-కందనామాత్యుడు

కందన క్రీ.శ.14 శతాబ్దం లో రామగిరిని పాలించిన ముప్పభూపాలుని మంత్రి. కందన అన్న కేసన కూడా మంత్రియే. కందన కరీంనగర్ సమీపంలోని వెలిగందలకు మంత్రిగా పాలించాడు. వెలిగందలామాత్యుడు, కందనామాత్యుడు అని పేరు. ఈ కాలంలోని మడికి సింగన ఈతనికి మిత్రుడు. మడకి సింగన కృతులను కందనకంకితమిచ్చాడు. కందన నీతితారావళి పేరుతో ఒక కృతిని రచించాడు. మడికి సింగనకూడా కలనీతి సమ్మతము పేరుతో ఒక సంకలనం చేశాడు. అందులో కూడా ఇతని పద్యాలున్నాయి. కందన వ్రాసిన నీతిపద్యాలలో కొన్ని ఇవి.

నములందనిశంబు యశమునకు కుదురైనా

శము లేక నెగడు నక్కా

వ్యము ధారుణిలోన నౌబజార్యుని కందా!

కం. ధరనొప్పు నీతిమార్గము

పరికింపక తిరుగుమంత్రి పని మంత్రములే

కురు విషభుజగము పట్టిన

కరణి సుమీ యౌబలార్యు కందన మంత్రీ!

కం.బలవంతుడు మన్నించిన

బలహీనుడు బలియుడనగబడు ధారుణిలో

వలరాయడు చేపట్టిన

యలరులు బాణములు గావె యౌబళ కందా!

కం. తన్నని నమ్మిన బ్రోవక

పొన్నాకుల మీద తేనె పూసిన భంగిన్

నున్నని మాటల యన్నల

మన్నన లేమందు మబ్బమంత్రియు కందా!

కం.వివిధకళాకోవిదుడై

సవినయుడై యీవి గలిగి సంగరజయుడై

నివుడని నృపతుల బొందునె

యువిదయు కీర్తియును నౌబళోత్తమ కందా !

కం. ఖలు సంగతి గూడిన ని

ర్మల చిత్తుండైన జేయు ప్రతికూలుండై

యల నూనియ కర్పూరము

గలసిన విషమైన యట్లు కందామాత్యా !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com