Thangedu-Logo

 

డా. ఎన్. గోపి

1967 లో ఎన్. గోపి కలం నుండి జాలువారిన కవితా చిత్రం ఇది. అలతి పదాలతో, చిరు వాక్యాలతో కొనసాగిన ఈ కవిత తెలంగాణ పాఠకునిలో గొప్ప సాంస్కృతిక  స్పృహ కల్పించింది. గోపి కాల్పనిక ప్రపంచం వాస్తవం పునాదుల మీద ఎంత ప్రసన్నంగా వికసిస్తుందో చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ.  ఈ రోజు తంగేడు సాహిత్య పత్రకకు ప్రేరణనిచ్చిన సృజన చింతనలో ఈ కవితను ప్రత్యేకంగా పేర్కొనాలి. తంగేడు పాఠకుల కోసం ఈ తంగేడు పూల కవిత.

 

 

తంగెడుపూలు అంటే ఒప్పుకోను

 బంగరు పూలు

పొంగిన విచారాన్ని

 దిగమింగిన పూలు

వెలగలిగిన గులాబీల కన్న

వెలవెలబోయే మల్లెల కన్న

వెలలేని ఈ పూలు మేలు

తెలుగువారి బతకమ్మల కమ్మని మొగాల

వెలుగునింపు పూలు

కాపుకన్నెల ముద్దుగొలుపు ముద్దకొప్పుల్లో

కాపురముండే పూలు

మనసున్న పూలు

 మమతలున్న పూలు

వాసనలేకున్నా వలపు

 బాసలు నేర్చిన పూలు

 పేదపూలు

పేదలపూలు

‘తంగెడుపూలు’ అంటే ఒప్పుకోను

బంగరుపూలు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com