
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన పుస్తకం ‘ఏ ప్రామిస్డ్ ల్యాండ్’. ఒబామా తన రాజకీయ జీవిత అనుభవాలను, జీవిత జ్ఞాపకాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. 2010 నవంబరులో , అమెరికా అధ్యక్షుడి హోదాలో బరాక్ ఒబామా భారతదేశ సందర్శనకు వచ్చినప్పటి అనుభవాలను ఇందులో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఒబామా తన పుస్తకంలో భారత్ గురించి అనేక అంశాలను ప్రస్తావించారు. దేశంలోని రాజకీయ నేతలు సహా రామాయణ, మహాభారతాల గురించి కూడా ఒబామా చర్చించారు. ప్రపంచంలోని ప్రముఖ రాజకీయ నేతల గురించి ఒబామా తన అభిప్రాయాలను వెల్లడించారు.