-పాల్కురికి సోమనాథుడు

12-13  శతాబ్దాల మధ్య జీవించిన పాల్కురికి సోమనాథుని జన్మస్థలం పాల్కురికి అనే గ్రామం. ఇది ఓరుగల్లుకు (వరంగల్లు) 30 కి.మి.లలో ఉంది. తెలుగులో మొదటి స్వతంత్ర (అనువాదం కాకుండా) రచన చేసిన తెలంగాణ కవి పాల్కురికి కావ్య ప్రారంభం సంస్కృత శ్లోకంలో రాసే పద్ధతి వదలి తెలుగు పద్యంతోనే ప్రారంభించిన నాటి అభ్యుదయ కవి. ఈయన దేశ చందస్సు లోనే రచన కొనసాగించాడు.

గోడగూచి అనే జానపద పసిబాల అమాయకమైన భక్తితో తాను పోసిన పాలు శివుడు ఆరగించలేదని ప్రశ్నిస్తే శివుడు ఆమెను అనుగ్రహించిన సన్నివేశం ఇది.

 

 

“యోసి! నేఁడేల పాలొల్లండు ద్రావ

 ముక్కంటి ముట్టెనే మూర్కొన్నె చెపుమ

పెక్కులు వ్రేలితి వక్కజంబుగను

శివునకు నని యుద్దెసించినపాలు

దవిలి నిత్యంబును ద్రావినద్రోహి!

పొట్ట వ్రచ్చెద నెందుఁబోయెద”వనుచుఁ

గట్టుగ్రమునఁగూడ ముట్టుడు మున్న

బాల వాపోవుచు బలువిడినేఁగి

హాలింగ! హాలింగ! హాలింగ! యనుచుఁ

జేతికోరకు మున్ను సేయిసాఁచుచును

నాతని కొదుఁగుడు నంతలోపలను

హరుఁ డోడకోడకు మనుచు నాక్షణమ

వరదయామతిఁ దనవక్షంబుఁ దెఱవ

జగదభినుతకరడిగ భోగనాథు

నగణిత దివ్యలింగాంగంబుసొరంగ

 నమ్మాత్రలోనహహా! పోయె ననుచుఁ

 గ్రమ్మనఁ దండ్రి గూఁకటి వట్టుటయును

వెలుపలఁ గూఁకటి వెంట్రుకల్ సిక్కి

వెలయ లింగంబ లోపలఁ జిక్కె బాల

నలరి కూఁకటి వెండ్రుకలు గత్తిరింప

‘బాల నిశ్చలముగ్ధభావ సంపదకు

నీ లోకమున దృష్ట’ మిది యని పొడుడ

గొడగూచి యని చెప్పఁబడి మహామహిమ

నడరెఁ దా నా ముగ్ధ యదియునుగాక.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com