ఆయన పాటల కవి .గద్దర్, గోరేటి, అందెశ్రీ వరుసలోనే జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు.ప్రజా కవి గా ప్రసిద్దుడైన వ్యక్తి .

ఈ వరకు సాహితీ లోకంలో జయరాజ్ కి ఉన్న ముద్ర ఇది .ఆయన ఉద్యమ గీతాల్లో ప్రకృతి కూడా దర్శనం,ఇవ్వడం కద్దు .

కాని ‘’అవని’’ ని మన ముందుకు తెచ్చిన జయరాజ్ లో మనకు ఓ విభిన్న కవి కనిపిస్తాడు .ఒక సుకుమారుడైన ప్రకృతి ప్రేమికుడు గా ఆయన్ని మనం గుర్తిస్తాం . నిజానికి ప్రపంచ సాహిత్యం లో ప్రకృతి కి ఎపుడైనా ఓ ఆరాధనీయమైన స్థానమే ఉంది .Return To Nature అనేది కాల్పనిక కవిత్వం లో ఓ ప్రధానమైన నినాదం .దర్శించి వర్ణించాలని సంస్కృత లాక్షణికుల వ్యాఖ్యానం . Words worth తన Immortality Ode లో ఒకటి నుండి నాలుగు వరకు ఉన్న పాదాల్లో తనకు ప్రకృతి దార్శనికత వల్ల వచ్చిన మార్పు ను గురించి చెబుతాడు . The World Is Too much with Us అనే పద్యం లో మనిషి జీవితం ,ప్రకృతి అస్తిత్వం మౌలికం గా ఒకటే అంటాడు .Coleridge First of mid Night భావన లొనూ అభివ్యక్తి లొనూ వర్డ్స్ వర్త్ ను పోలినదే . Coleridge మనిషి పొందే ప్రాకృతిక దృశ్యానుభూతులన్నీ మన అనుభావాలనంటి పుట్టినవే అని భావించాడు . shelley ప్రకృతిని పునస్నాత (A refreshing Principle) గా ఒక వినాశన శక్తి (Destructive Force)గా ఒక సౌందర్య ప్రతినిధి (Beautifying Agent) గా భావించాడు .

జయరాజ్ కూడా ప్రకృతి ని తన అనుభవం నుంచే చూశాడు .మనిషి అనంత అనుభవాన్ని కొన్ని అక్షర సమూహం లో ఒదిగించడం సాధ్యం కాని పని .అందునా వచనం లో పొదుగడం మరింత కష్టం .

తెలుగులో కృష్ణ శాస్త్రి మొదలు కాల్పనిక కవులంతా ప్రకృతిని కవిత్వం లో పొదిగారు.మానవీకరించారు.

కాని జయరాజ్ ఎలాంటి కవితానిర్మాణాన్ని ప్రకృతి వర్ణనకు ప్రాతిపాదిక చేయలేదు .వచనం లో రాశాడు . అది శుద్ధ వచనం కూడా కాదు .కవితా వచనం.

‘’నేలమ్మ ‘’ తో ఇది మొదలవుతుంది.

‘’ఎత్తైన కొండలు ….పరువపు విరులు ..ఎగిరి పోతున్న మేఘాలు ..చల్లని పిల్ల గాలులు …పచ్చని అడవులు …నెలవంకలు …ఇంద్రధనుస్సులు ..నిత్య సూర్య చంద్రోదయాలు …సముద్రాలు …సంధ్యా రాగాలు …

ఇట్లా స్వభావ రమ్యం గా ప్రకృతిని మన ముందు పెడతాడు .ఏ అలంకారాలు ఆర్భాటాలు ఉండవు .మార్మికతను ఆశ్రయించడు .తాను చూసింది చూసినట్టు ,అనుభవించింది అనుభవించినట్టు ప్రకృతి లోని సౌందర్య శకలాలు గుది గుచ్చి మన ముందు పెడతాడు .ఆయన దారిలో అట్లా వెడితే మనం పరిసరాలను మరచి పోతాం .చివరకు కవిని కూడా మరచి పోతాం . ఆయన సృష్టించిన ప్రకృతి లో మునిగి పోతాం .

అట్లా ..చిలుకల గుంపులు ,నెలవంకలు ,తేనెటీగలు ,కిరణాలు ,కోకిల ,తూనీగ ,పిచ్చుక గూళ్ళు, సముద్రపు అలలు ,మాతృ ప్రేమ, లేడి పిల్లలు ,వలస పక్షులు,లాంటి సాధారణ ప్రాకృతికాంశాలు, సుతి మెత్త గా నిసర్గం గా ఉన్న వచనం తో గుండెను తాకుతాయి .ఇవే కాక గొంగళి,ఆరుద్ర,తాబేలు ,సాలీడు ,రింగన పురుగు ,నత్త గుల్లలు ,లాంటి ఎవరూ పట్టించుకోనివి కూడా సుందరం గా కనిపిస్తాయి .మత్తు,ఇప్పపువ్వు ,ఉప్ప,గొల్ల భామ ,(ఒక రకమైన పక్షి ) లాంటివి కూడా అతని మనసు కాంతిని దాటి పోలేదు .

ఉదాహరణకు కొంగలు అనే ఖండికను ఆయన ఎట్లా చిత్రించాడో అయన మాటల్లోనే చూడండి

‘’వినీలాకాశం లో ఎగిరిపోతున్న ఆ కొంగలు ,ఆకాశానికి గవ్వల దండ వేసినట్టుంటాయి .పొద్దున్నే గూడు విడిచి నీటి ప్రవాహం వద్దకు వెళ్లి ఒంటి కాలి పై నిలబడి చేపలకోసం తపస్సు చేస్తాయి .కాలం కరుణించి నాలుగు చిక్కితే జాగ్రత గా ఇంటికి తీసుకొని వెళ్లి పిల్లలకు పంచుకుంటాయి .నిత్యం బురదగుంటలో తిరిగే ఈ కొంగ బావకు ఏనాడు చిన్న బురద అంటదు .ఎప్పుదూ మల్లె పూవు వంటి తెలుపు తో నిగ నిగ లాడుతుంటాయి’’ .. ఇట్లా మెల్లె మెల్లె గా ఆయన ప్రకృతి లోకి మనల్ని తీసుకెళ్ళే ఈ కవి ని ఎలా అభినందించడం ?

ఈయన సరళ మనోహరమైన వచనానికి బసవేశ్వర రావు కవర్ డిజైన్ , ఆట్లాగే భావానికి తగిన చిత్రాలు పాఠక బాటసారిని మరింత సేద తీరుస్తాయి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com