ఆ శేష్టలను ఏమనుకోవాలి ?

చెట్టుకు చారెడు నీళ్లు పోయనివి

ముందో!వెనుకో !నాలుగు అడుగులు వేయ

నెనరులేని కోతుకాల బాతకానిలు

నడి బజార్లో డప్పు సప్పుల్లతో ఊరేగి

పరువు పంతన శెమ్కీ బాసింగమై నాట్యమాడు

సింగులు వూగులాడేస్కోని రొమ్ములు విరిసి నడిచే బడాయిని

ధనం ఆకాశానికి భూమికి నడిమిట్ల

పాసి కుండై కుమ్మరిస్తున్న మోహవాన

పైసలు అడ్డదిడ్డంగా ప్రవహించే పాయలు పాకురు తొవ్వలు

లోభ దారిలో

పాలపిందెల జుగుప్సకార నడక కాదు బంధం

పెబ్బెలకెప్పుడు !మురికి తప్ప !

మూలాల సుగంధ స్పృహ ఆనదు!డియర్

మిడతలదండై కొర్కతినే ఆభూషికి

పచ్చని చెట్టు ప్రాణ పరిమళంతో ఏం !పని ?

నీవు అనుకున్నట్టుగా …

చెట్టంటే వంచితే వంగేది!యిరిస్తే యిరిగేది! కాదు

మహా జ్ఞానబోధి స్నేహవృక్షం

తోటమాలివై తోడుగుండు

వేటుగాడివై కోతపెట్టకు

గొడ్డలి మోకానికి వృక్ష హృదయానికి నేస్తమెన్నడు నెగులదు

కాల్లుపారజాపుకొని అన్నీ ఉన్నాయని ఆనందపడు తావు

చావు పుట్టుకల మధ్య సన్నని గీత దస్కితే

పిండాకూడు పేర్పువై పట్టన పగులుతుంది ఆహం

బల్లిపాతరల సింహాసనం ఎక్కి ! బముసుండెదుకు?

పరోపకారి వైతే గాని పట్టుబడదు

ప్రపంచమెంత నక్కిదువో!

కుద్ గా మోయవలసిన దుక్కాలెప్పుడూ

అదలు బదులు కావు !కారణకార్య మూలాలు

చీకటి వెలుగుల సుఖదుక్కాల సమ్మేళనం జీవితం

వెలుతురు భారంకానీ రంగురంగుల దృశ్యమానం

చీకటి తనువంతా గాయాలైన పుల్లనగొయ్యి మధుర గానం

పచ్చపచ్చని నవ్వుల పువ్వుల పండ్లను స్వప్నించే

పసి మనసుంటెనే కలకాలం ఆయుషుపోసుకుంటుంది దోస్తానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com