–డా. సి.వి. జయవీర రాజు

ఆ.వె. తెలుగు గడ్డపై పౌరుషమ్మోలకించు

ఓరుగల్లు జాడ జానర నొప్పు

కాకతీయ రాజ క్షాత్రియ ధర్మాన్ని

కనగ దెలియు మనకు కాంచు దీర!

తే.గీ. స్తంభములు వేయి చక్కని నౌధ మందు

వెలసె రుద్రేశ్వరాలయం బిలను జేర

పూజలను గాను వరములు పుణ్యతమున

కాకతీయుల దైవమై కాంచు చుండు

తే గీ నృత్య సంపద కుఢ్యము లందగించు

శిల్ప కళలెన్నో చక్కగా చిత్రమలెరు

నాట్య భంగిమలెన్నియో నాణ్యమెప్పు

కనగ తీరును కోరికల్ కన్నులార!

సీ:- ప్రాకారములు జాడ ప్రాభవమ్మును దెల్పు

రాజుల వైభవం రాజ్యమందు

దేవాల యాల్జూడ దైవత్యమెప్పుడు

భక్తి పాటవమున రక్తిగల్గు

సాహిత్య మును జూడ చవులూరు చుండును

సంగీత నాట్యాల సరసమాడ

రాజ్య పాలన జూడ పూజ్యతనే గల్గును

ప్రజల మేలుగలుగ ప్రభుత నిలుచు

కవుల పోషణ కావ్యాల కవనమందు

వృత్తి ధర్మాల నెగడు ప్రవృత్తులందు

తృప్తి గలిగించు జీవన తీరులందు

ఘనత కెక్కిరి కాకాతికైతలంద!

ఆ.వె. ప్రజల క్షేమ మరసి పనులను జేయగా

కాకతీయ రాజ్య ఘనత తెలియ

చూడ నిచ్ఛగించు చూడ్కుల కనువిందు

కనగ వలయు గాని కాంక్ష దీరు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com