నూతన కవి సూరన- ధనాభిరామం

ధనాభిరామం అనేది కొత్తగా కల్పిత కావ్యం . నూతనకవి సూరన క్రీ.శ.1450 ప్రాంతం. తల్లిదండ్రులు పార్వతమ్మ తిప్పన. దేవరకొండ పరిసరాలలో ప్రాంతం. తిక్కన వంశస్థులు బంధువులు. ఆరాధ్యులు వీరభద్రులు గురువులు. నూతనకవి అనేది బిరుదం. సమాజంలో మషికి కావలసింది ధనమా? రూపమా? అనే అంశంపై దేవతలకు చర్చ జరిగింది. అది తేల్చుకోవడాకి రంభను ధనవంతుల దగ్గరకు, రూపవంతుల దగ్గరకు పంపించారు. చివరికి క్షారామ

భీమేశ్వరుడే ప్రత్యక్షమై రెండూ అనవసరమేనని ఈ విషయమై తగవువద్దని చెప్పాడు. ఒక సామాజికాంశంగా దేవతలను పాత్రలుగా చేసిన సరికొత్త కల్పన. పద్యాలు సరళంగా అందరికీ అర్థమయ్యే విధంగా ఉండటంతో పాటు ఆలంకారికంగా ఉన్నాయి.

రూకగలవారు విద్యల రూఢిమించి

నట్టి వారును కులజులు నధమ వృత్తి

ధనముగలవారి వాకిండ్ల ధైర్యముడిగి

కొలిచి యుండుట యెరుగవా కసుమబాణ

చుట్టములుగాని వారలు

చుట్టాలము మీకు ననుచు సొంపుదలిర్సన్

నెట్టుకొని యాశ్రయింతురు

గట్టిగ ద్రవ్యంబు చాలగలరే బంధుల్

కాదనరు ధనముగలిగిన

మేదిని నెటువంటివారి మెలకువ మనుజుల్

శ్రీదొలగిన నూరంచుల

కైదువ గలజోదునైన గైకొనరెందున్

రూపంబు దనముచ్చును

రూపంబటు తనకులంబు రూఢిగ జేయున్

రూపంబు లోకవశ్యము

రూపములేనట్టి వరుని రోతురు భామల్

రూపులేకను జగములో రూఢిలేదు

ధనము లేకను మఱియు నంతకను గొఱత

వలయు రూపంబు ధనము నవశ్యమఖిల

మానవులకను సురలకు మానకిపుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com