కళాజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం 9.9.2020 సాయంత్రం ఆరు గంటలకు గూగుల్ మీట్ ద్వారా కాళోజీ కవిత్వ జయంతిని నిర్వహించారు. డా. నందిని సిధారెడ్డి కాళోజీ కవిత్వాన్ని పఠించారు. డా. తూర్చు మల్లారెడ్డి కాళోజీ కవితా శిల్పంపై ప్రసంగించారు. డా. నాళేశ్వరం శంకరం సభకు అధ్యక్షత వహించారు. డా.వి. శంకర్ సభను సమన్యయం చేశారు.
డా.నందిని సిధారెడ్డి కాళోజీ ‘నా గొడవ’ లోని వైవిధ్యమైన, విశిష్టమైన కవితలను ఎన్నుకుని పఠించారు. పఠించేముందు కాళోజీ వ్యక్తిత్వంలో గానీ, జీవితంలో గానీ, కవిత్వంలో గానీ ఆయనదైన ప్రత్యేక శైలి మరెవరికీ లేదన్నారు. ఆయన కవిత్వం శిల్ప మర్యాదల్ని పాటించలేదు. సమకాలీన సంఘటనలను కవితాత్మకమైన రన్నింగ్ కామెంట్రీలా ఉంటాయన్నారు.
డా.తూర్పు మల్లారెడ్డి కవితా శిల్పంపై ప్రసంగిస్తూ కాళోజీ ఎంచుకున్నది ప్రజా చైతన్యపు తోవ. అదే ఆయన కవిత్వపు శిల్పం. ప్రజల భాషను స్వీకరించడం వల్ల ప్రజాకవి అయ్యిండు. ప్రజా కవిత్పపు శిల్పంతో ఆయన కవిత్వం రానిస్తుందని అన్నారు.
సభకు అధ్యక్షత వహించిన డా.నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ, కాళోజీ ఒక రస్సెల్, ఒక ఖలీల్ జీబ్రాన్, ఒక లూయి, ఒక వేమన, ఒక చౌడప్ప, ఒక చార్వాకుడు, ఒక లోకామతుడు, ఒక వివేకానందుడు, ఒక పౌర హక్కుల నేత, ఒక నక్సలైటు, ఒక తాత్వికుడు అన్నీ కలిస్తే కాళోజీ అని ఆయన పలుకుబడుల భాషను ఒక ఉద్యమంగా లేవదీసి తెలంగాణ ప్రామాణిక భాషను నిర్మించుకోవాలని నాళేశ్వరం అన్నారు.
