Thangedu-Logo

కం. జనపతి పర్జన్యుగతిం

తనభూప్రజ బ్రోవవలయు దగ బ్రోవడమే

తను జూసి పోవునా ప్రజ

ఘననీరన నరసి పాయు ఖగముల భంగిన్

కం. ఆపదల జెందు ప్రజలను

భూపతి మొదలిచ్చి మగుడ బ్రోవగ రాదా

జేపధ్ విడువ వలవదు

భూపతికి కుటుంబమనగ భూమియ కాదే

కం.ఎంతెంత గలుగు రాష్ట్రం

బంతంతయు రాజు పెద్దయగు కావన దే

శాంతరములొత్తి కొనుట ని

తాంతాము ధర్మంబుగాదె ధరణీశునకున్

సీ. సొమ్ము రాజులు గొన్న సుంకమెక్కించిన

పరదేశి సరుకులు సొరకుమనుట

వణిజులు తమయంత వలసిన ధారణ

సేయజూచుట ప్రజజెఱచికొనుట

తులలు తూములు పాటి నిలుపక సాగంగ

నిచ్చుట ముచ్చిమి కీయకొనుట

కల్లదులాయించి మొల్లంబు వెడసూఱ

గొనగమాన్నమి దానకొనక చెడుట

గీ. కాన నృపతి లోభిగాక పేదల బ్రోచు

తలపు గలిగి బేల దనము విడిచి

తగనివారయందు దాక్షిణ్యమొల్లక

యరయవలయు గూఢ చరుల వలన

ఉ. కొందఱు మేలమాడుటలు కొందరు నావులు దీర్చి పిల్చుటల్

కొందరు ముద్దు సేయుటయు కొందర మనన్న భృత్సురా

కొందర నాత్మభావమున కొందరమన్నన భృత్యరాజి ని

ట్లందర నన్నిభంగుల నృపాగ్రణి వశ్యుల జేయగా దగున్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com