నోబెల్ సాహిత్య బహుమతి విజేత టోమస్ ట్రాన్ స్ట్రోమర్

స్వీడన్ దేశానికి చెందిన టోమస్ ట్రాన్స్ స్టోమర్ 2011 లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నాడు. టోమస్ ట్రాన్స్ స్టోమర్ తన రచనల ద్వారా పాఠకులకు వాస్తవికతను సరికొత్తగా, తాజాగా పరిచయం చేస్తాడు. రెండో ప్రపంచ యుద్దం తర్వాత, అత్యంత ప్రభావశీల స్వీడన్ రచయితల్లో ఒకరిగా టోమస్ ట్రాన్స్ స్టోమర్ ఖ్యాతి గడించాడు. ఇతని రచనలు దాదాపు 60కి పైగా భాషల్లోకి అనువదించబడ్డాయి. సీక్రెట్స్ ఆన్ ద వే, ద హాఫ్ ఫినిష్డ్ హెవెన్, ద గ్రేట్ ఎనిగ్మా వంటివి ట్రాన్స్ స్టోమర్ ప్రముఖ రచనలు.

జ్ఞాన్ పీఠ పురస్కార గ్రహీత అమర్ కాంత్

ప్రసిద్ధ హిందీ రచయిత అమర్ కాంత్ 2009లో జ్ఞాన్ పీఠ పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో జన్మించిన అమర్ కాంత్, అనేక చిన్న కథలు,నవలలు మరియు సామాన్యప్రజల జీవితాలను ప్రతిభింభించే రచనలు చేశారు. అమర్ కాంత్ 1942 క్విట్ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. అతని కథలు మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబిస్తాయి. క్విట్ఇండియా నేపథ్యంలో రచించిన ఇన్హీ హతియారోన్ సే అనే నవలకు గాను ఆయన 2007లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును పొందారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com