పల్లవి: అక్షరమా! అక్షరమా!! నీ

లక్షణమది గొప్పదే అక్షరమా!

చరణం: అజ్ఞానం అంతరించి

విజ్ఞానం వికసించుచు

సృష్టినంత సుట్టేవు అక్షరమా!

నీ ప్రజ్ఞ ఎంత గొప్పదే అక్షరమా || అక్షరమా!!

చరణం : అక్షరాలు జతగూడిన పురుడు పోయు పదములు

పదముల పాదాలే పాటలై పారును యేరులై పొంగును

పొంగేటి పొంగునని అక్షరమది తెల్పును అక్షరమా?

నీ వెంత గొప్ప దానివే అక్షరమా || అక్షరమా!!

చరణం : జంగమాల జాతకాలు

తిర్యక్కుల తిప్పలంత

స్థావరముల అస్తిత్వం తెలుపునంత అక్షరమా!

నీ ఉనికి ఎంత గొప్పదే అక్షరమా || అక్షరమా!!

చరణం : అణువణువున నీవుందువు

అంతరిక్షమందున్నవి అక్షరమై కనుగొందువు

శాస్త్రమందు నేత్రమై సూత్రముగ నీవుందువు అక్షరమా

నీ యుక్తి నెవరెరుగుదురే అక్షరమా || అక్షరమా!!

చరణం : నీవు లేక పలుకు లేదు

పలుకు లేక పిలుపు లేదు

పలుకులోన మెలికలను అక్షరమై తెల్పుదువు అక్షరమా!

నీ ప్రాజ్ఞ ఎంత గొప్పదే అక్షరమా || అక్షరమా!!

చరణం : సమరంతో పనిలేదు

తిమిరానికి తావులేదు

సాటిరారు పోటీలేదు అక్షరమా

నీ పోటియందెవరుందురు అక్షరమా

నీ శక్తికెదురు లేదులే అక్షరమా! || అక్షరమా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com