
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రచురణ ‘వచన కవిత్వం – వస్తు శిల్పాలు’ గ్రంథం ఆవిష్కరణ
తెలంగాణ సారస్వత పరిషత్ ప్రచురణ ‘వచన కవిత్వం – వస్తు శిల్పాలు’ గ్రంథం ఆవిష్కరణ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికృష్ణ గ్రంథం ఆవిష్కరించాడు. శిఖామణి, మామిడి హరికృష్ణ, ఎల్లూరి శివారెడ్డి, రామారావు, డా.కాంచనపల్లి గో.రా., జె.చెన్నయ్య పాల్గొన్నారు.

తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఉపద్రవ గాథ ‘అనిమేష’ ఆవిష్కరణ
విశ్వనాథ సృష్టి- ఆచార్య సుప్రసన్న దృష్టి
అక్షరార్చన భారతి వాక్స్థలి సమూహం పక్షాన నిర్వహించిన సాహిత్య కార్యక్రమం ‘విశ్వనాథ సృష్టి- ఆచార్య సుప్రసన్న దృష్టి’ అనే అంశంపై డా. గండ్ర లక్ష్మణరావు ప్రసంగించారు. రామాయణ కల్పవృక్షంలో శ్రీ విద్యా రహస్యాన్ని నిక్షిప్తం చేసినట్లు సుప్రసన్న గారు రసరాజధానిలో నిరూపించారని, సీతను ఆదిపరాశక్తిగా ధ్వనింపజేశారని వివరించారు. విశ్వనాథకు సన్నిహితంగా ఉన్న సుప్రసన్న తాత్విక కోణంలో వివేచించారని తెలిపారు. యోగ లక్షణాలు మొదలైనవి ఇతర కావ్యాల్లో తెలిపినవాటిని లక్ష్మణరావు సోదాహరణంగా వివరించారు. గిరిజా మనోహరబాబు, నాగిళ్ళ రామశాస్త్రి, కుందావఝుల కృష్ణ మూర్తి, పాలకుర్తి శ్యామలానంద ప్రసాద్, హన్మంత రావు, వఝుల రంగాచార్య, అనంతకృష్ణ మొదలైన వారు పాల్గొన్నారు.