భారతదేశంలో క్రికెట్ ఆటకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. టెస్టులు, వన్డేలు, టీ 20లు..ఫార్మాట్ ఏదైనా మ్యాచ్ వస్తుందంటే చాలు, అభిమానులు టీవీ లకు అతుక్కుపోతుంటారు. Courage, Conviction, Controversy and Cricket పుస్తకంలో రచయిత వేదం జైశంకర్ క్రికెట్ ఆటకు సంబంధించిన అనేక‌ కోణాలను విశ్లేషించారు. మైదానంలో ఆట సమయంలో జరిగిన అరుదైన, ఆసక్తికరమైన సంఘటనలతో పాటు, తెరవెనుక జరిగే సంగతులను ఈ పుస్తకంలో వివరించారు. మ్యాచ్ ఫిక్సింగ్, మన్కడింగ్, అండర్ ఆర్మ్ బౌలింగ్ వంటి వివాదాస్పద అంశాలను సైతం రచయిత ఇందులో వివరించారు. దేశాన్ని గెలిపించేందుకు పలువురు ఆటగాళ్ళు చూపిన అసమాన ప్రతిభను, ఆటగాళ్ళు, కోచ్ ల‌ మధ్య సఖ్యత, వివాదాలను రచయిత జైశంకర్, ఈ పుస్తకం ద్వారా క్రీడాభిమానులతో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com