తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం ఏర్పాటు చేసిన జూమ్ సాహిత్య ఈ కార్యక్రమంలో లో “పి. వి విశ్వనాథ వేయి పడగలు” అనే అంశం మీద ప్రముఖ విమర్శకులు గండ్ర లక్ష్మణ్ రావు ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం పి. వి నరసింహారావు శతజయంతి సందర్భంగా పి.వి సంవత్సరంగా ప్రకటించింది తెలిసిందే. ఈ విషయం పురస్కరించుకొని జాగృతి ప్రతి నెల రెండు సాహిత్య ప్రసంగాలను నిర్వహించాలని నిర్ణయించింది. పి.వి మెచ్చిన కవి విశ్వనాథంగా ఆయనపై మొదటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత నిర్ణయించారు. కార్యక్రమానికి జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు డాక్టర్ కాంచనపల్లి సంచాలకులుగా వ్యవహరించారు. గండ్ర లక్ష్మణరావు విశ్వనాథ, పి. వి ల సాహిత్య బంధం గురించి వివరించారు. విశ్వనాథ సర్వాంగీణ సాహిత్య వైభవాన్ని వివరిస్తూ ఆయన వేయి పడగల రచనా విశిష్టతను కొనియాడారు. పి. వి వేయి పడగలను హిందీ లోకి అనువదించిన నైపుణ్యాన్ని వివరించారు. కార్యక్రమంలో మరుమాముల దత్తాత్రేయ శర్మ, వడ్డేపల్లి కృష్ణ, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, ఉషారాణి పొట్లపల్లి శ్రీనివాసరావు, జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, జిల్లా అధ్యక్షులు జాడి శ్రీనివాస్, అవంతీ కుమార్ లతోపాటు జాగృతి న్యూజిలాండ్ ఖతర్ అధ్యక్షురాలు నందిని, జాగృతి న్యూజిలాండ్ అధ్యక్షులు ముగ్దుం జ్యోతి మొదలైన దేశ విదేశ జాగృతి ప్రముఖులు, ఎందరో సాహితీ ప్రముఖులు పాల్గొన్నారు.
