తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో… మొట్ట మొదటి కవిసమ్మేళనం

తెలంగాణ రచయితల సంఘం జంటనగరాల శాఖ ఆధ్వర్యంలో జూం ద్వారా తేది 23-11-2020 నాడు సోమవారం కవిసమ్మేళనం నిర్వహించారు. ఇది మొట్ట మొదటి కవిసమ్మేళనం అయినా చాలా గొప్పగాకొనసాగింది.చాలామంది మంచి కవితలు చదివారు.ఇందులో శ్రీయుతులు రూప్ కుమార్ డబ్బీకార్, ఒద్దిరాజుప్రవీణ్ కుమార్, దేవనపల్లి వీణావాణి, నక్కాహరికృష్ణ తదితరులు కవితలు చదివారు. జంటనగరాల శాఖ అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు కందుకూరిశ్రీరాములు, బెల్లంకొండ సంపత్ కుమార్ లు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.

తెలంగాణ జాగృతి జూం సభ

తెలంగాణ జాగృతి బుక్ క్లబ్ పి.వి. స్మరణ సంవత్సరంలో ప్రతి నెలా ఏర్పాటు చేస్తున్న జూమ్ ప్రసంగం సందర్భంగా నవంబర్ 28,2020 శనివారం కె.విద్యావతి ప్రసంగం ఏర్పాటు చేసింది. కె.విద్యావతి, మాదిరెడ్డి సులోచన సుషుప్తి నవలపైన ప్రసంగించారు. బహుజన వాదం తెలుగు సాహిత్యంలో ప్రవేశించక ముందే ఆ దృక్పథంతో మాదిరెడ్డి సుషుప్తి రచించారని ఆమె తెలియజేశారు. కుమ్మరి కులాన్ని గురించి రాసిన సుషుప్తి నవలపైన విద్యావతి సుదీర్ఘ ప్రసంగం చేశారు. తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు కాంచనపల్లి గో.రా. సంచాలకులు గా వ్యవహరించారు.

ఆత్మ పరిశీలన గొప్ప లక్షణం …నేను-2 ఆవిష్కరణ సభలో ఎమ్మెల్సీ కవిత

మనిషి తనను తాను పరిశీలించు కోవడం, అర్థం చేసుకోవడం గొప్ప లక్షణం అని, తనలోకి తాను చూసుకో గలిగితే ధైర్యం సాహసం కరుణ మానవత్వం మనిషికి అలవడతాయని నరాల సుధాకర్ నేను అనే శీర్షికతో కవిత్వం రాస్తూ తన అంతరంగాన్ని నిరంతరం దర్శిస్తూ సమాజంలో ఆదర్శంగా ఎదుగుతాడని శాసన మండలి సభ్యురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గురువారం నాడు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాదులోని తన కార్యాలయంలో ఆమె నరాల సుధాకర్ రచించిన నేను 2 కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. సామాజిక సేవ, ఆధ్యాత్మికత, సాహిత్య సాంస్కృతిక సేవ, ప్రకృతి పరిశీలన, మానవ పరిణామాలు అంశాలుగా కవిత్వం రాసిన నరాల సుధాకర్ తెలంగాణ సాహిత్య రంగంలో తనకంటూ శైలిని ఏర్పరుచుకున్నాడు అని అభినందించారు. ఈ పుస్తకాన్ని తనకు అంకితం ఇవ్వడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. కవి నరాల సుధాకర్ జ్ఞాపికతో శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తొలి ప్రతి స్వీకరించిన ప్రముఖ కవి నర్సింహారెడ్డి మాట్లాడుతూ కవిత్వం అంటే నిరంతరం పరిణితి సాధించడం అని, సుధాకర్ కవిత్వం ఆరోహణ క్రమంలో అద్భుతంగా సాగుతోందని వివరించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్ మాట్లాడుతూ మంచి కవిత్వం రాయాలని తపన, మంచి పనులు చేయిస్తుందని కవిగా, సమాజ సేవకుడిగా, విద్యావేత్తగా సుధాకర్ బహుముఖంగా రాణిస్తున్నారని సుధాకర్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు రాజీవ్ సాగర్, జిల్లా అధ్యక్షుడు అవంతి రావు, సాహిత్య విభాగం అధ్యక్షుడు తిరుమల శ్రీనివాసార్య, దశరథ్ కొత్మీర్కర్, కొయ్యడ శంకర్, తంగళ్ళపల్లి నరేష్ చారి, సురేష్, హనుమాన్లు, నరాల స్వప్న, మోహన సాయి, తదితరులు పాల్గొన్నారు. శాసన మండలి సభ్యురాలు గా విజయం సాధించినందుకు సంఘం తరఫున కవితను సన్మానించారు.

అది ఏదైనా సరే!

శ్వాస ఆడితే చాలు

పూల పరిమళాలను ఆశ్వాదించ వచ్చు

కనుల రెప్పలు విప్పారితే చాలు

ప్రకృతి అందాలను తిలకించవచ్చు!

వెచ్చని స్పర్శ నీదైతే చాలు

కరచాలనంతో స్నేహాన్ని పంచవచ్చ

కరిగే మనసుంటే చాలు

ఎదుటి వాళ్ళ కన్నీటిని మాయం చేయవచ్చు!

ఎదలో ద్వేషం మెలకెత్తిందా

నీ నీడే శత్రువై వెంటాడుతది

హద్దు మీరి చొరబాటుకు యత్నిస్తే

మృత్యువు సంభాషణ వినవలసి వస్తది!

ఇద్దరి మధ్య పచ్చ గడ్డేసి

ఏది మంటలు రాజేసిందో

దాని నెత్తిన పెట్రోలు పోసి తగులబెట్టాలి

అది ఏ మతమైనా సరే!!

:– కోట్ల వెంకటేశ్వర రెడ్డి

94402 33261.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com