సీనియర్ జర్నలిస్ట్, కవి , రచయిత మధుకర్ వైద్యుల రచించిన బొగ్గుపూలు కవిత సంపుటి ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలోని రుగ్మతలను రూపుమాపడం కోసం కవులు, కళాకారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మధుకర్ వైద్యుల చిన్నతనం నుంచే కవితలు, కథలు రాస్తూ సాహిత్యానికి సేవ చేస్తున్నారని, గతంలోనూ ఆయన స్వతంత్రసుమాలు పేరుతో కవిత సంపుటి వేశారని గుర్తు చేశారు. ఆయన కవితలు సమాజాన్ని ప్రశ్నించడంతో పాటు, సామాజిక బాధ్యతను గుర్తు చేస్తాయని అన్నారు. ఈ ఆవిష్కరణ సమావేశంలో పుస్తక రచయిత మధుకర్ వైద్యుల, తెలంగాణ జాగృతి ప్రధానకార్యదర్శి నవీన్ ఆచారి, పీఎ శరత్‌చంద్రా, మధుకర్ కుటుంభసభ్యులు సుమలత, ఆశికారెడ్డి, అన్వేషికా రెడ్డి, ప్రదిప్, తిరుమల్, మధు తదితరలు పాల్గొన్నారు.