ….. కిట్టమ్మా గోపాల బాలా కిట్టమ్మా ‘అని కొనసాగించారు.

‘ రేలారే’ అన్న పదం ఎక్కువగా గిరిజన గీతాల్లో కనిపిస్తుంది . ‘ మన్నెంలో మొనగాడు ‘ (1986 ) సినిమాలో ‘ రేలా రేలా రేలారే రేగూ తోపుల్లో .. రెల్లూ పూలా గాలోరె రేతిరి ఏలల్లో ‘ అంటూ మొదలైన ఈ పాటలో ‘ సూరీడు ముద్దర కెయ్యంగ – సుక్కమ్మ నిద్దర లేవంగ -గుట్టల పిట్టలు కూయంగ -గూడెం గుడ్లిప్పి సూడంగ రేలా రేలా ‘ ‘ ఈపున ఇల్లు ఏలాడంగ-సూపున అంబు సురలాడంగ-మాటేసి సిన్నోడు ఏటాడంగ -ఏటుకు అడివంత ఎగిరి పడంగ’ అని చరణాలు సాగుతాయి. తొలి పొద్దు వర్ణనతో మొదలైన పాటలో సూర్యుడు ఉదయించగానే గుట్టల్లో ఉన్న వేకువ పిట్టలు కూయడం , గూడెం లోని జనమంతా మేల్కోవడం , విల్లంబులు వీపు మీద ధరించి గిరిజన యువకుడు వేటకు వెళ్లడం వంటివి సహజ భాషలో అమిరాయి .ఇందులోనే మరో పాట … ‘ కాబోయే నా మొగుడు , మన్నెంలో మొనగాడు -సద్ది ముద్దంటె ఒద్దంటడు , సిన్ని ముద్దంటె ముందుంటడు ‘ అనే పాటలో ‘ గుజ్జరి గుజ్జరి గుమ్మడి పువ్వా – నువు తంగేడు పూలు తల్లోబెట్టి గవ్వల దండా నడుముకు జుట్టి నడిచొస్తే జివ్వుమంటది ‘ – ‘ సిగ్గులు సిందే పెళ్లి కూతురా -దగ్గరె ఉంది పెళ్ళికి లగ్గం -ఏసేస్తాను పసుపూ పగ్గం -సిట్టడివీ సిందూ లేయగా ‘అంటాడు నాయకుడు . తంగేడు పువ్వుకు తెలంగాణాలో ఉన్న ప్రాధాన్యత మనకు తెలిసిందే ! అలాగే ‘ లగ్గం , పగ్గం , సిట్టడవి ‘ వంటి పదాలు వివరణ అక్కర్లేనివే .

‘ శృతి లయలు ‘ సినిమాలోనూ జానపద బాణీలో రెండు పాటలు రాశారు సినారె . అందులో ఒకటి .. ‘జోలా జోలమ్మ జోలా జేజేల జోలా – నీలాల కన్నులకు నిత్యమల్లే పూల జోల ‘. ఇందులోని మొదటి చరణంలో ‘ యాదగిరీ నరసన్న ఆదమరిచి నిదరోయే ‘ అనే పంక్తి ఉంది . ఇందులో ‘ ఆదమరిచి ‘ లోని ఆద అన్న మాటకు ‘యాద్ ‘ అన్న ఉర్దూ పదం ఆధారమని సినారె ఒక సందర్భంలో వివరించారు. తెలంగాణాలో ‘ యాది మరిచి పోయినవా ? ‘ అని అడగడం సర్వ సాధారణం. ఇక యాదగిరి నరసన్న … అందరూ కొలిచే దైవం , ఆ యాదాద్రిపై కొలువున్న నరసింహ స్వామి అన్నది జగద్విదితం.

‘ బ్రహ్మర్షి విశ్వామిత్ర ‘ లో ( 1989 ) కాటి కాపరి పాత్ర పాడుకునే పల్లె పాటలో ‘ కల్లు పొంగినట్టు.. పిల్ల నవ్వినట్టు తెల్లగుంది ఎన్నెల ‘ అంటూ ‘ ఓర్నియవ్వ మా గాలి సోకితే ఓకిలించుకుంటారు – సచ్చినాక తగలబెట్ట మేమే దిక్కంటారు ‘ అని శ్మశాన సత్యాన్ని పక్కా తెలంగాణ పదాల్లో చెప్పిన ఘనత సి . నారాయణ రెడ్డి గారిదే .

ఇక దొరల నిరంకుశ కాలం నాటి కథతో వచ్చిన ‘ఒసేయ్ రాములమ్మా ‘ (1997 ) సినిమాలో అణచబడ్డ అట్టడుగు వర్గాల ప్రతినిధిగా, దొర గడీలో పనిచేసి , అవమానాలనూ,అణచివేతలనూ భరించి , వీర నారిగా ఎదిగి సాయుధ పోరాట నాయకురాలి స్థాయికి చేరిన ‘ రాములమ్మ ‘ బాల్యం శ్రమ దోపిడీకి గురైన తీరును వర్ణించే పాట .. శీర్షికా గీతం ఎంతో ప్రజాదరణను పొందింది . ఆ పాటే స్వీయ సంగీత దర్శకత్వంలో వందేమాతరం శ్రీనివాస్ పాడిన ‘ ఓ ముత్యాల రెమ్మా – ఓ మురిపాల కొమ్మా -ఓ పున్నమి గుమ్మా -ఓ పుత్తడి బొమ్మా -ఓ రాములమ్మా రాములమ్మా ‘ అంటూ అంత్య ప్రాసలతో మొదలవుతుంది .

చరణాల్లో ‘ ఏం సూపులోయమ్మా – యేగు సుక్కలేనమ్మా -సిరి నవ్వులోయమ్మా-సెంద్ర వంకలేనమ్మా ‘ అంటూ ‘ నువ్వు కడవ మీద కడవబెట్టి కదిలితేనమ్మా -ఆ కరిమబ్బూ వరిదుబ్బూ కన్ను గిలిపేనమ్మా -నువ్వు సిందూ మీద సిందేసి సెంగుమంటెనమ్మ -ఆ జింక పిల్ల పాదాలకు జంకు పుట్టెనమ్మ ‘….ఇవన్నీ వివరణ అవసరం లేని పాదాలైనా వేకువ జామున పొడిచే వేగు చుక్క తో చూపుల్నీ , చంద్ర వంకలతో చిరునవ్వుల్నీ పోల్చడం అద్భుతం . అంతే కాకుండా కరి మబ్బు , వరి దుబ్బు ప్రాస కుదిరిన పదాలే కాదు … వరి దుబ్బు అన్నది తెలంగాణాకే ప్రత్యేకమైన పదం .’ దొరగారిపై వూగె పంకవైనావమ్మ -దొరసాని కాళ్లొత్తె దూదివైనావమ్మ -కాళ్లు మొక్త బాంచనని వొంగినావమ్మా – మూడు కుంచాలిస్తె నిలువెత్తు పొంగినావమ్మ ‘ అన్న పంక్తుల్లో ‘పంకా ‘ అనేది ‘పంఖ్ ‘ అనే ఉర్దూ మాట నుండి వచ్చింది . ‘ పంఖ్ హోతే తో ఉడ్ జాతీ హో ‘ ( రెక్కలుంటే ఎగిరి పోయేదాన్ని )అనే ప్రసిద్ధ హిందీ గీతం కూడా ఉంది .

ఈ కథాకాలంలో ఫాన్లు లేవు . మేడ పై కప్పుకు వేలాడదీసిన కుచ్చుల పంకాలను రాములమ్మ లాంటి పనివాళ్ళు లాగేవాళ్లు . లాగీ లాగీ ఆమే పంఖా అయిందని భావం .దొరసాని పాదాలు మెత్తనివి గనుక వాటిని వత్తడానికి సైతం మొరటు చేతులు కాకుండా దూదుల్లా మెత్తగా ఉండే రాములమ్మ లేత చేతులే కావాలన్న మాట .అలా వత్తీ వత్తీ ఆమే దూదిలా మారిందని భావార్ధం . అలాగే ‘బాంచన్ కాల్మొక్త ‘ అనే మాట నాలుగయిదు దశాబ్దాల క్రితం వరకూ తెలంగాణలో దొరలను పనివాళ్ళు అభ్యర్థించే సంబోధనగా వాడుకలో ఉన్నదే .’నీ బాంచెన్ ‘ అంటే ‘ నీ బానిసను ‘ అనే మాటకు రూపాంతరం .

ఇలా అవకాశమున్నప్పుడల్లా తెలంగాణా మాండలికాన్ని తన పాటల్లో సందర్భోచితంగానూ , సుందరం గానూ ఉపయోగించి ఆ తరువాతి తరం తెలంగాణా సినీ కవులకు దారులు పరిచారు సినారె .

దాశరథి పాటలు :

హైదరాబాద్ సంస్థాన విముక్తి ఉద్యమంలో పాల్గొని , తెలంగాణా కోసం పోరాడి కారాగార శిక్షననుభవించిన స్వాతంత్ర్య సమర యోధ కవి దాశరథి కృష్ణమాచార్య గారు 1960 మొదట్లోనే సినీ రంగం లోకి ప్రవేశించారు . శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయే ఎన్నో అద్భుతమైన పాటలు రచించిన దాశరథి ఖుషి , చలాకీ ,మజా , నిషా , హుషారు ,హమేషా, తమాషా, దిల్ రుబా వంటి తెలంగాణా ప్రాంత భాషతో కలిసి పోయిన ఉర్దూ పదాలతో మధుర గీతాలనెన్నింటినో రచించినా …. జానపదాల్లోని సొగసునీ , తెలంగాణా మాండలికాన్నీ మాత్రం ఎక్కువగా పట్టుకోలేదనిపిస్తుంది .

‘డాక్టర్ చక్రవర్తి ‘( 1964 ) చిత్రంలో ఓ పాటలో ‘ ఓ ఉంగరాల ముంగురూల రాజా -నీ హంగు చూసి పొంగి పోను లేర …నా సామిరంగ దండమోయి , నా జోలికింక రాకోయి ‘ అని నర్తకి అంటే …’ఓ బొంగరాల బుగ్గలున్నదానా – నీ కొంగు తాకి పొంగి పోతి జాన ‘ అని నర్తకుడు బదులు పలుకుతాడు . ఈ పాటలో ‘కైపు ‘, ‘కిల్లాడి ‘ వంటి పదాల మేళవింపుతో …ఖవ్వాలి గుబాళింపులతో బాటు హ్రస్వాలతో కూడిన పదాలతో తెలంగాణా మాండలికం పరిమళించింది .

అలాగే సంగీత లక్ష్మి (1966 ) చిత్రంలో ఒక గీతం ..’ చిలకవే రంగైన మొలకవే -అలక మాని చేరి పలకవే ‘ అంటూ వీధి భాగవత శైలిలో సాగుతుంది . అందులోనే స్త్రీ గళం ‘ ఎక్కడికి పోతివో – ఏమేమి చేస్తివో , ఎవ్వరిని జూస్తివొ ‘ అని పాడుతుంది . ఈ పాట తెలంగాణా జానపద అనుసరణే !

కన్నె మనసులు (1967 )సినిమాలో దాశరథి రచించిన నృత్య రూపకం లాంటి పాట ఒకటుంది . విధి వంచితురాలైన ఒక అభాగిని కథను బుర్ర కథ రూపంలో చెప్పే ఈ పాట అప్పట్లో రేడియోల్లో మారుమ్రోగుతుండేది . ‘ అమ్మలగన్నయమ్మ గాజులమ్మ -ముగ్గురమ్మలయమ్మా ‘ అంటూ సాగే ఈ పాటలో తెలంగాణా మాండలిక ఛాయలు కన్పిస్తాయి .

ఇక ‘అల్లుడే మేనల్లుడు ‘ (1970 )చిత్రంలో)’జాబిల్లి వచ్చాడె పిల్లా ‘పాటలో ‘ఎన్నెల్లు ఇరబూసె పున్నమి నడిరేయి -ఎంతో సక్కని వాడె .. సెంతకు రమ్మన్నాడే ‘ అన్న చరణం లోనూ …’సిగ్గు నీ సెంపలకు నిగ్గాయె లేవె – నవ్వె నీ కన్నులకు ఎలుగాయె లేవె ‘ అన్న చరణం లోనూ మాండలికం ధ్వనిస్తుంది. ‘శ్రీమంతుడు ‘ (1971 )సిన్మా లోనూ ‘బులి బులి ఎర్రని బుగ్గల దానా’ , ‘కాలం మారింది ‘(1972 ) లో ‘ సన్నజాజి సొగసుంది -జున్నులాంటి వయసుంది ‘ పాటల్లో కూడా తెలంగాణా మాండలిక పదాలున్నాయి .

వినడానికి ఎంతో సొంపుగా ఉండే మాట నిజమయినప్పటికీ , పాటల్లో మాండలికాన్ని ప్రవేశ పెట్టడానికి అనేక పరిధులున్నాయి . కథకు అనుగుణంగా , పాత్ర ఔచిత్యానికి తగినట్టుగా , సందర్భానుసారంగా , ప్రాంతీయతకు సరిపోయేలా మాత్రమే మాండలికాన్ని జొప్పించగలుగుతారు కవులు . ఈ విషయంగా సి నారాయణ రెడ్డి గారు అధికంగా , ఆ తరువాత సుద్దాల అశోక్ తేజ గారు కొంత మేరకు తెలంగాణా మాండలికాన్ని సినిమాల్లో ప్రవేశ పెట్టారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com