కాదు ఆసియాలోనే తొలి వ్యక్తిగా రికార్డులకు ఎక్కారు. ఈ గీతాంజలి 103 కవితా ఖండికల సమాహారం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన ‘గీతాంజలి: ది సాంగ్ ఆఫరింగ్స్’కి 1913వ సంవత్సరంలో సాహిత్యంలో నోబెల్ పురస్కారం దక్కింది. బెంగాలీ భాషలో రవీంద్రుడు చేసిన ఈ రచన ఆ తర్వాత కాలంలో చాలా ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. మానవుని కృంగదీసే నిరాశ నిస్పృహలు, సకల సృష్టిని ప్రేమభావంతో చూసి శ్రమ గొప్పదనాన్ని సూచించే మహత్తర సందేశం గీతాంజలిలోని ముఖ్యాంశం. అంతేకాదు నోబెల్ పొందిన తొలి భారతీయుడిగానే, దీని మాతృక బెంగాలీలో ఉంది. రవీంద్రుడే ఆంగ్లంలోకి అనువాదం చేసాడు.

గీతాంజలిలోకి ఎక్కువ కవితలను కవికి, దేవుడికి మధ్య సంభాషణల రూపంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రూపొందించారు.   ఆ రోజుల్లో (1900-1913) భక్తి మార్గం బలంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రకృతి ఆరాధన ద్వారా దేవుణ్ణి చేరుకోవడానికి మార్గం ఈ కావ్యం ద్వారా చూపించాడు రచయిత. భక్తితో కూడిన దేశప్రేమ మనకు ఈ పద్యాలలో కనిపిస్తుంది. మరోవైపు ప్రకృతి గీతాంజలి కావ్య రచనకు రవీంద్రనాథ్ ఠాగూరుకు ప్రేరణగా నిలిచింది.  ప్రేమభావాన్ని, మార్మికతను నింపుకున్న ఆ కవిత్వం చాలామంది కవులను ప్రభావితం చేసింది.

గీతాంజలిలోని కవితలు, ఆంగ్లభాషలోకి అనువదించాక, ప్రపంచ దేశాలను ఆకర్షించాయి. గీతాంజలి కవితలు భారతీయ సంస్కృతిని ప్రపంచానికి మరింతగా చేరువ చేశాయి. ‘జనులందరిలోను నిన్ను నీవు, నీలో జనులందరినీ దర్శించుకుంటే నీవు ఎవరినీ ద్వేషించవు’ అని అర్థం చెప్పే ఒక ఉపనిషత్‌ శ్లోకంతో కూడిన ఉపన్యాసాన్ని ఠాగూర్ నోబెల్‌ కమిటీకి పంపారు. సర్వ మానవ సౌభ్రాతృత్వ భావనకు ప్రాణం పోసిన గీతాంజలి ద్వారా, సాహిత్యంలో నోబెల్ బహుమతి సాధించిన తొలి ఆసియా వ్యక్తిగా చరిత్ర పుటల్లో నిలిచారు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్.

‘ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో అక్కడ దేశాన్ని నిలుపు

ఎక్కడ జ్ఞానం విరాజిల్లుతుందో అక్కడ దేశాన్ని నిలుపు..’

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ‘గీతాంజలి’లోని ప్రముఖ వాక్యాలివి.

కవిత్వమనే ఎల్లలు లేని హృదయభాషతో ఒక దార్శనికుడిలా నిలబడ్డవాడు రవీంద్రనాథ్ ఠాగూర్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com