Thangedu - Slider Image

కలవారి కోడలూ ఉయ్యాలో

కనక మహలక్ష్మి ఉయ్యాలో

కడుగుతున్నది పప్పు ఉయ్యాలొ

కడవలోన పోసి ఉయ్యాలొ

 

అప్పుడే వచ్చెను ఉయ్యాలో

ఆమె పెద్దన్న ఉయ్యాలో

కాళ్లకు నీళ్లిచ్చి ఉయ్యాలో

కన్నీళ్లు తీసింది ఉయ్యాలొ

 

ఎందుకూ చెల్లెలా ఉయ్యాలో

ఏమీ కష్టాలమ్మ ఉయ్యాలో

తుడుచుకో కన్నీళ్లు ఉయ్యాలో

ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో

 

ఎత్తుకో బిడ్డనూ ఉయ్యాలో

వెళ్లి వద్దామమ్మ ఉయ్యాలో

చేరి మీవారితో ఉయ్యాలో

చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో

 

పట్టె మంచం మీద ఉయ్యాలో

పవళించిన మామ ఉయ్యాలో

మాయన్నలొచ్చిరీ ఉయ్యాలో

మమ్ము పంపుతార ఉయ్యాలో

నేనెరుగ నేనెరుగ ఉయ్యాలో

మీ అత్తనడుగు ఉయ్యాలో

 

అరుగుల్ల కూసున్న ఉయ్యాలో

ఓ అత్తగారు ఉయ్యాలో

మా అన్నలొచ్చిరీ ఉయ్యాలో

మమ్ము పంపుతార ఉయ్యాలో

నెనెరుగ నెనెరుగ ఉయ్యాలో

మీ బావనడుగు ఉయ్యాలో

 

భారతం సదివేటి ఉయ్యాలో

బావ పెద్ద బావ ఉయ్యాలో

మా అన్నలొచ్చిరీ ఉయ్యాలో

మమ్ము పంపుతార ఉయ్యాలో

నెనెరుగ నెనెరుగ ఉయ్యాలో

మీ అక్క నడుగు ఉయ్యాలో

 

వంటశాలల ఉన్న ఉయ్యాలో

ఓ అక్క గారు ఉయ్యాలో

మా అన్నలొచ్చిరీ ఉయ్యాలో

మమ్ము పంపుతార ఉయ్యాలో

నెనెరుగ నెనెరుగ ఉయ్యాలో

నీ భర్తనే అడుగు ఉయ్యాలో

 

రచ్చలో కూర్చున్న ఉయ్యాలో

రాజేంద్ర భోగి ఉయ్యాలో

మా అన్నలొచ్చిరీ ఉయ్యాలో

మమ్ము పంపుతార ఉయ్యాలో

 

కట్టుకో చీరెలూ ఉయ్యాలో

పెట్టుకో సొమ్ములూ ఉయ్యాలో

ఎత్తుకో బిడ్డనూ ఉయ్యాలో

వెళ్లిరా ఊరికీ ఉయ్యాలో

 

పుట్టినింటికీ నీవు ఉయ్యాలో

శుభముగా పోయిరా ఉయ్యాలో

మెట్టినింటికి నీవు ఉయ్యాలో

క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో

____________________________________________________

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ

 

రాగి బిందె తీస్క… రమణి నీళ్ళకు బోతే

రాములోరు ఎదురాయేనమ్మో… ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడలోన

 

వెండి బిందె తీస్క… వెలది నీళ్ళకు బోతే

వెంకటేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

 

బంగారు బిందె తీస్క… భామ నీళ్ళకు బోతే

భగవంతుడెదురాయే నమ్మో… ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

 

పగిడి బిందె తీస్క… పడతి నీళ్ళకు బోతే

పరమేశుడెదురాయే నమ్మో… ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికెనమ్మో… ఈ వాడ లోన

 

ముత్యాల బిందె తీస్క… ముదిత నీళ్ళకు బోతే

ముద్దుకృష్ణుడెదురాయే నమ్మో… ఈ వాడలోన

చిత్తూ చిత్తుల బొమ్మ… శివుని ముద్దుల గుమ్మ

బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com