
జ్ఞానపీఠ్ పొందిన తొలి ఆంగ్ల భాషా రచయిత అమితావ్ ఘోష్
సాహిత్య రంగంలో విశేష కృషిచేసినందుకు, ప్రముఖ రచయిత అమితావ్ ఘోష్ 2018వ సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారం గెలుచుకున్న తొలి ఆంగ్ల భాషా రచయిత అమితావ్ ఘోష్ కావడం విశేషం. ఆయన 54వ జ్ఞానపీఠ్ పురస్కారాన్ని అందుకున్నారు.
1956లో కోల్‌కతాలో జన్మించిన అమితావ్ ఘోష్ ప్రస్తుతం న్యూయార్క్‌లో నివసిస్తున్నారు. అమితావ్ ఘోష్ కు గుంపులో ఒకడిగా కాకుండా తనకంటూ ప్రత్యేకతను చాటుకొనే రచయితగా సాహితీ లోకంలో గుర్తింపు ఉంది. చరిత్రలోని విషయాలను అత్యంత నిపుణతతో వర్తమానానికి జోడించడం ఆయనకే సాధ్యమైన శైలి. చరిత్రను, వర్తమానానికి జోడించేందుకు, తన రచనల్లో ఒక ప్రత్యేక సందర్భాన్ని ఏర్పరచుకుంటారు అమితావ్
ఘోష్. 1989లో ద షాడో లైన్స్ అనే పుస్తకానికి ఆయన సాహిత్య అకాడెమీ అవార్డు గెలుచుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని అందజేసింది. ఆయన ప్రముఖ రచనల్లో ‘ద సర్కిల్ ఆఫ్ రీజన్’, ‘ది షాడో లైన్’, ‘ద కలకత్తా క్రోమోజోమ్’, ‘ద గ్లాస్ ప్యాలెస్’, ‘ద హంగ్రీ టైడ్’, ‘రివర్ ఆఫ్ స్మోక్’, ‘ఫ్లడ్ ఆఫ్ ఫైర్’ ప్రముఖమైనవి.