– కె.వి.మన్ ప్రీతమ్, 8179306464.

కొండగట్టు… అడవి పెరిగిన కొండల నుంచి ఉదయిస్తున్న సూర్యుడి వెలుతురుకి లేచింది… ఓ వానరం! ఎరుపెక్కుతున్న ఆకాశాన్ని రెండ్నిమిషాలు ప్రశాంతంగా చూసి, అమాంతం ఒక కొమ్మ నుండి మరో కొమ్మ కి దూకుతూ… దొరికిన పండ్లన్ని కొరుకుతూ… పంచముఖ ఆంజనేయుని విగ్రహం ఎక్కి, ఆరో ముఖంగా తన తల పెట్టి ఊరంతా చూడసాగింది. దూరంగా కనబడుతున్న మొక్క జొన్న చేను వైపు పోవడానికి ఆశగా ఉన్నా, ఎటు వైపు నుండి ‘మంకీగన్స్’ లేస్తాయేనని భయపడి… ఆ గన్ చప్పుడు చెవిలో ప్రతిధ్వనికి రాత్రులు నిద్ర పట్టని రోజులు గుర్తొచ్చి మరో వైపు చూడసాగింది.

అలా రెండు, మూడు గంటల తర్వాత భక్త జన తాకిడితో… వేద మంత్రాలు, హారతి గంట చప్పుళ్లు తో మార్మోగే దేవస్థానం… ఆ రోజు నిశ్శబ్దంగా, నిర్మానుష్యంగా కనబడడం ఆశ్చర్యం వేసింది కోతికి. ‘మానవులు అంతరించిపోయారా..?’, అన్నట్టు సందేహం రేగి రోడ్డు మీద కి వచ్చి పరిగెడ్తుంది. దూరంగా ఇద్దరు పోలీసులు కనబడ్డారు, వాళ్ళ దగ్గరున్న అరటిపండు కోసం మెల్లగా అక్కడి వెళ్ళింది. ” జంతువుల మధ్యనైన ధైర్యంగా తిరిగే జనం.. ఒక పురుగు కి భయపడి బయటికి రాకుండా ఉండడం విచిత్రంగా అన్పిస్తుంది సార్..”, అన్నాడు కానిస్టేబుల్ “ముట్టుకుంటేనే కాదు, దగ్గిన కూడా వచ్చే వ్యాధి మరి. రోగం వచ్చిన వాళ్ళను చూస్కోడానికి డాక్టర్లు… రాని వాళ్లను బయటికి రాకుండా చూస్కోవడం మనం..తప్పదు “, అన్నాడు ఎస్.ఐ. వాళ్ళిద్దరి సంభాషణ ఇంకా వింటుంటే, మెల్లమెల్లగా లాక్ డౌన్ గురించి అర్థమైంది కోతికి. అప్పుడే ఎవరో రోడ్డు మీదకి రాగానే, అతన్ని పోలీసులు కొట్టిన దెబ్బలకు… తీస్కుందామనుకున్న అరటిపండు అక్కడే వదిలేసి పారిపోయింది కోతి.

రెండ్రోజులవుతుంది… ఎవరు బయటికి రావట్లేదు.. పిలిచి పండు ఇవ్వట్లేదు..ఆహారశాలలు ఖాళీగా కనబడడంతో ఆకలి భరించలేక అటు ఇటు తిరుగుతుండగా కొద్ది దూరంలో ఓ ఆశ్రమం కనబడింది. అందులో ఓ కిటికీ… దాని ముందు ఓ మామిడి పండు. అంతే, ఎగబడి పరిగెత్తింది..సరిగా అందుకునే సమయానికి కిటికీ అవతల వైపు నుండి ఎవరో పండును లాగేసుకున్నారు. ‘హ్..క్…..చ్..’మంటూ కిటికీ లోపలికి చూసింది కోపంగా… నిండు ముఖంతో..ఓ ముసలావిడ, పండు తింటూ కనబడింది. ఆ కోతిని చూసి కాస్త భయపడి, కాసేపు దాని ముందు దానిలా చేష్టలు చేసిన అది అక్కడి నుండి వెళ్ళలేదు. ఆమె కాస్త మెల్లిగా నవ్వుకొని ఒక పండు ఇచ్చింది. మహాప్రసాదమనుకోని గబగబా తినేసి

వెళ్ళిపోతుంటే దాని తోకను లాగి వదిలేసింది ఆమె. అది కాస్త కోపంగా వెనక్కి చూస్తూ వెళ్ళి పోయింది.

మర్నాడు… కోతి మళ్ళీ వచ్చింది.. నిన్న చేతులకున్న మామిడి గుజ్జు తో పట్టుకున్న తోకకి, ఇప్పుడు ఎండిపోయి ఉండే సరికి అది నిన్నటి కోతినే అని అర్థమై మళ్ళీ పండు ఇచ్చింది. అలా రోజుకో పండు ఇవ్వటం అలవాటైంది ఆమె కు. పండ్లిస్తూ కోతితో మాట్లాడడం అలవాటు ఆమె కు.. ” చిన్నప్పుడే పెండ్లి… భర్త తో రోజు పొలంకెళ్లి పని చేయటం…కొడుకు పుట్టిన కొద్ది రోజులకు భర్త చనిపోవడం…ఎంత కష్టపడిన కొడుకు చదువులకి డబ్బు సరిపోకపోవటం, పొలం అమ్మేసి మరి చదివిస్తే… కొడుకు పెద్దగై పెండ్లి చేసుకొని ఇలా ఆశ్రమం లో వదిలేసి బెంగుళూరు లో సెటిల్ కావడం “, దాకా ముచ్చట్లు చెప్పింది. ఇంకో అరటిపండు కావాలన్నట్టు కోతి ముఖం పెట్టగానే..” ఆశ్రమం లో ముసలివాళ్ళకి కూడా ఫోన్లు బాగా అలవాటైపోయి, మాట్లాడడం మర్చిపోయారు. కనీసం నువ్వైన దొరికావు నాకు..”, అంటూ ఇంకో పండు ఇచ్చింది కోతికి. – ఒక్కోసారి తన ఫ్యామిలీ ఫోటో కూడా కోతికి చూపిస్తూ కన్నీళ్ళు ఆపుకునేది. జీవితంలోని చీకటి వెలుగుల్ని, సుఖదుఃఖాల్ని, బాధసంతోషాల్ని చెప్తుంటే, ‘నేను తెల్సుకోవాల్సిన రామాయణం చాలానే ఉంది ‘, అనుకునేది కోతి. ‘ఏంటో మనుషులు… వాళ్ళను కన్న వారిని వొదిలేస్తారు… మేము కన్న వాళ్ళ ని తీసుకెళ్తారు’, అని కోతి తనకు పుట్టిన కోతిని సర్కస్ వాళ్ళు తీసుకెళ్ళాడం గుర్తు చేసుకోసుకుంటూ అనుకునేది.

అలా కోతికి, ముసలావిడకి మధ్య స్నేహం పెరిగిన కొద్ది రోజులకి… అనుకోకుండా ఒకసారి ముసలావిడ మంచం పై పడి ఉంది. కిటికీ దగ్గరికి వచ్చి చప్పుడు చేస్తున్న ఆమె మాత్రం కళ్ళు తెరిచి కోతి వైపు చూడట్లేదు. చిన్న రాయి విసిరితే, మెల్లిగా కళ్ళు తెరిచింది..

కానీ ఆశ్రమం లో ఎవరో కర్ర విసరడంతో కోతి పరిగెత్తింది. ఆమెకి ఏమైందోనని, ఏదో సాయం చేయలనే కసితో పరిగెత్తింది. రోడ్డు మీద నుండి జాతరల వెళ్తున్న వలస కూలీల్ని చూసి, అందులో కొందరు మాస్క్ లేకుండా ఆకుల్ని అడ్డం పెట్టుకొని వెళ్ళడం చూసి కోతి జాలేసింది. అయినా అందర్ని దాటేస్తూ కసితో పరిగెడ్తుంది.. చెక్ పోస్ట్ దగ్గర ఎవరో అన్న దానం చేస్తుంటే, ఆ గుంపులోంచి పులిహోర ప్యాకెట్లు అందుకొని ఆశ్రమానికి వచ్చింది. ” అరే! కరోనా పేషెంట్ ని ఆశ్రమం లో ఉంచితే ఎలా..? మిగితా వాళ్ళమంతా వయసైపోయిన వాళ్ళమే కదా. ఇంతకీ ఈవిడ గారి అబ్బాయి కి కబురు పెట్టారా ?”, అని ఒక ముసలాయన ఆశ్రమం ఓనర్ పై అరిచాడు . ‘మనం పోరాడాల్సింది వ్యాధి తో…రోగి తో కాదు..’ కుయ్ కుయ్ మంటూ కాల్ కటైంది. “అయ్యో సార్… వాళ్ళబ్బాయి కే ఫోన్ చేస్తున్నాను. పొద్దున్నే విషయం చెప్పాను, ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇప్పుడు కనీసం ఫోన్ కూడా తీయట్లేదు..”, ఆశ్రమం ఓనర్.

“సర్లే..ఇంత జీవితం చూసాం. ఇక్కడ మనకు మనమే తోడు. మనమందరం ఆమె కి దూరంగా ఉండి, మన జాగ్రత్తలో మనం ఉంటే చాలు “, అంటూ మిగితా వారికి సర్ధి చెప్పాడు ఆ ముసలాయన. కిటికీ దగ్గరకి పులిహోర ప్యాకెట్లు ఆమె కోసం పెట్టి చూసింది కోతి.. లోపల పీపీఈ కిట్లేసుకొని ఆమెకి మందులిస్తున్నారు.

సరిగ్గా మూడ్రోజుల తరువాత… ఆమె పూర్తిగా కోలుకుంది. ఎప్పుడు లేనం

అలా మూడ్రోజుల వరకు డాక్టర్లు వచ్చి ఆమె కు చేస్తున్నవన్ని గమనిస్తుంది కోతి. తర్వాత డాక్టర్లకి కూడా కరోనా రావడం తో తెల్లారి నుండి ఆమె ను పట్టించుకునే నాథుడే లేరు. ఆమె ను మంచం పై అలా చూడడం కోతికి నచ్చడం లేదు… ఊరవతలున్న డాక్టర్ క్లినిక్ కి పరిగెత్తింది… క్లినిక్ దగ్గర ఎక్కువ గా కరోనా పేషెంట్లే ఉన్నారు. వాళ్ళకిస్తున్న ట్రీట్మెంట్ లో భాగంగా ఉన్న కషాయం, మరికొన్ని ట్యా బ్లెట్లున్న కిట్స్ లోంచి ఒకటి గట్టుకున అందుకొని పరిగెత్తసాగింది. వెనుక నుండి ఎవరో సెక్యూరిటీ వాళ్ళు రాళ్ళు విసిరితే తగిలిన దెబ్బలను కూడా పట్టించుకోకుండా… హన్మంతుడు ‘సంజీవని’ తీస్కోచ్చినట్టు…ఆ కిట్ పట్టుకొని ఆశ్రమం లోపలి కి వెళ్ళి మంచం ముందు పెట్టింది…మెల్లగా ఆమెను చూసింది…నిద్రలో ఉంది.. కన్నీళ్ళతో కోతి అక్కడి నుండి వెళ్ళి పోయింది.

తగా హుషారుతనం ఆమె లో కన్పించింది. ఎప్పటి లాగే ఇద్దరు కిటికీ దగ్గర కూర్చుని హాయిగా నవ్వుకున్నారు. అది దూరం నుండి ఆశ్రమం వాళ్ళు ఎవరో ఫోటో తీసి, కోతి చేసిన సాయం సోషల్ మీడియా లో పోస్ట్ పెట్టారు. ఇద్దరు నవ్వుతున్న ఆ ఫోటో వైరల్ అయింది..!

ఒక రోజు కోతి పూలు తెంపుకొని ఆమె కి తీసుకొచ్చింది…ఆ పూలను సంబురం గా చూస్తున్న ఆమె కి ఫోన్ మ్రోగింది… చాలా రోజుల తర్వాత వాళ్ళ కొడుకు ఫోన్ కాబట్టి టక్కున ఎత్తింది.

రెండ్నిమిషాలు మాట్లాడిన తర్వాత పట్టరాని సంతోషం తో ఆమె, ఉన్న పండ్లన్ని కోతి కి ఇచ్చేస్తూ.. ” రేపు మా అబ్బాయి వచ్చి నన్ను తీసుకెళ్తాడటా…రేపట్నించీ నేనిక్కడ ఉండను “, అని ఆమె మాటలు వినే సరికి కోతి ముఖం లో రంగుల మారాయి.

కోపం, బాధ రెండు ఉప్పొంగుతున్నా… ఏమీ చేయకుండా బరువెక్కిన గుండె తో అక్కడి నుండి వెళ్ళిపోసాగింది. ఆమె పిలుస్తున్నా కూడా, కాసేపటికి మిణుగురులు తప్ప ఆ చీకటి చెట్లలో కోతి కనబడలేదు.

తెల్లారింది…. కిటికీ వైపు చూస్తే వేరే కోతి వచ్చి పండు తింటుంది, కాని ఆ కోతి మాత్రం రాలేదు. అలా కిటికీ దగ్గరే కూర్చుందామే…! – చెక్ పోస్ట్ దాటుకుంటూ వేగంగా వస్తుంది ఒక కార్ …

దానికి అడ్డంగా రోడ్డు మీద నిల్చొని ఉంది ఆ కోతి. కాస్త దూరం కారాపి గట్టిగా హారన్ కొట్టిన అడ్డు తొలగట్లేదు అది. అతను మెల్లిగా కార్ దిగాడు… ఆ ముసలావిడ ఫ్యామిలీ ఫోటోలు చూపించిన వ్యక్తేనని కోతి కి అర్థమైంది. అతనో కర్ర తీస్కునేలోపే…ఒక్కసారిగా కొన్ని వందల కోతులు అన్ని వైపులా లేచి రాసాగాయి… వాటి అడుగుల శబ్దానికే అతని గుండెల్లో వణుకు పుట్టింది. వెంటనే కారెక్కి డోర్సన్ని వేసుకుని గ్లాస్లెక్కిచ్చాడు. అన్ని కార్ మీదికి ఎక్కాయి. లోపల్నుండి అతనికి చుట్టూ ఉగ్రరూపం లో కోతులే…వెంటనే రివర్స్ గేర్ తీసుకోని వెనక్కి వెళ్తుండగా కోతులన్ని పక్కకు వెళ్ళాయి. ఊరవతల దాకా అతన్ని తరిమాయి. ఊరుదాటిన కొద్ది సేపటికి కారాపి…గట్టిగా గాలి పీల్చుకున్నాడు. ఏసీ నిండున్న కార్లో చమటలు కక్కడం ఆపట్లేదు. మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్లామన్న ఆలోచనే గుండ దడ పుట్టిస్తుంది. కాస్త తేరుకొని, తన ప్లాన్ అంత కోతులు పాడుచేసాయనుకున్నాడు.

కోతి సాయం తో కరోనా నుండి కోలుకున్న అతని తల్లి ఫోటో ఫేస్ బుక్ లో చూసే అతను ఇక్కడికొచ్చాడు. నిజానికి, అతని భార్య కి కరోనా సోకి చాలా సీరియస్ స్టేజ్ లో ఉంది. “ఎవరైన కరోనా నుండి కోలుకున్న వ్యక్తి యొక్క బ్లడ్ ప్లాస్మా కావాలి , అప్పుడు మీ భార్య తొందరగా కోలుకుంటంది ‘, అని డాక్టర్ చెప్పిన మాటకు తల్లి కరోనా నుండి కోలుకుందని, తీసుకెళ్లామని వచ్చాడతను…!

చమటలు తూడ్చుకుంటూ కోతులు వస్తునాయేమోనని వెనక్కి తిరిగితే ఒక కోతి వచ్చి కార్ పై ఏదో పెట్టి వెళ్ళి పోయింది. మెల్లిగా దిగి చూసాడు..అది ఒక ఫ్రీజర్ బాక్స్ అని ఆశ్చర్య పోయాడు. తెరిచి చూస్తే సలైన్ బాటిల్ లో ప్లాస్మా నిండి వుంది..

దాని మీద అక్షరాలు..”కోతులు దాడి చేస్తాయని తెల్సు..నువ్వు వచ్చేది కేవలం దీని కోసమేనని కూడా తెల్సు..తీస్కో”, అని చదివిన తరువాత,తల్లి ప్రేమ కు అతని కండ్లలో నీళ్ళు సుడులు తిరిగాయి.

కోతి రొమ్ము విరుచుకుంటూ ఆనందంగా ఆమం వైపు వెళ్ళసాగింది.

****** కె.వి.మన్ ప్రీతమ్ సెల్: 8179306464, 7989683913.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com