అక్టోబర్ 16, 2020 లో ప్రారంభించిన తంగేడు సాహిత్య పక్షపత్రిక మీ అందరి అభిమానంతో ముందుకు సాగుతున్నది .సాహిత్యం లో ఉత్తమ విలువలు నిర్మించడం తో పటు యువ సాహితీవేత్తలను ప్రోత్సహించడం అనే లక్ష్యాన్ని గురుతరం గ పాటిస్తున్నది . ఇల్లాంటి ఉత్తమ సాహిత్య నిర్మాణం లో భాగం గా ప్లవ నామ సంవత్సర ఉగాది కథల పోటీ నిర్వహించాలని సంకల్పించింది . రాష్ట్ర రాష్ట్రేతర దేశ ,విదీశీ తెలుగు కథా రచయితలంతా ఈ పోటీలో పాల్గొన వచ్చు .మా కథా యఙ్ఞం లో భాగస్వాములు కావచ్చు .

నిబంధనలు ;

1)కథలు తెలంగాణ సంస్కృతి ,సమకాలీన జీవన ప్రతి ఫలనం ,నేపధ్యం గా ఉండాలి .సృజనాత్మకత సమాంతర వైవిధ్యం ,తెలంగాణ నుడికారం కలిగిన కథలకు ప్రాధాన్యం ఉంటుంది .

2)ఇంతకు ముందు ఎక్కడా ప్రింటు పత్రికలలోగానీ ,వెబ్ పత్రికల లో గానీ ,సోషల్ మీడియా లో గానీ ,ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపించాలి .

3) ఈ వరకు ఎక్కడైనా పరిశీలన లో ఉన్న రచనలు పోటీకి అనర్హం .

4) ప్రచురణ కు అంగీకరించని రాత ప్రతులు తిరిగి పంపడం సాధ్యం కాదు .

5) రచనకు ఏ కలం పేరు ఉపయోగించినా ,హామీ పత్రం లో మాత్రం తప్పక పూర్తి పేరు ,చిరునామా ,ఫోన్ నెంబర్ రాయాలి . కేవలం జతచేసిన హామీ పత్రం లో తప్ప ,కథా రచన క్రింద పేరు రాయకూడదు . హామీ పత్రం వేరే పేపరు పై రాసి జత చేయాలి .

6) బహుమతి కి ఎంపిక కాని మంచి కథలను సాధార ప్రచురణ కు స్వీకరిస్తాం . సాధారణ ప్రచురణ కు స్వీకరించిన కథ ల కు రూ. 1000.00 ( వేయి రూపాయలు) పారితోషికం ఉంటుంది .

7) రాత ప్రతి అయితే కథ 8 నుండి పది పేజీలు మించకుండా ఉండాలి . 1300 పదాలు ఉండేటట్టు చూసుకోవాలి .

8)ఈ మెయిల్ లో పంపేవారు యూనిక్ కోడ్ వర్డ్ ఫైల్ ద్వారా పంపవచ్చు .దానికి పి.డి.ఎఫ్. కూడా అటాచ్ చేయాలి .

9)పేజీ మేకర్ లో డి.టి.పీ. చేసి కథలు పంపేవారు పీ.ఎం.డి. ఫైలును , పి.డి.ఎఫ్. ను కూడా జత చేసి మెయిల్ చేయాలి .

10) ఏ మతాన్ని గాని ,కులాన్ని గాని ,వర్గాలను గాని వ్యక్తులను గాని , కించపరచే అంశాలేవీ రచన లో ప్రతిఫలించ కూడదు .

11) కవరు పై ఉగాది కథల పోటీకి అని స్పష్టం గా రాయాలి .

12)ప్రచురణ కు ఎంపికైన రచనలు ఎడిట్ చేసుకునే హక్కు సంపాదకులకు ఉంటుంది .

13) బహుమతులకు రచనలు ఎంపిక చేసేది మేం నియమించుకున్న న్యాయ నిర్ణేత లే . ఎవరూ ఎలాంటి సంప్రదింపులు జరుపకూడదు .

14) కథలు మార్చ్ 10,2021 వరకు మాకు చేరాలి .గడువు దాటాక వచ్చే కథలు పరిశీలించడం సాధ్యం కాదు .

కథలు పంపించవలసిన చిరునామా

తెలంగాణ జాగృతి

పాశం అమృతరాం రెసిడెన్సీ, ఇ.నెం.1-2-234/13/46/4,

3వ అంతస్థు

ఎన్‌టిఆర్ స్టేడియం దగ్గర,

అరవింద్ నగర్, దోమలగూడ, హైదరాబాద్- 5000029

తెలంగాణ: E-mail: editor@thangedu.co.in

బహుమతుల వివరాలు ;

!) ప్రథమ బహుమతి : 20,000 రు.

2) ద్వితీయ బహుమతి : 10,000 రు.

3) తృతీయ బహుమతి: 5000 రు.

4) ప్రచురణ కు ఎంపిక చేసిన రచనలకు పదునైదింటికి ఒక్కొక్క టికీ 1000 రు.

కల్వకుంట్ల కవిత .

ఎడిటర్ , తంగేడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com