తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాల రాష్ట్రస్థాయి విద్యార్ధి కవి సమ్మేళనం

మార్చ్ 22 న ప్రపంచ కవిత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాల రాష్ట్రస్థాయి విద్యార్ధి కవి సమ్మేళనం నిర్వహించారు. తెలంగాణ లోని 26 ప్రభుత్వ డిగ్రీ కళాశాల ల విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్ధి ఎం. వెంకట్ రాసిన శ్మశాన పలుకరింపు కవిత ప్రథమ బహుమతి గెల్చుకోగా, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారం కు చెందిన కే. సాయి సురేష్ ద్వితీయ బహుమతి పొందినాడు. ఈ కార్యక్ర మాన్ని నిర్వహించిన తెలుగు విభాగ అధిపతి డా.ఎం. సంపత్ కుమార్ రెడ్డిని, తెలుగు అధ్యాపక బృందమును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. టి. శ్రీలక్ష్మి అభినందించారు.

సాహితీ సోపతి-పదేండ్ల పండుగ

సాహితీ సోపతి సంస్థను నెలకొలిపి పదేండ్లు నిండిన సందర్భంగా ఏప్రిల్5,2021 సోమవారం కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో ఒక రోజు కథ,కవిత్వ సదస్సు తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో జరుగింది.

పొద్దటి పూట అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన “కవిత్వం ముచ్చటలో కె. ఆనందాచారి, డా. కాంచనపల్లి గోవర్థనరాజ, డాక్టర్ నలిమెల భాస్కర్, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, గాజోజు నాగభూషణం, గులాబీల మల్లారెడ్డి, మల్లావజ్ఝల నారాయణ శర్మ, గులాబీల మల్లారెడ్డి తదితరులు మాట్లాడారు. కూకట్ల తిరుపతి సంపాదకత్వం వహించిన “సోపతి”బులెటిన్-2ను కె. ఆనందాచారి, దామరకుంట శంకరయ్య రచన “సీతాకోక రెక్కలు” హైకూలను డాక్టర్ కాంచనపల్లి గోవర్థన రాజు ఆవిష్కరించారు.

కందుకూరి అంజయ్య అధ్యక్షతన జరిగిన కథ ముచ్చటలో జూపాక సుభద్ర, డాక్టర్ బి.వి. ఎన్. స్వామి, బెజ్జారపు రవీందర్, బూర్ల వేంకటేశ్వర్లు, మాడిశెట్టి గోపాల్, బుర్ర తిరుపతి తదితరులు ప్రసంగించారు. డిగ్రీ విద్యార్థుల కవిత్వం “విద్యార్థి కలం” ను జూపాక సుభద్ర ఆవిష్కరించారు.

అక్కెపల్లి ఫౌండేషన్ కరీంనగర్, సినారె విశిష్ట సాహిత్య పురస్కార ప్రశంస పత్రాలు, తలా పదకొండు వందల పదహారు నగదుతో నడిమెట్ల రామయ్య, కందుకూరి అంజయ్య, కూకట్ల తిరుపతి, తోట నిర్మలారాణి, పెనుకొండ సరసిజ, దామరకుంట శంకరయ్యలకు ప్రదానం చేశారు. సాహితీ సోపతి-పదేండ్ల పండుగకు కూకట్ల తిరుపతి, సి. వి. కుమార్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం ఈ పండుగలో పాల్గొన్న సాహిత్యకారులకు జ్ఞాపికలను అందించారు.

అమృతోత్సవ కవి సమ్మేళనం…

ఏప్రిల్ 3, 2021 భారత స్వాతంత్ర్యానికి డెబ్బై అయిదేళ్ళు నిండిన సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ కవితోత్సవాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుండి హాజరైన కవులు కవితా గానం చేశారు. భారతదేశం రానున్న కాలంలో

పొందవలసిన గౌరవాన్ని ప్రోది చేసుకోవాల్సిన జాతీయను కవులు తమ కవితల్లో వినిపిం చారు. పాల్గొన్న కవులందరికీ తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి మామిడి హరికృష్ణ మెమెంటోలతో సంత్కరించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన వక్తలు కవుల కవిత్వాలలో భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వం ప్రతిఫలించదని కొనియాడారు.

కవన కిరణాలు-కవితా సంకలనం ఆవిష్కరణ సభ

మార్చి 24న రవీంద్రభారతిలో “కవన కిరణాలు- ” కవితా సంకలనం ఆవిష్కరణ సభలో సాహిత్య ప్రకాశ్, తులాల సవరమ్మ, బైస దేవదాసు, శివ మంచాల, ఆవిష్కర్త, డా॥ నందిని సిధారెడ్డి, దేవానంద్ నాగేల్ల, మౌనశ్రీ మల్లిక్, గూడూరు ప్రభంజన్, వెల్మజాల నరిసింహ తదితరులు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com