ఎండిన జీవులందు చివురెత్తిన యాశల వెల్గులట్లుగా

గుండెల నిబ్బరమ్ముగను కొమ్మల తీయని రాగమట్లుగా

మొండిదియైన కాలమును మోదుగు పూలతొ కాలబెట్టుచున్

పండుగవోలె వచ్చెడిది భావియె నవ్వెడు మల్లె పువ్వుగా.

శార్వరి యెంతజేసితివి చావుభయంబు ప్రపంచమంతటన్

పర్యగ దూరముంచితివి పాపల తల్లుల బంధుమిత్రులన్

సర్వవిధాలజీవనప్రసారిత రక్తము చింద జేసియున్

యుర్విమహానుభావులనునూరక పొట్టన బెట్టుకొంటివే.

శార్వరియనగరాత్రి ప్రశాంతమనుచు

మోదమునబిల్వ మమ్ముల మోసపుచ్చి

శార్వరియనగాఢ తిమిరపిశాచమట్లు

పగలు రాత్రియు చీకటే పంచినావు

కాలము మంచిచెడ్డలకు కష్టసుఖాలకు సాక్షిరూపమౌ

కాలమనాద్యనంతమగు, ఖండము చేయుచు పేర్లు పెట్టినన్

లీలగ కాని పించు నవలీలగ హర్షముపంచియిచ్చి తా /P>

పాలన చేయుచుండునొక వర్షము పాటుగ లోకమంతయున్

వేపసుమించుహర్షమున వేడ్కను మింటను తారలోయనన్/P>

పూపవయస్సులో పికము ముద్దుగకూయుచు నన్ని బాధలన్

బాపనుగాదివచ్చెనట, పాపలనెత్తిరసాలమూయలై

ప్రాపుగనుండవత్తువన పల్కుదు నో ప్లవ’ స్వాగతమ్మికన్

భువిపాలించెడు దుష్టరాజులకు పోగాలంబు నేతెంచు విచ్చేయు, సం

భవమౌధర్మము సల్పుపాలనము సౌభాగ్యంబు సద్వర్షమై

ప్లవ మై జీవనదాన విప్లవము సంభావించు ప్రాభాతమై

పువులన్ నింపినమల్లెతీగవయి సమ్మోదమ్ముతోరమ్మికన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com