మొన్న…

నెత్తి మీద సద్దిమూట బెట్టుకుని

పొట్ట చేత బట్టుకుని

పల్లె విడిచి

పట్నమొచ్చిండు మా నాయన-

నేడు…

చంకలో కంప్యూటర్ బెట్టుకుని

కెరీర్ కెరీర్ అంటూ

పట్నమిడిచి

పరాయి దేశాలకు పోతున్రు మా పిల్లలు-

నేను…

మొన్నకూ, నేటికీ నడుమ

పల్లెకూ, పరాయి దేశానికీ నడుమ

ఎటూ కానివాడివై

ప్రశ్నార్థకంగా మిగిలాను-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com