(స్వతంత్ర భారత అమృతోత్సవ వేళ సైనిక శక్తిని కీర్తిస్తూ)
భారత దేశమన్నది శుభ స్వర భాస్వర సార పూరితోం
కారము, చిత్రకారమ వికారముదారము, దీనిపై నహం
కారము తోడ భీకరపు కత్తుల దూసెడు చిత్తముని హుం
కారము జేయునట్టి అపకారులకున్ యమరూప సైనికా!
కసికసిగా విషమ్ములను గ్రక్కుచు నిక్కుచు వర్రగాములై
బుస బుస లాడు నాగులయి ముద్రిత సీమల దాటి వచ్చుచున్
రుస రుల లాడు దుర్మదుల మంచెడి గారుడ శక్తివీవు, నీ
మిస మిసలాడు మీసముల మిన్కులన్ విజయోస్తు సైనికా!!
– డా.జి.యం. రామశర్మ