కళ్ళద్దాలూ చూడగలవు

మాట్లాడగలవా కళ్ళలా

పట్టువస్త్రమూ అల్లుకోగలదు

సుఖాన్నివ్వగలదా దేహస్పర్శలా

ప్లాస్టిక్కూ సౌఖ్యాన్నివ్వగలదు

కట్టెలా పరిమళాన్నివ్వగలదా

కనీసం మరణించగలదా

మడి అక్షయపాత్ర కాగలదు

కాకుంటే ఉరిపెట్టుకోగలదు

కంప్యూటర్ కన్నెత్తి కనికరించగలదా

కోక్ తంత్రుల దరిదాకా రాగలదు

నాళాల్లో లయ కాగలదా తాళవృంతంలా

నయనాల్లో తేట కాగలదా నారికేళంలా

2

అదొక జీవ రసాయనిక మంత్రం

3

వంద టన్నుల్ని గిరగిరా తిప్పకపోవచ్చు

కోట్ల అంకెల గణిత గుణిత భాగాహర ఎమ్సీ స్క్వేర్ సమాహార చిప్స్ కాలేక పోవచ్చు

అసంగతుడు కాగలడు

నిర్గమన ప్రవేశ అక్షాంశరేఖల్లో అస్థిమితుడు కాగలడు

సకల ప్రకృతి విపత్తుల వికృతుల లక్ష్యం అతడే కాగలడు

విశ్వాంతరాళ చిట్టచివరి రహస్యాన్ని అతడే ఛేదించగలడు

అతడొక జీవ యంత్ర రసాయనిక ట్రిలియన్ చిట్ల సూక్ష్మాతి సూక్ష్మ విశ్వరూపం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com