నింగి నుంచి రాలిన
చినుకుల్ని నా ఆలోచనల్లోకి
వంపు కుంటాను
పైర్లను కల కంటాను!
బెట్ట కాలం వచ్చినప్పుడు
నా కలల్ని కన్నీళ్ళ లోకి
అనువదించు కుంటాను
దోసిల్లతో
పైర్ల పాదుల్లోకి వంపుతాను
ఇందులో
నాకుటుంబ మంతా బాగా తర్ఫీదు పొందింది
పైరును బతికించుకోన్నాడు
నేనే అంతమౌతాను
అందుకే
మట్టిని రుచి చూడండి
ఉప్ప ఉప్పుగా వుంటుంది
మా ఇద్దరి శరీర రుచి ఒక్కటే.