Till We Win

దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది. భారత దేశంపై కరోనా ప్రభావం గురించి Till We Win: India’s Fight against the COVID-19 Pandemic పుస్తకంలో వివరించారు రచయితలు డా. చంద్రకాంత్ లహారియా, డా. గగన్ దీప్ కాంగ్, డా.రణ్ దీప్ గులేరియా. వైద్య రంగంలో నిపుణులైన రచయితలు, కరోనా మహమ్మరి విజృంభణకు దారి తీసిన పరిస్థితులు, ప్రజాజీవనంపై కరోనా ప్రభావం, కరోనా చికిత్స, క్వారంటైన్, దేశ వైద్య రంగంలో జరగాల్సిన మార్పులు వంటి అనేక అంశాలను ఈ పుస్తకంలో వివరించారు.

Listen to My Case!

తమకు జరుగుతున్న అన్యాయాలపై, వ్యవస్థల్లోని లోపాలపై న్యాయపోరాటం చేసిన మహిళల విజయగాథలను Listen to My Case! When Women Approach the Courts of Tamil Nadu పుస్తకంలో వివరించారు జస్టిస్ కే. చంద్రు. మద్రాసు హైకోర్టులో జడ్జిగా పనిచేసిన చంద్రు, తమిళనాడులో జరుగుతున్న వివిధ అంశాలు, అన్యాయాలపై కోర్టుల్లో న్యాయపోరాటం చేసిన 20 మంది మహిళల గురించి, రచయిత ఈ పుస్తకంలో వివరించారు. న్యాయపోరాటం చేసిన మహిళల నేపథ్యం, వారి డిమాండ్లు, కోర్టు తీర్పులను ఇందులో పొందుపరిచారు.

The Braided River

బ్రహ్మపుత్ర నది, ఆసియాలో అతిపెద్ద మరియు అతిముఖ్యమైన నదుల్లో ఒకటి. బ్రహ్మపుత్ర నదీ తీరం వెంట ప్రయాణించిన జర్నలిస్టు సామ్రాట్ చౌదరి, తన అనుభవాలను The Braided River: A Journey Along the Brahmaputra పుస్తకంలో వివరించారు. బ్రహ్మపుత్ర నది టిబెట్ నుంచి భారతదేశంలో ప్రవేశించడం నుండి, నదీ తీరం వెంట ఉన్న ప్రజల జీవన విధానాలు, సంస్కృతి, బంగ్లాదేశ్ లో బ్రహ్మపుత్ర – గంగా నది, చైనా భారత్ సంబంధాల్లో బ్రహ్మపుత్ర పాత్ర వంటి అనేక అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com