
ప్రముఖ వ్యాపారవేత్త, అమిత్ ఖన్నా రచించిన “Words. Sounds. Images: A History of Media and Entertainment in India” పుస్తకంలో, భారతదేశంలో మీడియా మరియు వినోద రంగాల గురించి సంపూర్ణంగా వివరించారు. పురాతన కాలం నుండి భారతదేశ వినోద రంగంలో దశల వారీగా వస్తున్న మార్పులు, పురోగతి, సమస్యలు వంటి అన్ని అంశాలను ఇందులో పొందుపరిచారు. గత 45 ఏళ్లుగా మీడియా, వినోద రంగంలో ప్రయాణిస్తూ వచ్చిన అమిత్ ఖాన్...తను అతి దగ్గరగా గమనించిన అనేక ఆసక్తికరమైన విషయాలను పాఠకులతో పంచుకున్నారు. వార్తా పత్రికలు, టీవీలు, సంగీతం, రేడియో, నృత్యాలు, సినిమా హాల్, సినిమాలు.. ఇలా అన్ని రకాల వినోద రంగాల చారిత్రక ప్రయాణాన్ని అమిత్ ఖన్నా ఈ పుస్తకంలో వివరించారు.