చినుకుతో సీమంతమాడి…
మన్నుకు మమకార మద్ది
ఉమ్మ నీటిని అమ్మ నీరు చేసి
చనుబాలతోనే ఓనమాలు పోసి
సమస్త జీవులకు ప్రాణాలూదిన
మాతృదేవోభవ వందనం
ఆట నీవే- పాట నీవే
ఈట నీవే – వేట నీవే
మా కడుపు కోసం ఎన్ని
యుద్ధాలు చేశావో
మన్నునే అన్నం చేసి
రాళ్ళనే ఆయుధం చేసి
ఇనుమునే ఇరుసు చేసి
నీవు నడచిన నడకంతా
నాగరికతే గదమ్మా..
ఆనాటి నీ మాతృ స్వామ్యంతో…
ఈనాటి ప్రజాస్వామ్యాన్ని
సరిపెట్టలేను
అలిమితోనో- బలిమితోనో
అర్థ బలంతోనో – అంగ బలంతోనో
నిన్ను చెరబట్టవచ్చేనేమో కాని
నీ ప్రేమ తత్వం
నీ మాతృత్వం
నీ అమ్మదనం
నీ కమ్మదనం
మా కెక్కడిది తల్లీ..
మా ఆలనా – పాలనా
నీ వల్లే సాధనం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com