Thangedu-Logo
బుక్ క్లబ్ సాహిత్య కార్యక్రమం

తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఏర్పాటు చేసిన జూమ్ సాహిత్య ఈ కార్యక్రమంలో లో “పి. వి విశ్వనాథ వేయి పడగలు” అనే అంశం మీద ప్రముఖ విమర్శకులు గండ్ర లక్ష్మణ్ రావు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం పి. వి నరసింహారావు శతజయంతి సందర్భంగా పి.వి సంవత్సరంగా ప్రకటించింది తెలిసిందే. ఈ విషయం పురస్కరించుకొని జాగృతి ప్రతి నెల రెండు సాహిత్య ప్రసంగాలను నిర్వహించాలని నిర్ణయించింది. పి.వి మెచ్చిన కవి విశ్వనాథంగా ఆయనపై మొదటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. కార్యక్రమానికి జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు డాక్టర్ కాంచనపల్లి సంచాలకులుగా వ్యవహరించారు. గండ్ర ల క్ష్మణరావు విశ్వనాథ, పి. వి ల సాహిత్య బంధం గురించి వివరించారు. విశ్వనాథ సర్వాంగీణ సాహిత్య వైభవాన్ని వివరిస్తూ ఆయన వేయి పడగల రచనా విశిష్టతను కొనియాడారు. పి. వి వేయి పడగలను హిందీ లోకి అనువదించిన నైపుణ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ, వడ్డేపల్లి కృష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, ఉషారాణి పొట్లపల్లి శ్రీనివాసరావు, జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, జిల్లా అధ్యక్షులు జాడి శ్రీనివాస్, అవంతీ కుమార్ లతోపాటు జాగృతి న్యూజిలాండ్ ఖతర్ అధ్యక్షురాలు నందిని, జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షులు ముగ్దుం జ్యోతి మొదలైన దేశ విదేశ జాగృతి ప్రముఖులు, ఎందరో సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.

పీవీకి జాగృతి అంజలి

ఆగష్టు 26, 2020 న తెలంగాణ జాగృతి స్వర్గీయ పీవీ నరసింహా రావు సభ నిర్వహించింది. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్లి ప్రధానిగా రాణించిన మొదటి వ్యక్తి పీవీ అన్నారు. వీరి మతభాషణ, గంభీరమైన వ్యక్తిత్వం ఈనాటి నాయకులందరికీ అనుసరణీయం అన్నారు. ముఖ్య అతిధి, టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు మాట్లాడుతూ, పీవీ ఉన్నత వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం అని అన్నారు. సభలో పాల్గొన్న పీవీ కుమారుడు రాజేశ్వర రావు, కుమార్తె వాణి, పీవీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్ సైడర్ పీవీ రచన తెలుగు అనువాదకులు కల్లూరి భాస్కరం అనువాదం చేసినప్పటి అనుభూతిని వివరించారు. తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ అతిధి పరిచయం కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు జి.వరలక్ష్మి వందన సమర్ఫణ చేశారు.

కాళోజీ యాదిలో…

తెలంగాణా జాగృతి సెప్టెంబర్ 9 కాళోజి జన్మదినోత్సవం సందర్భంగా  తెలంగాణా  భాషోత్సవాన్ని నిర్వహించింది .జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి సంచాలకులుగా వ్యవహరించిన ఈ జూమ్ కార్యక్రమానికి ప్రసిద్ద కవి కేంద్ర సాహిత్య అవార్డ్ గ్రహీత ఎన్. గోపి ముఖ్య ముఖ్య అతిధి గా ప్రసంగించి  కవితా గానం చేశారు .ఈ కార్య క్రమంలో సుమారు గా నలభై మంది సుప్రసిద్దులు వర్తమా మానులు అయిన కవులు పాల్గొన్నారు .
పీవీకి జాగృతి అంజలి

ఆగష్టు 26, 2020 న తెలంగాణ జాగృతి స్వర్గీయ పీవీ నరసింహా రావు సభ నిర్వహించింది. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్లి ప్రధానిగా రాణించిన మొదటి వ్యక్తి పీవీ అన్నారు. వీరి మతభాషణ, గంభీరమైన వ్యక్తిత్వం ఈనాటి నాయకులందరికీ అనుసరణీయం అన్నారు. ముఖ్య అతిధి, టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు మాట్లాడుతూ, పీవీ ఉన్నత వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం అని అన్నారు. సభలో పాల్గొన్న పీవీ కుమారుడు రాజేశ్వర రావు, కుమార్తె వాణి, పీవీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్ సైడర్ పీవీ రచన తెలుగు అనువాదకులు కల్లూరి భాస్కరం అనువాదం చేసినప్పటి అనుభూతిని వివరించారు. తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ అతిధి పరిచయం కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు జి.వరలక్ష్మి వందన సమర్ఫణ చేశారు.

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో, కాళోజీ కవిత్వంతో ఈ సాయంత్రం

కళాజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం 9.9.2020 సాయంత్రం ఆరు గంటలకు గూగుల్ మీట్ ద్వారా కాళోజీ కవిత్వ జయంతిని నిర్వహించారు. డా. నందిని సిధారెడ్డి కాళోజీ కవిత్వాన్ని పఠించారు. డా. తూర్చు మల్లారెడ్డి కాళోజీ కవితా శిల్పంపై ప్రసంగించారు. డా. నాళేశ్వరం శంకరం సభకు అధ్యక్షత వహించారు.  డా.వి. శంకర్ సభను సమన్యయం చేశారు.

డా.నందిని సిధారెడ్డి కాళోజీ ‘నా గొడవ’ లోని వైవిధ్యమైన, విశిష్టమైన కవితలను ఎన్నుకుని పఠించారు. పఠించేముందు కాళోజీ వ్యక్తిత్వంలో గానీ, జీవితంలో గానీ, కవిత్వంలో గానీ ఆయనదైన ప్రత్యేక శైలి మరెవరికీ లేదన్నారు. ఆయన కవిత్వం శిల్ప మర్యాదల్ని పాటించలేదు. సమకాలీన సంఘటనలను కవితాత్మకమైన రన్నింగ్ కామెంట్రీలా ఉంటాయన్నారు.

డా.తూర్పు మల్లారెడ్డి కవితా శిల్పంపై ప్రసంగిస్తూ కాళోజీ ఎంచుకున్నది ప్రజా చైతన్యపు తోవ. అదే ఆయన కవిత్వపు శిల్పం. ప్రజల భాషను స్వీకరించడం వల్ల ప్రజాకవి అయ్యిండు. ప్రజా కవిత్పపు శిల్పంతో ఆయన కవిత్వం రానిస్తుందని అన్నారు.

సభకు అధ్యక్షత వహించిన డా.నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ, కాళోజీ ఒక రస్సెల్, ఒక ఖలీల్ జీబ్రాన్, ఒక లూయి, ఒక వేమన, ఒక చౌడప్ప, ఒక చార్వాకుడు, ఒక లోకామతుడు, ఒక వివేకానందుడు, ఒక పౌర హక్కుల నేత, ఒక నక్సలైటు, ఒక తాత్వికుడు అన్నీ కలిస్తే కాళోజీ అని ఆయన పలుకుబడుల భాషను ఒక ఉద్యమంగా లేవదీసి తెలంగాణ ప్రామాణిక భాషను నిర్మించుకోవాలని నాళేశ్వరం అన్నారు.

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో, కవిత్వంతో కలుద్దాం

తెలంగాణ రచయితల సఘం, వరంగల్ ఆధ్యర్యంలో ప్రతినెల నిర్వహిస్తున్నటువంటి కవిత్వంతో కలుద్దాం కార్యక్రమంలో భాగంగా నిన్న సాయంత్రం 6గంటలకు ఆన్లైన్ వేదిక జూమ్ సమావేశం నిర్వహించబడింది. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తెరసం జిల్లా అధ్యక్షులు పొట్లపల్లి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ వరంగల్ కు ఒక గొప్ప వారసత్వం ఉందని, నాటి పాల్కురికి సోమనాథుడు, పోతన నిన్నటి ప్రజాకవి కాళోజీ ఆధునిక కవుల వరకు మనుషుల పట్ల ఒక ప్రేమ తండ్లాట కనిపిస్తుందని, ఆ విషయంలో వారి బాధ్యత వర్తమానం నెరవేర్చాలని అన్నారు. ఫలితం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తామో ఫలితం సాధన కోసం అంతే కృషి చేయాలని కవులకు సూచించారు. ఇవ్వాళ్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి, సినియర్ కవిగా హాజరైన ప్రముఖ కవి దర్భశయనం శ్రీనివాసాచార్యగారు వచన కవిత్వంలో ప్రత్యేక గొంతుక అని, తను రైతు పక్షపాతి అని అన్నారు. కార్యక్రమంలో భాగంగా కేతిరెడ్డి యాకూబ్ రెడ్డి గారు దర్భశయనం శ్రీనివాసచారి గారి పరిచయాన్ని అందించారు. అనంతరం సమన్వయకర్త బిల్ల మహేందర్ మాట్లాడుతూ కవిత్వంతో కలుద్దాం కార్యక్రమం ద్వారా కొత్త కవుల రచనలను ప్రోత్సహించడం, వారిలో కవిత్వ నిర్మాణం, మెలకువలు తదితర అంశాలను పెంపెందించే లక్ష్యం లాంటి నిర్దిష్టమైన అంశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తర్వాత ఎంపిక చేయబడిన పదిమంది కవులు కవిత్వపఠనం చేశారు. ఆ కవితలను దర్భశయనం శ్రీనివాసచారి గారు విశ్లేసిస్తూ కవికి తన అశక్తత తెలిసుండాలని, ప్రాచీన ఆధునిక సాహిత్యాన్ని తప్పని సరిగా అధ్యయనం చెయ్యాలన్నారు. కొత్త పదబంధాలు సృష్టించడంతో పాటుగా కవితలల్లో ఉపమానాలు చేర్చడం వల్ల కవితకు అదనపు ఆకర్షణ వచ్చి చేరుతుందన్నారు. కవి తన మూలాలను మరవ వద్దని, కవిత్వం రాయటం ఎంత ముఖ్యమో దాన్ని శ్రోతలకు ప్రజెంట్ చేయటం అంతే ముఖ్యమన్నారు. ప్రచారం కోసమో, మెప్పు కొసమో కవిత్వం రాయకూడదన్నారు. ఎవరూ పరిపూర్ణులు కాదని, మనది అసంపూర్ణ ప్రయాణం అనిగుర్తుంచుకోవాలన్నారు. కవి ఎప్పుడూ సామాన్యుడేనని, అతనికి వ్యక్తిత్వం ముఖ్యమన్నారు. కవి అనుభవం నుండి వచ్చిన కవిత గాఢత కలిగి ఉంటుందని ,వాతావరణాన్నిబట్టి వస్తువు కొత్తగా తీసుకోవాలన్నారు. కవిత్వానికి భాష గొప్ప మూలకమని, భాష పునర్నిర్మాణం జరగాలని సూచించారు. మనుషుల మాటలను ఎప్పటికప్పుడు వినాలని, తద్వార గొప్ప పదసంపద తెలుస్తుందని చెప్పారు.

కార్యక్రమంలో నెల్లుట్ల రమాదేవి, నాగిళ్ళ రామశాస్త్రి, బ్రహ్మచారి, పోరెడ్డి రంగయ్య, వి. శంకర్ , ఉదయశ్రీ, రత్నమాల, గట్టు రాధిక, బాలబోయిన రమాదేవి, కార్తీక రాజు, వడ్లకొండ దయాకర్, వకులవాసు తదితరులతో పాటుగా మొత్తం 50కి పైగా కవులు పాల్గొన్నారు.

‘కాళోజీ 106వ జయంతి’ ని పురస్కరించుకొని, ప్రత్యేక ‘ జూమ్’ కవి సమ్మేళనం

‘ప్రాణహిత’
(కవితా వాహిని)
తేదీ : 09 సెప్టెంబరు 2020
సమయం : సాయంత్రం 5 గంటల నుండి… ఏర్పాటు చేయడం‌జరిగింది. కార్యక్రమంలో మొదట ప్రసిద్ధ కవి, సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి కాళోజీ గారి తో తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.
తదనంతరం జరిగిన కవి సమ్మేళనంలో
సుప్రసిద్ధ కవులు, కవయిత్రులు తమ తమ కవితలను వినిపించారు. తెలంగాణ చైతన్య సాహితీ కన్వీనర్ ప్రముఖ కవి చమన్ నిర్వహణ సమన్వయం చేయగా
తొలుత ప్రాణహిత జూమ్ కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులకు దాసరి మోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సాంకేతిక సహకారం సి.హెచ్.ఉషారాణి అందించగా తెలంగాణ చైతన్య సాహితీ వ్యవస్థాపకులు వఝల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

One thought on “సభలు- సమావేశాలు”
  1. తెలంగాణ జాగృతి మరో అడుగు ముందుకు వేసి మారుతున్న కాల నుగున పరిస్థితుల ప్రభావం దృశ్య సాహిత్యానికి పట్టం కట్టాలని పఠనాసక్తి పెంపొందించటానికి , తెలంగాణ రాష్ట్ర సాహిత్య ,చరిత్ర , సంస్కృతి ,సంప్రదాయాలపై అవగాహన పెంచుకొని భావితరాలకు అందించాలని శ్రీమతి కల్వకుంట్ల కవిత అక్క వారు చేస్తున్న ప్రయత్నం అభినందనీయం .. తెలంగాణ జాగృతి సాహిత్య తెలుగు పక్ష పత్రిక ను ఆవిష్కరించిన జాగృతి రాష్ట్ర కార్యవర్గ నాయకులకు నా అభినందనలు …
    భీమ్ రావు@ రామ్ జీ తెలంగాణ జాగృతి భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com