ఎదిగిన పిల్లల్లా

ఇంటినిండా తిరిగొచ్చిన కవితలు

ఎంత అందంగా ఉన్నా , ఎన్ని ప్రతికల పరిమళాలైనా

దొంపుసొంపుల సోయగాలన్నా ఎవరికి ముద్దూ?

ఎవరిపాదాన్యతలు వారివి.. వాదానికి వాదం కుదరొద్దు..?

తిరిగొచ్చిన కవితలు తిరిగి తిరిగి పంపిస్తున్నపుడు

మదిలో ఒక కలత లాంటి నలత..

అవునూ – రాయాలనిపించడం వొక మానసిక రుగ్మతే

ఇంకా ఎవరూ ముందుకనుక్కోలేని మహమ్మారి

మనిషే ఒక అగణిత బాక్టీరియా అవశేషం కదా

సరే నిమ్మరసం అయినట్టు మార్కెట్ వ్యూహాలు మర్మంగానే ఉంటాయి

మళ్ళీ కవిత్వం దగ్గరకే వద్దాం – ఏదో.. ఏదేదో

రాయాలని నాడీ చాలక నాట్య విన్యాసం

దేశాన్ని ఉద్ధరించకున్నా ఒక భృకుటి ముడేస్తే

అక్షర అవతారం సుసంపన్నమయినట్టే..!

రాస్తూ ఉంటాం – కథలూ, కవితాలూ నానా మేధోరూపశిలలు

గుడ్డివాడి బాణంలా ఏదో ఒకటి తగులుతుంది

వందలు వేలు మిగిలి దిగులుపడతాయి

నాకే నేను చాలా సార్లు నచ్చలేను. నా కవితలు

అందరికీ ఎలా నచ్చుతాయి ..?

అయినా ఆలోచనలు వదలవు-అక్షరాలు నిద్రపోనివ్వవు

రాయాలి – తిరిగి రావాలి-ఆశ కాలాన్ని గెలవాలి

చిత్తం నిరంతరం శుద్ధి కావాలి….

అవునూ – చిత్తశుద్ధి ఇంకా ఇంకా బలపడాలి –1/

-చొప్పదండి సుధాకర్ 9177340349

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com