గ్రామీణ జీవితంలో సామెతలు కవిత్వానికి ఏమీ తీసిపోవు. అలాంటి సామెతలు సేద్య సందర్బంలో ఎలా వస్తాయో తెలుపుతున్నవ్యాసం…

సామెతల శాస్త్రాన్ని ఆంగ్లంలో “Paremiology” అంటారు. సామెతలపై చేసే అధ్యయనాన్ని “Paremiography” గా అభివర్ణిస్తారు. సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు వంటిదని పెద్దలు సామెత మీద సామెత చెప్పారు. ఇది నిజం. మాట రాణించాలన్నా, భావం గుంభనం కావాలన్నా ‘సామెత’ వ్యవహారంలో ఉండవలసిందే. సంస్కృతికి, వైభవానికి, అస్తిత్వానికి, ఆనందానికి, ఆవేశానికి ‘సామెత’ ప్రతీకగా నిలుస్తుంది. సమాజంలోని దురాచారాలను, చెడును, చాదస్తాన్ని హేళన రూపంలో, వ్యంగ్యరీతిలో, పరిహాసపు పలుకులతో చెప్పడం సామెతల ఉద్దేశం. ఇది ఎంతో అర్థవంతంగా, సంపూర్ణ భావాన్ని తెలుపుతాయి. సమాజం యొక్క పూర్తి స్వభావం ఒక్క సామెతల్లోనే | ఒదిగిపోతుంది. జాతి సమైక్యతకు,

జాతి పునర్నిర్మాణానికి, వ్యవస్థ పునరుజ్జీవనానికి సామెతలు ప్రధాన భూమిక వహిస్తాయి. ప్రాస, ఫదగుంభనం, రసస్పూర్తి, ఆలంకారిక శైలి, ధ్వని, గూఢత వంటి విభిన్న వైవిధ్య సారూప్యంతో సామెతలు జన వ్యవహారంలో భాగమైనాయి. భాషా సౌందర్యం, అనుభవసారం, నీతి సూచ్యం, హాస్యం కలగలిసి ఉన్నదే సామెత. అనుభవ సారాన్ని నీతిని ఉపదేశించడం, సంశయ నివారణం చేయడం, కార్యోన్ముఖతను కావించడం, ప్రమాద హెచ్చరికలను సూచించడం, వాదనకు ముక్తాయింపు పలకడం వంటి ప్రయోజనాలు సామెతల ప్రయోగంలో భాసిస్తాయి. తెలుగు భాషకే సొంతమై తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను సామెతలు ఎల్లవేళలా పరిరక్షిస్తున్నాయి. అనాది కాలం నుండి తెలుగులో సామెతలు సూక్తులుగా, సుభాషితాలుగా, జనాంతికాలుగా, లోకోక్తులుగా, శాస్త్రాలుగా వ్యవహార రూపంలో ఉన్నాయి. సామెతలు పదాలు, పదబంధాలు, వాక్యాల రూపంలోనే గాక; కథల రూపంలో, పాటల రూపంలో, పద్య రూపంలో కూడా ఉన్నాయి. అవి ప్రయోగ ప్రాధాన్యాన్ని బట్టి పౌరాణిక, చారిత్రక, సాంస్కృతిక, సామాజిక సామెతలుగా విభజింపబడ్డాయి. వ్యవహార శైలిని అనుసరించి ఆక్షేపణ, సంభాషణ, సంవాద, చమత్కార, ఉపమాన సామెతలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఆయా జాతులు, తెగలకు సంబంధిం చినవి కూడా చాలా సామెతలు నిత్య వ్యవహారంలో కనిపిస్తాయి.

సామెతలకు వివిధ లక్షణాలు నిర్ణయించబడ్డాయి. అవి సంప్రదాయ బద్ధమైనవి. జన ప్రియత్వం కలవి.

భావాలంకారాలు ఉండవు. వయస్సు నిర్ణయం లేదు. సరిహద్దు నిర్ణయం లేదు. ఆక్షేపణ, వ్యంగ్యం కలవి. సామెతలు రూపాయి నాణెం వంటివి. చెలామణిలోకి వస్తేనే విలువ పెరుగుతుంది. సంఘంలో కొన్ని సూత్రాలు, వాక్యాలు సామెతలుగా గుర్తింపు పొందాయి. విశేష లోకానుభవాన్ని గడించినవే సామెతలు, విశేషార్థము గర్బితమై ఇవి ప్రయోగింపబడతాయి. దేశీయపద సమ్మిళితమై స్వచ్చతను ప్రదర్శిస్తాయి. నీతి బోధకాలుగా ఉండి ప్రాపంచిక జ్ఞానాన్ని తెలుపుతాయి. తక్కువ శబ్దాలతో ప్రజాబాహుళ్యంలోకి ఎక్కువ చొచ్చుకొని పోతాయి.వివేకాన్ని కలిగించడం. సంక్షిప్తంగా ఉండడం. అల్పాక్షరాలలో అనల్పార్థం స్ఫురించడం. సామాజిక కట్టుబాట్లకు కట్టుబడి ఉండడం. చారిత్రకాంశాల సంబంధం కలవి. పౌరాణిక, ఇతిహాస కథల నేపథ్యం కలవి. ఈ సామెతలకు

జనుల ఆచారాలకు, వ్యవహారాలకు, మనోభావాలకు అనుగుణంగా ఉంటాయి. సన్నివేశానికి, సంవాదానికి సందర్భానుసారంగా వాడబడుతాయి. ఎంత కటువైన విషయాన్నైనా మెత్తగా చెబుతాయి. బలహీనమైన వాదమైన సామెతల జోడింపుతో బలం పొందుతుంది. సంభాషణలకు చైతన్యం, ఉత్తేజం కలుగుతుంది. ఉపన్యాసకళకు నైపుణ్యం ఏర్పడుతుంది. పూర్వీకుల అనుభవాలకు సామెతలు వారధిగా నిలుస్తాయి.

జాతి నాగరికతను పరిఢవిల్లజేసి ఆనందమయ జీవితాన్ని అందిస్తాయి.

In the potted wisdom of the world’s proverb Literature, there is shrewdness, Commonsense, Good sense and at the same time we find a penetrating profundity, humour and satire and expendient salvation. – Epic Pertridge జాతి సమైక్యత,

జాతి పునరుజ్జీవానికి, సమిష్టి జీవనం, సామాజిక చైతన్యానికి సామెతలు వ్యవహారంలో ఉన్నాయి. నిరంతరం జన నానుడిలో చెలామణి అవుతున్నాయి.

భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. వృత్తి ప్రధానమైంది. చాతుర్వర్ణ నిర్మిత వ్యవస్థలోని వృత్తి జీవితం

భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలోని మరే ఇతర దేశాలలో ఇటువంటిది కనిపించదు. మన దేశంలో వ్యవసాయం

మొదలుకొని ఒక్కో కులానికి ఒక్కో వృత్తి జీవనం ఏర్పడి ఉంది. తెలుగు

ప్రాంతాలలో వృత్తి ప్రధాన జీవనాధారంగా నిలుస్తుంది. తెలుగు ప్రజల జీవితమే వృత్తిలో మిళితమై ఉంటే; పుట్టిన సామెతలన్నీ ఆ వృత్తికి లేదా ఆ జాతి జీవనానికి సంబంధించినవే అయి ఉంటాయి. దాదాపుగా సామెతలన్నీ ఆయా వృత్తుల నుండి ఉద్భవించినవే. ఒక విధంగా వృత్తి సంబంధిత సామెతలను అధ్యయనం చేయడమంటే పూర్తి సామెతలను అనుశీలించవలసిందే. వ్యవసాయ వృత్తిలో అనురాధ నక్షత్రం

మొదలుకొని ఆరుద్ర, చిత్త, పుష్యమి, మూల, రోహిణి, స్వాతి, హస్త వరకు; ఎరువు, ఏతాము, కలుపు, కొల్లేరు, దుక్కి, నాగలి, పైరు, రైతు, వడ్లు, విత్తనం, కంది, కంద వంటి వాటిపై సామెతలు అనేకం ఉన్నాయి. పాడి – పశు పోషణకు సంబంధించి కూడా ఎద్దు, గోవు, దూడల పై సామెతలు ఉన్నాయి. పాడి – పంటలు పరస్పర సమన్వయ వృత్తులు కాబట్టి సామెతలు కూడా వ్యవసాయానికి, పశుపోషణకు అనుసంధానించబడ్డాయి. వ్యవసాయం…

భారతదేశం క్షేత్ర భూమి. వాతావరణ అనుకూలతను బట్టి మనదేశంలో వ్యవసాయం అధికం. మొదటి పంచవర్ష ప్రణాళికలో భారత ప్రభుత్వం వ్యవసాయానికే ప్రాధాన్యం ఇచ్చింది. దీని మీదనే సమాంతర వృత్తులెన్నో ఆధారపడి ఉన్నాయి. భారతదేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీదనే గణింపబడుతుంది. తలసరి వార్షిక ఆదాయ వృద్ధి సూచి ధాన్యపు ఉత్పత్తుల మీదనే సమీకృతమవుతుంది. మనదేశంలో పట్టణాభివృద్ధి కన్నా గ్రామ వికాసమే మిన్నగా ఉంది. గ్రామ పరిసర

ప్రాంతాల్లోనే భూకమతాల విస్తీర్ణం అధికం. వ్యవసాయం పాదుకొల్పింది పల్లె ప్రజలే. వీరే జానపదులు. జానపదుల ఒరవడి నుండి అనేక వ్యవసాయ సామెతలు పుట్టుకొచ్చాయి. దేశానికి అన్నం పెట్టే రైతు గొప్పతనాన్ని, కీర్తిని, శ్రమ శక్తిని, ఔదార్యాన్ని సామెతలు వివరంగా చెప్పాయి. ఏనుగే చేను మేస్తే కాచేవాడు ఎవడు’ వంటి సామెతలు కూడా రైతు జీవితంలో ఎదురవుతున్న కష్టాలను తెలియజేస్తాయి. ఏఏ కాలాల్లో ఎటువంటి పంట వేయాలి? వాటి వాతావరణ పరిస్థితులు ఎటువంటివి? ధాన్యం రుగ్మత ఎట్టిది? వర్షాభావం గల కాలం ఏది? కాలానికి ఎదురీది పంట నిలబడుతుందా? అనే సందేహాలతోనే కార్తె (కాలం)లు పుట్టుకొచ్చాయి. ఏఏ నక్షత్రాలలో కాలం అనుకూలంగా ఉంటుందో రైతు బాగా ఎరిగినవాడు. అందుకే వ్యవసాయంలో కాలం ప్రాధాన్యం పెరిగింది. • సేద్యంలో అనురాధ కార్తె అనుకూలమైంది. సామెతలు ఇదే చెబుతున్నాయి. వ్యక్తుల మనోరోగాలను పోగొట్టే కాలం ఇది.

– అనురాధలో అడిగినంత పంట.

– అనురాధలో తడిస్తే మనోరోగాలు పోతాయి.

– అనురాధ కార్తెలో అనాథ కజ్జయినా ఈనుతుంది.

• ఆరుద్రలో విస్తారమైన పంట పండుతుంది. ఈ కార్తె గూర్చిన సామెతలు అధికంగానే ఉన్నాయి. వర్ష ఋతు ప్రభావం అధికం. వ్యవసాయ పంటలు ఎక్కువగా ఉంటాయి. అన్ని కార్తెలలో కెల్లా అత్యంత ప్రభావవంతమైంది ఆరుద్ర. ఆముదం పంటకు అనుకూలమైంది. స్త్రీల శ్రమ శక్తికి అధిక ప్రాధాన్యం ఇచ్చి గౌరవించే సామెతలు ఈ కార్తెలోనే పుట్టుకొచ్చాయి. – ఆరుద్రలో అదనుసరి – ఆరుద్ర వాన అదను వాన – ఆరుద్ర కురిస్తే దారిద్ర్యం లేదు

– ఆరుద్ర కురిస్తే ఆరు కార్తెలు కురుస్తాయి – ఆరు కార్తెలకు పోతు ఆరుద్ర కార్తె

– ఆరుద్ర వానకు ఆముదములు పండును

– ఆరుద్రలో తడిస్తే ఆడది మగవాడవుతాడు

– ఆరుద్రలో తడిస్తే ఆడది మగవాడవుతాడు

– ఆరుద్రలో వేసినా ఆరికా, ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే

– ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నము పెట్టిన ఇంటికి సేగిలేదు

– ఆరుద్రలో అడ్డెడు చల్లితే పునాసకు పుట్టెడు పండుతుంది

•చిత్తకార్తెను గూర్చిన హెచ్చరికను సామెతలు మొదటగానే తెలిపాయి. కానీ అందులో కూడా ఈ కార్తె ఉలవ పంటకు అనుకూలమైందట.

– చిత్తలో చిట్టెడు చల్లితే అడ్డెడు పండును.

– చిత్తలో చిల్లితే చిత్తుగా పండును ఉలవ.

• పుష్య కార్తె కూడా చిత్త లాంటిదే. రైతులు ఈ ఈ కాలాలలో సేద్యానికి దూరంగా ఉండాలనే నిర్దేశాన్ని సామెతలు కలిగించాయి.

– పుష్య మాసానికి కూసంత వేసంగి.

– పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లిందే మేలు.

• పునర్వసు కార్తెకు ఒక ప్రత్యేకత ఉంది. పంట గమ్మాళం నిండుతుందని సామెత చెబుతుంది.

– పునర్వసు కార్తెలో చిట్టెడు విత్తితే గరిసెడు పండును.

• విభిన్నమైన కార్తె మూల. పంట ఇంటి కొచ్చే కాలంగా సామెత నిర్ణయి

స్తుంది

– మూలకార్తెకు వరి మూల చేరుతుంది.

– మూలలో చల్లితే ఉలవలు మూడు పువ్వులు ఆరుకాయలు.

• రోహిణి కార్తె సేద్యానికి ఏమాత్రం పనికిరానిది. గ్రీష్మఋతు ప్రభావంతో ఎండలు దంచికొడతాయి. పంట పొలాలు బీడులు వారుతాయి. ఈ కార్తె స్థితిని సామెతలు వివరించాయి.

– రోహిణిలో విత్తనం రోళ్ళు నిండని పంట

– రోహిణిలో జొన్నలు సాహిణిలో గుజ్జాలు. – రోహిణిలో విత్తులు రోటిలో విత్తుటే.

– రోహిణిలో రోకళ్ళు చిగిర్చనన్నా చిగిరిస్తవి. రోళ్ళు పగులనన్నా పగులది.

– రోహిణి కార్తెలో విత్తులో విత్తులు వేస్తారు. మృగశిరలో ముంచి వేస్తారు.

• వర్షాలు విస్తారంగా పడేవి స్వాతి కార్తె. రైతు కష్టాలను గట్టెక్కించేది ఈ కార్తె. ఈసామెతలు స్వాతి కార్తె పై ప్రశంసలు కురిపించాయి. – స్వాతి వర్షం చేనుకు హర్షం – స్వాతి విత్తనం స్వాతి కోపులు – స్వాతి కురుస్తే చట్రాయి కూడా పండును

– స్వాతి కురిస్తే పిడితలలోకి రావు జొన్నలు

– స్వాతి కొంగ పంట కాపు నీళ్ళున్న చోటే ఉంటాయి.

• హస్త కార్తెలలో మొదటిది. రైతు నాగలి పట్టి దున్నేది ఈ కాలంలోనే. హస్తపై సామెతలు జన వ్యవహారంలో చాలా ఉన్నాయి.

– హస్తకు ఆది పంటా చిత్తకు చివరి పంటా.

– హస్తలో ఆకు అల్లాడితే చిత్తలో చినుకు పడదు.

– హస్త పోయినా ఆరుదినాలకు అడక్కుండానే విత్తు.

– హస్త చిత్తలు వప్పయితే అందరి సేద్యం ఒక్కటే.

– హస్తలో అడ్డెడు చల్లేకంటే చిత్తలో చిట్టెడు చల్లేది మేలు.

పంటకు ఎరువు ప్రాణాధారమైంది. ప్రకృతి సిద్ధమైన ఎరువు పంటకు పోషణను ఇస్తుంది. ప్రాచీన కాలం నుండి ఎరువు సహజంగా తయారుచేసుకొనే విధానం రైతులు అవలంబిస్తున్నారు. చీడ పీడల నుండి రక్షింపబడడానికి, పంట దిగుబడి పెరగడానికి వ్యవసాయంలో ఎరువుల వాడకం అధికం. కాంపోస్టు ఎరువును తయారుచేసుకోవడం ఇప్పటికీ

గ్రామీణ వ్యవసాయదారులు ఆచరిస్తున్నారు. జంతు, పక్షి వ్యర్థాల నుండి బయో ఎరువు ఏర్పడుతుంది. ఆర్గానిక్ ఎరువుల వాడకం వల్ల పంటలు విస్తృతంగా పండుతాయని పెద్దలు చెబుతారు. బలవర్ధకమైన పంట వంగడాల ఉత్పత్తికి ఈ పద్ధతి అనువైంది. కానీ నేడు అన్ని కృత్రిమ ఎరువులే ఉపయోగిస్తున్నారు. విత్తనాలు చల్లినప్పటినుండి మొదలుకొంటే

మొలకలెత్తడం, పైరు పెరిగి పెద్దగా కావడం, పంట చేతికి రావడం వరకు అన్ని వేళల్లో ఎరువును పిచికారీ చేస్తూనే ఉంటారు. ఎరువు వాడకం ఎటువంటిదో సామెతలు చెబుతున్నాయి. – ఎరువులేని పైరు పరువులేని రైతు. – ఎరువు ఉంటే వెజ్లవాడు కూడా సేద్యగాడే.

– ఎరువు పెట్టిన పొలం ఏలుబడి అయిన కోడలు.

– ఎరువును అమ్మి బొంతను పొయ్యిలో పెట్టుకున్నట్లు

అనాదిగా ఏతాము పాటకు వ్యవసాయంలో ప్రశస్తి ఉంది. కర్షకులు శ్రమశక్తిని మరవడానికి మొదట ఎత్తుకొనే పాట ఏతాము. కష్టాల కడలిని ఆ పాటలో మరిచిపోతుంటాడు రైతు. ఏతాములో ఉన్న అనుబంధాన్ని సామెతలు పొగడినాయి.

– ఏతాము పాటకు ఎదురు పాట లేదు

– ఏతాము ఎంత వంగినా తిరిగి లేవడానికే కదా

– ఏతాము నేలకు వంగడం లోతు నీళ్ళు తేనె గదా

రైతుకు అవస్థ కలుపుతోనే. పంట పెరుగుదలకు ఆటంకంగా ఉంటుంది. అశ్రద్ధ చేస్తే చేనునే మింగేస్తుంది. పంట దిగుబడిని నాశనం చేస్తుంది. జాగ్రత్త వహించవలసిన విషయాలను సామెతలు తెలియజేస్తాయి.

– కలుపుతీయని వానికి కసవే మిగులును

– కలుపుతీయని వాడు కోత కోయడు – కలుపుతీయని పైరు కట్ట చేయదు

సేద్యానికి నీటి వనరులు ప్రాధాన్యం వహిస్తాయి. ఆయా చెరువులు, కాలువలు గల పరిసర ప్రాంతాల్లో వ్యవసాయం నిరంతరం కొనసాగుతుంది. సారవంతమైన నేలలో పంట దిగుబడి వృద్ధి చెందుతుంది. అందుకే మైదాన

ప్రాంతాల్లో సాగుబడికి కొదువలేదు. కాని కొల్లేరు సంగతి వేరుగా ఉంది. అది సామెతల ద్వారానే తెలుస్తుంది.

– కొల్లేటి పంట కూటికే చాలదు. – కొల్లేటి వ్యవసాయం గొడ్ల వినాశనం – కొల్లేటి వ్యవసాయానికి కోత కూడ దండగ

మొదట వ్యవసాయంలో దుక్కి దున్నడం ప్రధానం. ఎంత దున్నితే నేల అంత చదును అవుతుంది. ఈ దుక్కినే వివిధ ఉపమానాలతో పోల్చాయి సామెతలు.

– దుక్కి కొద్ది పంట బుద్ది కొద్ది సుఖం

– దుక్కి చలువే చలువ తల్లి పాలే పాలు

నాగటి చాళ్ళలోనే విత్తనాలు చల్లేవి. పైరు పండేది. నాగలి సేద్యంలో ప్రధాన సాధనం. కొన్ని ప్రాంతాల్లో పొలాల అమావాస్య చేస్తారు. వ్యవసాయ పని ముట్లను పూజిస్తారు. ఇందులో నాగలిని పూజించడం ముఖ్యం. నాగలికి ఆకలికి మధ్య అంతరాన్ని చెబుతున్నాయి సామెతలు.

– నాగలి ఉన్న ఊళ్ళో ఆకలి చేరదు – నాగలి భూమిలో నవధాన్యాలు పండుతాయి

– నాగలి మంచిది కాకపోతే ఎడ్లు ఏమి చేస్తాయి.

విత్తనంలో మహావృక్షం దాగి ఉంది. అనంత విశ్వం నిండి ఉంది. సకల జనుల ఆకలి తీర్చే పదార్థం విత్తనంలోనే ఉంది. పూర్వకాలంలో విత్తనాలను సహజ పద్ధతిలో భద్రపరిచేవారు. నేడు శాస్త్రీయ పద్ధతుల ద్వారా మేలు రకమైన విత్తన ఉత్పత్తులను చేస్తున్నారు. పండిన పంట ద్వారా వచ్చిన అన్ని రకాల ధాన్యాలు విత్తనాలు కావు. ఫలదీకరణ చెంది

మొలకెత్తడానికి సిద్ధంగా ఉండేవే విత్తనాలుగా పరిగణింపబడుతాయి. ఈ నిగూఢమైన విషయాలు మన పెద్దలకు పాతకాలం నుండే తెలుసు. విత్తనాల మీద సామెతలు అనేకం పుట్టాయి.

– విత్తనం కొద్దీ మొక్క – విత్తనాలుంటేనే పెత్తనాలు – విత్తుకన్నా క్షేత్రం మెరుగు – విత్తుటకు వేయి విత్తులు

– విత్తనం వేసి పొత్తు కలిపినట్లు – విత్తనంలో లేనిది విశ్వంలో లేదు

– క్షేత్ర మెరిగి విత్తనము పాత్ర మెఱిగి దానము

– విత్తనంబు మజ్జి వృక్షంబునకు నెంత

– విత్తు మంచిదయితే కాయ మంచిదగును

– విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి

మొలుచునా

– విత్తనానికి దాపరికం విద్యకు వెల్లడి అవసరం

– విత్తనాల సంచులు మంచిదయితే విత్తపు సంచులు నిండును

పచ్చని పైరు పండినప్పుడే రైతు కళ్ళలో ఆనందం వెల్లి విరుస్తుంది. పైరు కలిగిన వాడే భాగ్యవంతుడవుతాడు. రైతు కష్టాలు తీరుతాయి. వేసిన ప్రతి విత్తనం

మొలకెత్తినప్పుడు పంట దట్టంగా పెరుగుతుంది. పైరు పెరగడానికి రైతులు అవలంబించే పద్ధతులు అనేకం ఉన్నాయి. పూర్వకాలంలో అయితే భూమిలో సారం అయిపోతే పోడు వ్యవసాయం చేసేవారు. ఆ భూమిని వదిలి పెట్టి వేరే భూ కమతాలను చదును చేసుకొని సేద్యం చేసేవారు. అంతేగాక భూ కమతాలు పరిమితమవుతున్న సందర్భంలో పైరు మార్పిడిని అలవాటు చేసుకున్నారు. పైరు పట్ల రైతుల స్వయం సిద్ధతను సామెతలు ఎల్లవేళలా చెప్పుకొచ్చాయి.

– పైరుకు రాగులు భాగ్యానికి మేకలు – పైరు మార్చిన పంట పెంపు – పైరు గాలి తగిలితే పంట ఊరదు – పైరు నిడిన వాడు బహు సౌఖ్యవంతుడు – పైరుకు ముదురు పసరానికి లేత – పైరు పలచనైతే పాతళ్ళు నిండుతవి – పైరు మెండైతే వాములు దండి

మనం పండించే ధాన్యంలో వడ్లు ప్రధానమైనవి. దక్షిణ భారతదేశంలో ప్రజల ప్రధాన ఆహారపు పంట వరి. మన రాష్ట్రంలో కల్పించిన ప్రాజెక్టుల మూలంగా నీటి వనరుల శాతం పెరిగి వరి దిగుబడి బాగా వస్తుంది. వడ్ల మీద సామెతలు:

– వడ్ల గింజలోనిదే బియ్యపు గింజ – వడ్లు, గొడ్లు ఉన్న వానిదే వ్యవసాయం పంటల్లో వరి తర్వాత కంది పంట మీద ఎక్కువ సామెతలు పుట్టుకొచ్చాయి. కంది పంటకు, కాపు వాడికి చక్కటి పోలికలు చెప్పాయి. కొన్ని ప్రాంతాలలో కంది పంటతో గట్టెక్కిన రైతుల జీవనస్థితిని వర్ణించాయి.

– కంది పండితే కరువు తీరును

– కంది చేనులో కర్రు పోగొట్టుకొని, పప్పు చట్టిలో వెదికినట్లు

– కంది గింజను, కాపు వాడిని వేచనిదే చవిగావు.

– కళ్ళెం వెళ్ళిన తర్వాత కంది గుగ్గిళ్ళు దుంపలలో కందగడ్డపై సామెతలు వెల్లి విరిసాయి. సహజంగా కందకు దురదెక్కువ. ఈ గుణాన్ని సామెతల్లో పెట్టి ప్రజల జీవన వ్యవహారాల్లోకి తీసుకొచ్చాయి. ఒడుపు తనంతో కూడిన హెచ్చరిక ఉంటుంది. – కందకులేని దురద కత్తి పీటకెందుకు – కందకులేని నస బచ్చలికెందుకు – కందకులేని దూల చేనుకెందుకు – కాని చోట కందయినా కాయదు ఇక సామెతల్లో రైతు కష్టాలను, కడగండ్లను తెలిపేవి ఉన్నాయి. ప్రత్యేకంగా రైతు జీవితాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ప్రకృతికి, ప్రళయానికి ఎదురు తిరిగి రైతు పండించే పంట సమస్త మానవాళి పోషణకు ఆధారమవుతుంది. అందుకే రైతు సంక్షేమానికి రాజ్యాలు ప్రాధాన్యం ఇస్తాయి.

– రైతు క్షేమం రాజు భాగ్యం – రైతు పాడు చేను బీడు – రైతు బీదగాని చేను బీదగాదు – రైతు లెక్క చూస్తే నాగలి కూడా మిగలదు

వ్యవసాయానికి సంబంధించిన చాలా సామెతలు నిజాం కాలంలో పుట్టి ఉండ వచ్చు. భూస్వామ్య విధానంలో రైతు – రైతు కూలి అయ్యాడు. రైతు కూలి – కూలి అయ్యాడు. భూమి కోసం – భుక్తి కోసం – వెట్టి చాకిరి నిర్మూలన కోసం తెలంగాణ సాయుధ పోరాటం ఏర్పడింది.

భూమి శిస్తు కట్టలేక రైతుకూలీలు దొరలకు బానిసలు అయ్యారు.

అతి వృష్టి, అనావృష్టి ఏర్పడి పంట చేతికి రాక శిస్తులో కట్టవలసిన ధాన్యం అప్పు పడేవారు. దీనిని తర్వాత పంటలో నాగుల కింద జమచేసేవారు. ఆ పంటలో కూడా నష్టం వాటిల్లితే నాగులు పెరుగుతూ పోయేవి. ఇలా ఒక్కోసారి పంట పండినా అంతా శిస్తులోనే కట్టబడేది. వేయి పుట్ల గింజలు పండించినా, తినడానికి తిండి లేని స్థితిని నిజాం కాలంలో గమనించవచ్చు. దౌర్జన్యం, దోపిడీలతో నాడు బూర్జువా వ్యవస్థ అమలయ్యేది.

– అన్ని పండించిన రైతుకు అన్నమే కరువు

– అతివృష్టి అయినా అనావృష్టి అయినా ఆకలి బాధ తప్పదు

– అడ్డెడు వడ్ల ఆశకు పోతే తూమెడు వడ్లు దూడ తిని పోయినట్లు పాడి – పశుపోషణ…

వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణను చేపట్టడం రైతులలో కనిపిస్తుంది. పాడి ఉంటేనే సేద్యం సాగుతుంది. ఆవులు, గేదెలు, ఎద్దులు, లేగలు, దూడలు పొలం ఉన్న వారికి తప్పనిసరిగా ఉంటాయి. కొందరు ప్రత్యేకంగా పశుపోషణనే ఆధారంగా చేసుకొని జీవిస్తుంటారు. ఈ పాడి, పశు పోషణకు సంబంధించిన అనేక సామెతలు తెలుగు జన జీవనంలో ఉన్నాయి. పాడి నుండి లభించే అనేక ఉత్పత్తులు సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగిస్తాయి.

మొదట పాడి గూర్చిన సామెతలు చూద్దాం. పాడి పంటలు పదబంధాలు, జంట పదాలుగా స్వీకరిస్తాం. పశువులు మానవ జీవితంలో కూడా అనుబంధాలను ఏర్పరచుకుంటాయి. కారుణ్యాన్ని చూపుతాయి. వాటి పేడ ఎరువుగా పనికి వస్తుంది.

– పాడి గుట్టు పంట రట్టు – పాడితో పంట ఓపదు – పాడిలేని గొడ్డు, బిడ్డలేని ఆలు – పాడి లేని ఇల్లు పేడలేని చేను – పాడిలేని ఇల్లు పాడు బడ్డ నీరు – పాడికి పసి బిడ్డకు దిష్టి లేదు – పాడి కుండ పగులగొట్టుకొన్నట్టు – పాడి గాచవలె పంట పొగడ వలె- పాడి గుట్టు పంట రట్టు – పాడితో పంట ఓపదు – పాడిలేని గొడ్డు, బిడ్డలేని ఆలు – పాడి లేని ఇల్లు పేడలేని చేను – పాడిలేని ఇల్లు పాడు బడ్డ నీరు – పాడికి పసి బిడ్డకు దిష్టి లేదు – పాడి కుండ పగులగొట్టుకొన్నట్టు – పాడి గాచవలె పంట పొగడ వలె

పశు పోషణ వృద్ధి చెందాలంటే లేగలు. దూడలు పుట్టాలి. రైతులకు సంతోషాన్ని కలిగించే పశు సంపద మీద సామెతలు ఉన్నట్లే దూడలకు సంబంధించినవి కనిపించాయి.

– దూడ లేని పాడి దు:ఖపు పాడి

వ్యవసాయ పనుల్లో ఎద్దులు చేదోడు వాదోడుగా ఉంటాయి. కష్టించి పనిచేస్తాయి. నాగలిని భుజాలకు కట్టుకొని పొలం దున్నుతాయి. బీడువారిన భూమిని చదునుచేస్తాయి. ఎద్దుల పనితనాన్ని తెలుగు సామెతలు చాలా గొప్పగా ప్రస్తావించాయి.

– ఎద్దు కొద్ది సేద్యం సద్ది కొద్ది పయనం

– ఒంటి ఎద్దు సేద్యం ఒరుకాలి నొప్పి

– జోడెద్దులకే తెలుసు నాగలి కాడి బరువు

– గుడ్డెద్దు చేనులో పడ్డట్లు- గుడ్డెద్దు చేనులో పడ్డట్లు

– పెద్ద ఇంటి బొట్టె ఎద్దులున్న వ్యవసాయం

పాడిలో పాల ఉత్పత్తులు అధికం. పశుపోషణలో సమగ్ర ఆదాయం ఈ ఉత్పత్తుల వల్లనే కలుగుతుంది. సమీకృత ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాయి. పాలు, పొదుగుకు సంబంధించిన సామెతలు ఉన్నాయి. – పొదుగు కోసి పాలు తాగినట్లు

– పొదుగు చింపిన పసరం పోతునీనుతుందా

– పొదుగులో ఉన్నా ఒకటే దుత్తలో ఉన్నా ఒకటే అన్నట్లు

– పొదుగులేని ఆవు పాలిస్తుంటే నాలికలేని

పిల్లి నాకేసిందట ప్రాచీన కాలం నుండి సంప్రదాయమైన వృత్తులను ఆధారంగా చేసుకొని తెలుగు ప్రజల జీవన వ్యవహారంలో ఉన్న సామెతలు ఇవి. ఈ సామెతలన్ని ఆయా వృత్తుల పరిభాషల్లో ఉన్నా కానీ ఇవి సామాజిక చిత్రికకు దర్పణం పడుతాయి. నీతిని, ధర్మాన్ని, సంఘ జీవనాన్ని, కలిసికట్టుతనాన్ని నేర్పుతాయి. వృత్తులన్నింటిలో ఉన్న పరస్పర సమైక్యతా భావాన్ని తెలుపుతాయి. సమిష్టి సామాజిక ప్రయోజనానికి ప్రాధాన్యం వహిస్తూ, సంభాషణల్లో ప్రావీణ్యాన్ని, కళాత్మకతను ప్రదర్శిస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com